సంక్రాంతి సినిమాల రేసులో ట్విస్ట్, ఆడియన్స్ కు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఏంటో తెలుసా?
Sankranti Movies Surprise : సంక్రాంతి సినిమాల రిలీజ్ విషయంలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు వినిపిస్తున్నాయి. రోజుకో న్యూస్ సంక్రాంతి సినిమాల గురించి వినిపిస్తుంది. అయితే ఆడియన్స్ కు మాత్రం ఓ గుడ్ న్యూస్, సర్ ప్రైజింగ్ గిప్ట్ కూడా ఉంది. అదేంటంటే?

సంక్రాంతి సినిమాల సందడి..
ప్రతీ సంక్రాంతికి సినిమాల సందడి భారీగా ఉంటుంది. కానీ ఆమధ్య కాలంలో భారీగా సినిమాలు రిలీజ్ అవ్వకుండా.. భారీ బడ్జెట్ సినిమాలు మాత్రం రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. వాటి మధ్య చిన్న సినిమాలు నలిగిపోతున్నాయి. పెద్ద సినిమాలకు పోటీగా చిన్న సినిమాలు థియేటర్లకు రావడానికే భయపడుతున్నాయి. అయితే ఈసారి సంక్రాంతి రేసులో మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో పాటు మాస్ మహారాజ రవితేజ, యంగ్ స్టార్స్ అయిన శర్వానంద్, నవీన్ పొలిశెట్టి సినిమాలు రిలీజ్ కు ఉన్నాయి. అయితే పెద్ద సినిమాలకు పోటీ లేకుండా శర్వానంద్, నవీన్, సినిమాలు సంక్రాంతి పోటీ నుంచి తప్పుకున్నాయన్న టాక్ వినిపించింది. కానీ రిలీజ్ విషయంలో ఆ హీరోలు వెనక్కి తగ్గలేదని తెలుస్తోంది.
మారిపోతున్న పరిస్థితులు
సంక్రాంతి అంటే గతంలో ఆడియన్స్ కు నిజమైన సినిమాల పండగ ఉండేది. చాలా సినిమాలు రిలీజ్ అయ్యేవి .. ఆడియన్స్ కు కూడా చాలా ఆప్షన్లు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒకటి రెండు పెద్ద హీరో సినిమాలు రిలీజ్ అయితే వాటి వరకు మాత్రమే చూసి ఆనందించాల్సిందే. లేదటే ఓటీటీపై ఆధారపడాల్సి ఉంటుంది. వీటికి తోడు పండగ సీజన్ లో బస్సు ఛార్జీలు పెంచినట్టు.. పెద్ద సినిమాలు రిలీజ్ అయితే టికెట్ రేట్లు పెంచడం ఆనవాయితీగా మారింది. ఇక పండగటైమ్ లో రిలీజ్ అయ్యే సినిమాలకు ఇంకాస్త ఎక్కువగా రేట్లు పెంచేస్తుంటారు. అయితే
ఆడియన్స్ కు సర్ ప్రైజింగ్ గిఫ్ట్
ఈసారి ఆడియన్స్ కు ఈ విషయంలో సర్ ప్రైజింగ్ గిఫ్ట్ లభించబోతున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా సంక్రాంతి సినిమాలంటే టికెట్ రేట్లు భారీగా పెరగడం పరిపాటిగా మారింది. గతంలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 250 నుంచి 300 రూపాయలు, మల్టీప్లెక్స్‌లలో 500 నుంచి 600 రూపాయల వరకు టికెట్ ధరలు ఉండేవి. నిర్మాతలు ప్రభుత్వంతో ప్రత్యేక అనుమతులు తీసుకుని ఈ రేట్లను అమలు చేయడం వల్ల ప్రేక్షకులకు ఆర్థిక భారం పడేది.ఈసారి పరిస్థితి భిన్నంగా ఉండొచ్చని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. సంక్రాంతికి ప్రేక్షకులకు సూపర్ మెగా గిఫ్ట్ ఇవ్వబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. టికెట్ రేట్లు సింగిల్ స్క్రీన్‌లలో కేవలం 100 రూపాయలు, మల్టీప్లెక్స్‌లలో 150 రూపాయలకే పరిమితం చేయాలని భావిస్తున్నారని సమాచారం.
సగటు ప్రేక్షకుడికి ఊరట లభిస్తుందా?
ఈ నిర్ణయానికి కారణంగా ఈ సీజన్‌లో ఒకేసారి 5 నుంచి 6 మెగా సినిమాలు క్లాష్ అవుతున్నాయని చెబుతున్నారు. దానితో పాటు తెలంగాణలో ప్రభుత్వం ఇప్పటికే టికెట్ రేట్లు, బెనిఫిట్ షోల విషయంలో చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తోంది. రీసెంట్ గా అఖండ 2 విషయంలో జరిగింది దృష్టిలో పెట్టుకుని.. ఇక ముందు టికెట్ రేట్లు పెంచేది లేదని రీసెంట్ గా సినిమాటోగ్రఫీ మంత్రి కూడా ప్రటకించారు. దాంతో ఈసారి ఆడియన్స్ కు టికెట్ రేట్ల భారం లేనట్టే తెలుస్తోంది. పండక్కి.. జేబులకు చిల్లు పడకుండా హాయిగా సినిమా చూసి సగటు ప్రేక్షకుడు ఆనందించవచ్చు. అదే విధంగా ఈ సంక్రాంతికీ తక్కువ ధరల విధానం అమలైతే, టాలీవుడ్ బాక్సాఫీస్ ఫుల్ అవ్వడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది నిజంగా అమలవుతుందా లేదా చూడాలి.
సంక్రాంతి బరిలోకి దిగే సినిమాలు
సంక్రాంతి పండగ టైమ్ లో మూడు రోజుల వ్యవధిలోనే ముగ్గురు పెద్ద స్టార్ హీరోలతో పాటు ఇద్దరు యంగ్ హీరోల సినిమాలు థియేటర్లలోకి రావడం వల్ల ఈసారి సంక్రాంతి సందర్భంగా సినిమా ప్రేక్షకులకు పండగ వాతావరణం నెలకొననుంది. ప్రభాస్ నటించిన రాజాసాబ్, మెగాస్టార్ చిరంజీవి మన శంకర వర ప్రసాద్ గారు, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి , నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు, శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారి సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్నట్లు సమాచారం. ఇక ఈసినిమాల విషయంలో ముందు ముందు ఏ సినిమాలన్నీ సంక్రాంతి బరి నుంచి తప్పుకుంటాయా లేక.. బరిలోకి దిగుతాయా అనేది చూడాలి.

