మోహన్ బాబు నుంచి రాజ్ తరుణ్ వరకు 2024 లో పోలీస్ కేసులు ఎదుర్కొన్న సినిమా సెలబ్రిటీలు వీళ్లే..
ప్రస్తుతం మంచువారివివాదం చూస్తూనే ఉన్నాయి. ఇండస్ట్రీని షేక్ చేస్తుంది ఈ కాంట్రవర్సీ.. ఇలా 2024 లో పోలీస్ కేసులు ఎదుర్కొన్న టాప్ సినిమా సెలబ్రిటీలు ఎవరెవరంటే..?
సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ.. తప్పు చేస్తే కేసులు ఎదుర్కొక తప్పదు. వివాదాలు కూడా తప్పవు. అయితే సామాన్యుల వివాదాలు బయటకు రావు.. కాని సెలబ్రిటీల వివాదాలంటే.. ఆ రచ్చ అంతా ఇంతా ఉండదు. అందరి ఇంట్రెస్ట్ దానిపైనే ఉంటుంది. ఏం జరుగుతుందా అని జనాలు కళ్లు పెద్దవి చేసుకుని చూస్తుంటారు.
ప్రస్తుతం మంచు వారి పరిస్థితి కూడా అదే. మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్న గొడవలు నాలుగు గోడల మధ్య ఉన్నంత కాలం ఎవరు పట్టించుకోలేదు. కాని ఇప్పుడు గేటు దాటి మంచు కుటుంబం వీధిన పడటంతో... ఈ గొడవపైనే అందరి దృష్టి పడింది.
పైగా మీడియాపై మోహన్ బాబు దాడి.. మనోజ్, మోహన్ బాబు పరస్పర విమర్శలు, పోలీసులకు ఇద్దరు ఒకరిపై మరొకరు కంప్లైయింట్ చేసుకోవడం లాంటివి ఈ వివాదాన్ని మరింత పెద్దది చేశాయి. దాంతో మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్ ముగ్గరు ఈ విషయంలో కేసులు ఎదుర్కొంటున్నారు. మరి ఈ వివాదానికి ఎక్కడ పుల్ స్టాప్ పడుతుందో చూడాలి.
ఇక టాలీవుడ్ లో వివాదంతో పాటు పోలీస్ కేసులను ఎదుర్కొన్న మరో సినిమా సెలబ్రిటీ జానీ మాస్టర్. సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసింది ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు..టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్ గా, జనసేన నాయకుడిగా, జాతీయ అవార్డ్ కూడా అందుకున్న జానీ మాస్టర్ ఒక్క సారిగా వివాదంలో చిక్కుకోవడంతో పాటు.. కెరీర్ ను కూడా పోగోట్టుకునే పరిస్థితికి వచ్చాడు.
జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేస్తున్న ఓ అమ్మాయి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసాడని, తనని ట్రాప్ చేసాడని ఆరోపణలు చేసి జానీ మాస్టర్ పై కేసు నమోదు చేసింది.
ఇందుకుగాను జానీ మాస్టర్ కొన్ని రోజులు జైల్లో కూడా ఉన్నారు. అయితే ఎవరో కావాలని జానీమాస్టర్ పై ఇలా వివాదం క్రియేట్ చేశారని. కావాలనే ఆమెతో ఇలా కేసు పెట్టించారని మరో వాదన కూడా ఉంది. అందులో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది.
ఇక వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటాడు యంగ్ హీరో రాజ్ తరుణ్. గతంలో కూడా ఇతనిపై కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఒక సారి కారు యాక్సిడెంట్ చేసి పారిపోవడం... అది సీసీకెమెరాలో రికార్డ్ అవ్వడంతో అతని పరువుపోయింది. ఇక ఈ ఏడాది రాజ్ తరుణ్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఇది ఇండస్ట్రీని కుదిపేసింది. రచ్చ రచ్చ అయ్యింది. యంగ్ హీరోగా మంచి పేరున్న రాజ్ తరుణ్ లో ఆతరువాత చాలా మార్పులు వచ్చాయి. అతనికి లవర్ బాయ్ అనే పేరు ఉంది.
ఈ పేరే అతనికి తిప్పలు తెచ్చిపెట్టింది. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వదిలేసి వెళ్లిపోయాడని లావణ్య అనే అమ్మాయి నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తనని గర్భవతి చేసాడని, చాలా మంది అమ్మాయిలతో ఎఫైర్ నడిపాడని. తనని ఎవ్వరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నాడని అనేక ఆరోపణలు వేసింది. కొన్ని రోజుల వీరి కేసు నడిచినప్పటికీ ఇప్పటికి చల్లబడింది.
ఇక ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు దేశాన్నే కుదిపేసింది మరో కేసు. అది తెలుగు ఇండస్ట్రీ కేసు కాదు.. కన్నడ పరిశ్రమకు చెందిన స్టార్ హీరో దర్శన్ కేసు. తన ప్రియురాలికోసం దర్శన్.. తన అభిమాని అయిన రేణుకాస్వామిని కొంత మంది తోకలిసి చంపేశాడని ఆరోపణలు ఉన్నాయి. దాంతో దర్శన్ ను అరెస్ట్ చేసి.. చాలా కాలం జైల్లో ఉంచారు. రీసెంట్ గానే అతనికి బెయిల్ వచ్చింది. కాని ఈ కేసు మాత్రం దర్శన్ ను ఇప్పట్లో వదలదనే తెలుస్తోంది.
ఇక తెలుగువారిపై నోరు పారేసుకుని అనవసరంగా వివాదాల్లో చిక్కుకుంది హీరోయిన్ కస్తూరి శంకర్. అయితే ఈమెకు వివాదాలు కొత్తకాదు. కాని ఓ పార్టీ మీటింగ్ లో మాట్లాడుతూ.. తెలుగు వారు తమిళనాడుకు వచ్చింది. అంతపుర కాంతల ఇంట్లో పనిమనుషులుగా అంటూ అవమానకరంగా మాట్లాడారు. దాంతో కస్తూరిపై చాలా కేసులు నమోదయ్యాయి. చివరకు ఆమెను తమిళనాడు పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. ఇలా చాలామంది సెలబ్రిటీలు.. చిన్నా పెద్దా కేసుల్లో ఇరుక్కుని ఇబ్బందులు పడ్డారు. 2024 లో ఇవే సెలబ్రిటీలు ఎదుర్కొన్న పెద్ద కేసులుగా చెప్పుకోవచ్చు.