MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నన్ను చూసి ఉలిక్కిపడి చస్తుంటారు, అఖండ 2 బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో బాలకృష్ణ ఆవేశం..6వ హిట్ రాబోతోంది

నన్ను చూసి ఉలిక్కిపడి చస్తుంటారు, అఖండ 2 బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో బాలకృష్ణ ఆవేశం..6వ హిట్ రాబోతోంది

నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 చిత్రం డిసెంబర్ 12న విడుదలైంది. తాజాగా ఈ చిత్రానికి సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో బాలకృష్ణ ఆవేశంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

3 Min read
Author : Tirumala Dornala
Published : Dec 15 2025, 09:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అఖండ 2 బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ 
Image Credit : Youtube/14 Reels Plus

అఖండ 2 బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ 

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ 2 చిత్రం ఇటీవల విడుదలైంది. అఖండ భారత్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్ పేరుతో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. ఎం తేజస్విని నందమూరి సమర్పించారు. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజైన ఈ చిత్రానికి మిక్స్డ్ రెస్పాన్స్ ఉన్నప్పటికీ మంచి వసూళ్లు వస్తున్నాయి. అయితే వీకెండ్ ముగిసిన తర్వాత సోమవారం నుంచి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ఈ చిత్ర సక్సెస్ మీట్ లో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ప్రేక్షకులకు బాలయ్య కృతజ్ఞతలు 
Image Credit : Twitter

ప్రేక్షకులకు బాలయ్య కృతజ్ఞతలు 

అఖండ భారత్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. అఖండ తాండవం విజయోత్సవ పండుగకు విచ్చేసిన పాత్రికేయ సోదరులకు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. ఒక పని కోసం కొందరిని ఆ పరమశివుడే ఎంచుకుంటాడు. ఈ సినిమా విడుదలై ఇంత అద్భుతంగా విజయవంతంగా ప్రదర్శించబడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తెలుగు ప్రేక్షకులకు, యావత్ భారత దేశ ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏ ఉద్దేశంతో ఈ సినిమా తీశామో ఆ ఉద్దేశాన్ని మీరు పాటించాలి. 

35
నన్ను చూసి ఉలిక్కిపడి చస్తుంటారు 
Image Credit : Youtube/14reels plus

నన్ను చూసి ఉలిక్కిపడి చస్తుంటారు 

మనిషి పుట్టుకకు ఏదో ఒక కారణం ఉంటుంది. ఈ సినిమా చూసి ప్రేక్షకులు సనాతన హైందవ ధర్మం మీసం మేలేసిందని చెప్తున్నారు. మన ధర్మం మన గర్వం మన తేజస్సు కలగలిపిన సినిమా ఆపాల గోపాలం అలరించిందని యావత్ ప్రపంచం చెబుతోంది. ఇంత అద్భుతమైన విజయాన్ని ఇచ్చిన అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు.  ఈ సినిమాల్లో ఒక్కొక్క డైలాగు ఒక్కొక్క ఆణిముత్యం. ప్రతి సన్నివేశం ఒక ఉద్వేగం ప్రకంపనం. ఈ రోజుల్లో ప్రజలు సినిమాని కూడా ఒక నిత్యవసర వస్తువుగా ఎంచుకున్నారు. అలాంటప్పుడు మనం ఎటువంటి సినిమాలు తీయాలని కూడా ఆలోచించుకోవాలి. వరుసగా ఐదు సినిమాలు విజయం సాధించడం నాకు చాలా గర్వంగా ఉంది. రేపు రాబోతున్న సినిమా కూడా అద్భుతమైన చరిత్ర సృష్టించబోతుంది. చరిత్రలో చాలా మంది ఉంటారు. సృష్టించిన చరిత్రను మళ్లీ మళ్లీ తిరగరాసి తిరిగి చరిత్ర సృష్టించే వాడు ఒక్కడే. అది ఒక తెలియని శక్తి. ‘ఎవరిని చూసుకుని రా బాలకృష్ణకు అంత పొగరు’ అని చాలా మంది అంటారు. నన్ను చూసుకునే నాకు పదునైన పొగరు. బాలకృష్ణకి ఇంత ధైర్యం ఏంటి అని నన్ను చూసి ఉలిక్కి పడి చస్తుంటారు అని బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

45
అఖండని అలాంటి పరిస్థితుల్లో రిలీజ్ చేశాం 
Image Credit : youtube/@14ReelsPlus

అఖండని అలాంటి పరిస్థితుల్లో రిలీజ్ చేశాం 

పాత్ర చేయడం అంటే ఒక పరకాయ ప్రవేశం. అది ఒక్క నందమూరి తారక రామారావు గారికి సాధ్యపడింది. నాకు ధన్యమైన జన్మ ఇచ్చి మీరందరి గుండెల్లో ప్రతిరూపంగా నిలిపినందుకు మాతండ్రి గారికి పాదాభివందనాలు. ఇది యావత్ ప్రపంచ ప్రేక్షకులకు సంబంధించిన సినిమా. ఈ సినిమా కేవలం భారతం, భాగవతానికి సంబంధించిన సినిమానే కాదు.. ఒక బైబిలు ఒక ఖురాన్ కి కూడా సంబంధించిన సినిమా.  మన వేదం నుంచే విజ్ఞానం పుట్టింది. మన దేశం  గొప్పతనం మనం చెప్పుకోవాలి. అప్పుడే యువతరానికి అర్థమవుతుంది. అఖండ సినిమా కూడా ఒక పరీక్ష లాంటిదే. సరిగ్గా కోవిడ్ సమయంలో రిలీజ్ అయింది. థియేటర్స్ కి ఆడియన్స్ వస్తారా లేదా అన్న ఒక మీమాంస ఉండేది. అలాంటి సమయంలో భగవంతుడి మీద భారం వేసి సినిమా రిలీజ్ చేశాం. ఆ సినిమా అఖండ విజయాన్ని సాధించింది. 

55
పిల్లలకు అఖండ 2 చూపించాలి 
Image Credit : Asianet News

పిల్లలకు అఖండ 2 చూపించాలి 

ఆ తర్వాత మిగతా నిర్మాతలు అందరికీ ధైర్యం వచ్చి సినిమాలను రిలీజ్ చేయడం చేశారు. ఆ తర్వాత చేసిన వీర సింహారెడ్డి నేలకొండ భగవత్ కేసరి డాకు మహారాజ్ ఇప్పుడు అఖండ తాండవం అన్నీ కూడా అద్భుతమైన విజయాలు. అన్ని సినిమాల్లో కూడా అద్భుతమైన సందేశాలు ఇవ్వడం జరిగింది. అఖండలో దేవుడు మనిషిలో పూనాడు. ఇందులో మనిషే దేవుడైతే ఏమవుతుంది.. సంభవామి యుగే యుగే అన్నదే చూపించాం. సకుటుంబం సపరివార సమేతంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు చూస్తున్నారు. పిల్లలకు కూడా ఈ సినిమాని చూపించి, మన మూలాల గురించి తెలియజేయాలని కోరుతున్నాను అని బాలయ్య తెలిపారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
నందమూరి బాలకృష్ణ
ఏషియానెట్ న్యూస్
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పాడిన 10 పాటలు.. సింగర్‌గా అదరగొట్టిన పవర్ స్టార్!
Recommended image2
Balakrishna: బాలయ్య పెద్ద మనసు, 43 కోట్ల విలువైన ఇంటిని త్యాగం.. ఎందుకంటే?
Recommended image3
Serial Killer Movies: లాస్ట్ మినిట్ వరకు ఉత్కంఠ రేపే టాప్ 5 సీరియల్ కిల్లర్ మూవీస్ ఇవే!
Related Stories
Recommended image1
OTT Movies: ఈ వారం ఓటీటీ రిలీజ్‌⁠లు ఇవే.. సంచలనం సృష్టించిన చిన్న సినిమా, తప్పక చూడాల్సిన థ్రిల్లర్స్ రెడీ
Recommended image2
సీజన్ 9లో భరణి అన్ అఫీషియల్ విన్నర్, నాగబాబు రెకమండేషన్ ఇలా వర్కౌట్ అయిందా.. మైండ్ బ్లోయింగ్ రెమ్యునరేషన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved