MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Entertainment
  • K Dramas on OTT: దెయ్యాలు, సస్పెన్స్, రొమాన్స్.. ఓటీటీని షేక్ చేయబోతున్న టాప్ 7 కొరియన్ సిరీస్‌లు ఇవే

K Dramas on OTT: దెయ్యాలు, సస్పెన్స్, రొమాన్స్.. ఓటీటీని షేక్ చేయబోతున్న టాప్ 7 కొరియన్ సిరీస్‌లు ఇవే

New K Dramas on OTT: జూలై నెలలో ఓటీటీలోకి సూపర్ హిట్ కొరియన్ డ్రామాలు వస్తున్నాయి. ఈ నెలలో రిలీజ్ అవుతున్న టాప్ 7 కొరియన్ డ్రామాలు ఏవి? నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్, వికీలో స్ట్రీమింగ్ వివరాలు మీకోసం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 12 2026, 05:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
కే డ్రామా లవర్స్‌కు పండగే.. జూలైలో ఓటీటీలోకి వస్తున్న టాప్ 7 కొరియన్ సిరీస్‌లు
Image Credit : Gemini

కే డ్రామా లవర్స్‌కు పండగే.. జూలైలో ఓటీటీలోకి వస్తున్న టాప్ 7 కొరియన్ సిరీస్‌లు

కొరియన్ డ్రామాలకు ఇండియాలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లవ్, సస్పెన్స్, థ్రిల్లర్, ఫాంటసీ.. ఇలా ఏ జానర్ అయినా సరే, కే డ్రామాలు ఇచ్చే కిక్కే వేరు. జూలై నెల కూడా కొరియన్ సిరీస్ లవర్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికి రెడీ అయిపోయింది.

ఈ నెలలో రకరకాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో కొన్ని మోస్ట్ అవేటెడ్ కొరియన్ డ్రామాలు రిలీజ్ అవుతున్నాయి. కొంతమంది స్టార్ యాక్టర్లు కొత్త సీజన్లతో వస్తుంటే, మరికొన్ని పాపులర్ నవలల ఆధారంగా తెరకెక్కిన సిరీస్‌లు డిబ్యూట్ ఇస్తున్నాయి. మీ నెక్స్ట్ బింజ్ వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకోవాల్సిన టాప్ 7 కొరియన్ డ్రామాల డీటెయిల్స్ ఇక్కడ చూసేయండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
1. ది హస్బెండ్
Image Credit : X/KBS_drama

1. ది హస్బెండ్

ఈ జూలై మొదటి వారంలో ఓటీటీలోకి వచ్చిన బెస్ట్ కేడ్రామా 'ది హస్బెండ్'. ఇది ప్యూర్ రొమాన్స్ అండ్ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్. ఇందులో నామ్‌కూంగ్ మిన్, లీ సియోల్ మెయిన్ లీడ్స్ ప్లే చేశారు. ఒక రెస్పెక్టెడ్ న్యూరోసర్జన్ తన భార్యకు విడాకులు కావాలని అడిగిన మరుసటి రోజే ఆమె సడన్‌గా కనిపించకుండా పోతుంది. అప్పటినుంచి అతని లైఫ్ మొత్తం తలకిందులవుతుంది. ఆమె కోసం వెతికే ప్రాసెస్‌లో ఎన్నో చీకటి నిజాలు, రహస్యాలు బయటకు వస్తాయి. థ్రిల్లర్ జానర్ ఇష్టపడేవారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. డిస్నీ ప్లస్ లో అందుబాటులో ఉంది.

Related Articles

Related image1
EPFO: ఈపీఎఫ్ఓ కొత్త సైట్ వచ్చేసింది.. మారిన UAN యాక్టివేషన్ రూల్స్, కొత్త ప్రాసెస్ ఇదే
Related image2
Earthquake: విశాఖను వణికించిన భూకంపం.. ఏపీ, తెలంగాణలో ఏయే ప్రాంతాలు డేంజర్ జోన్ లో ఉన్నాయి?
37
2. లవ్ ఇన్ సింక్
Image Credit : X/zapzee_net

2. లవ్ ఇన్ సింక్

మీకు రొమాంటిక్ ఫాంటసీ డ్రామాలు ఇష్టమైతే, 'లవ్ ఇన్ సింక్' సిరీస్ అస్సలు మిస్ అవ్వద్దు. ఇద్దరు అపరిచిత వ్యక్తుల మధ్య వింతైన కనెక్షన్ ఏర్పడుతుంది. ఒకరి ఎమోషన్స్ మరొకరు ఫీల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ విచిత్రమైన కనెక్టివిటీ వల్ల వాళ్ల లైఫ్స్ ఎలా ఛేంజ్ అయ్యాయి అనేది స్టోరీ. ఇందులో కిమ్ మ్యుంగ్-సూ, కాంగ్ మిన్-ఆ లీడ్ రోల్స్ చేశారు. ఈ ఫ్రెష్ స్టోరీలైన్ ఇప్పటికే కే-డ్రామా అభిమానులు భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఇందులో హార్ట్ వార్మింగ్, ఫన్నీ అండ్ ఎమోషనల్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. వియూ, డిస్నీ ప్లస్ లో అందుబాటులో ఉంది.

47
3. ఫ్యామిలీ రిజిస్టర్
Image Credit : viki

3. ఫ్యామిలీ రిజిస్టర్

ఇదొక ఇంటెన్సివ్ మెలోడ్రామా. యానిమేషన్ రైటర్ అవ్వాలని కలలుకనే ఒక అమ్మాయి కథ ఇది. తను పుట్టినప్పటి నుంచీ తన ఫ్యామిలీ నాశనం అవ్వడానికి తనే కారణమంటూ అందరి నిందలు భరిస్తూ స్ట్రగుల్ అవుతుంటుంది. మరోవైపు ఆమె తల్లికి ఎన్నో డార్క్ సీక్రెట్స్ ఉంటాయి. ఫ్యామిలీ సీక్రెట్స్, తల్లి-కూతుళ్ల మధ్య వచ్చే గొడవలు, పెయిన్‌ఫుల్ లైఫ్ నుంచి ఆమె ఎలా బయటపడింది అనేదే మెయిన్ పాయింట్.

57
4. డ్రీమ్ టు యూ
Image Credit : X/hallyuforums

4. డ్రీమ్ టు యూ

ఈ నెలలో మోస్ట్ అవేటెడ్ కే డ్రామాల్లో 'డ్రీమ్ టు యూ' ఒకటి. ఇందులో కాలేజ్ హార్ట్ త్రాబ్ హ్వాంగ్ ఇన్-యూప్, లీ హ్యే-రి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. రొమాన్స్ అండ్ హీలింగ్ కాన్సెప్ట్‌తో ఈ స్టోరీ వస్తోంది. తమ కలల వెనక పరిగెడుతూ, 15 ఏళ్ల తర్వాత విధి వల్ల మళ్లీ కలిసిన ఇద్దరు వ్యక్తుల జర్నీ ఇది. బ్యూటిఫుల్ విజువల్స్, ఎమోషనల్ నరేషన్‌తో సాగే స్లో బర్న్ రొమాంటిక్ డ్రామాలను ఇష్టపడే ఆడియన్స్‌కు ఇది బాగా కనెక్ట్ అవుతుంది. రాకుటెన్ వికీ, వియూ లో అందుబాటులో ఉంది.

67
5. ది ఈస్ట్ ప్యాలెస్ & స్పూకీ ఇన్ లవ్
Image Credit : X/jackofficial_01

5. ది ఈస్ట్ ప్యాలెస్ & స్పూకీ ఇన్ లవ్

జూలై థర్డ్ వీక్‌లో రెండు క్రేజీ సిరీస్‌లు నెట్‌ఫ్లిక్స్‌లోకి వస్తున్నాయి.

ది ఈస్ట్ ప్యాలెస్: జూలై 17న ఓటీటీలోకి వస్తోంది. రాయల్ ప్యాలెస్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే చారిత్రక డ్రామా ఇది. హిస్టారికల్ ఎలిమెంట్స్‌కు మిస్టరీ, సూపర్ నేచురల్ కాన్సెప్ట్‌లను మిక్స్ చేశారు. ప్యాలెస్ లోపల జరిగే కొన్ని వింత సంఘటనల వల్ల, అక్కడి ప్రమాదకరమైన రహస్యాలను ఛేదించాల్సి వస్తుంది. గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్, లార్జర్ ద్యాన్ లైఫ్ కాస్టింగ్‌తో ఈ ఏడాది మోస్ట్ యాంటిసిపేటెడ్ డ్రామాల్లో ఒకటిగా నిలిచింది. నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంటుంది.

స్పూకీ ఇన్ లవ్: జూలై 18న ఓటీటీలోకి వస్తోంది. కామెడీ, రొమాన్స్, ఫాంటసీల మిక్చర్ ఈ సిరీస్. దెయ్యాలను చూడగలిగే శక్తి ఉన్న ఒక హోటల్ వారసురాలు, ఒక ప్రాసిక్యూటర్ ఇద్దరూ కలిసి మర్డర్ కేసులను ఎలా సాల్వ్ చేశారు అనేది స్టోరీ. సూపర్ నేచురల్ ట్విస్ట్‌తో పాటు మంచి హ్యుమర్, ఎమోషనల్ సీన్స్ ఇందులో ఉండబోతున్నాయి. నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంటుంది.

77
6. ఏ షాప్ ఫర్ కిల్లర్స్ సీజన్ 2
Image Credit : X/DisneyPlusKR

6. ఏ షాప్ ఫర్ కిల్లర్స్ సీజన్ 2

యాక్షన్ థ్రిల్లర్ లవర్స్‌కు పూనకాలు తెప్పించిన ఏ షాప్ ఫర్ కిల్లర్స్ ఇప్పుడు సీజన్ 2 తో వస్తోంది. లీ డాంగ్ వూక్, కిమ్ హ్యే-జున్ మెయిన్ లీడ్స్ చేసిన ఈ సిరీస్ మొత్తం 8 ఎపిసోడ్స్ ఉంటుంది. సీజన్ 1 లో ఎన్నో ప్రాణాంతక దాడుల నుంచి తప్పించుకున్న జియాన్, జిన్-మాన్ ఇప్పుడు బాబిలాన్ క్రిమినల్ గ్యాంగ్‌పై రివేంజ్ తీర్చుకోవడానికి స్ట్రాంగ్ ప్లాన్‌తో వస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఈ సీజన్‌లో నెక్స్ట్ లెవెల్ ఉండబోతున్నాయి. దీని రిలీజ్ డేట్ త్వరలోనే అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నారు. హులు, జియోహాట్‌స్టార్ లోకి రానుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వినోదం
తెలుగు సినిమా
ఓటీటీ
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Anirudh Kavya Wedding: అనిరుధ్‌, కావ్య మారన్‌ పెళ్లి డేట్‌ ఫిక్స్.. డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ ఎక్కడో తెలుసా? వాహ్‌
Recommended image2
RC17: రామ్‌ చరణ్‌ సరసన 3200కోట్ల హీరోయిన్‌.. సుకుమార్‌ స్కెచ్‌ వేరే లెవల్‌
Recommended image3
Trisha Net Worth: త్రిష ఆస్తుల చిట్టా ఇదే.. చెన్నై, హైదరాబాద్‌, లండన్‌లో లగ్జరీ ప్రాపర్టీ, కోట్ల రెమ్యునరేషన్
Related Stories
Recommended image1
EPFO: ఈపీఎఫ్ఓ కొత్త సైట్ వచ్చేసింది.. మారిన UAN యాక్టివేషన్ రూల్స్, కొత్త ప్రాసెస్ ఇదే
Recommended image2
Earthquake: విశాఖను వణికించిన భూకంపం.. ఏపీ, తెలంగాణలో ఏయే ప్రాంతాలు డేంజర్ జోన్ లో ఉన్నాయి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved