- Home
- Entertainment
- ఓటీటీ లో కాస్ట్లీ సినిమాలు మనవే, అత్యధిక ధరకు అమ్ముడైన టాప్ 5 లో తెలుగు సినిమాలెన్ని?
ఓటీటీ లో కాస్ట్లీ సినిమాలు మనవే, అత్యధిక ధరకు అమ్ముడైన టాప్ 5 లో తెలుగు సినిమాలెన్ని?
ప్రస్తుతం షూటింగ్ లో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు చాలా ఉన్నాయి. రిలీజ్ అయ్యి రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. వాటిలో ఓటీటీలు భారీ గా ఖర్చు పెట్టిన సినిమాలేంటి. వాటిలో తెలుగు సినిమాల లెక్క ఎంత?

5. RRR
- ఓటీటీ డీల్ ఎంతకు జరిగింది : 300 కోట్ల రూపాయలు
- 5ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్ కొనుగోలు చేసింది : డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్
ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ తెలుగు సినిమా 2022లో విడుదలైంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ ఎపిక్ పీరియడ్ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1230 కోట్ల రూపాయలు సంపాదించింది. ఈ సినిమాను 550 కోట్ల రూపాయలతో నిర్మించారు.
4. KGF చాప్టర్ 2
- ఓటీటీ డీల్ ఎంతకు జరిగింది : 320 కోట్ల రూపాయలు
- ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్ కొనుగోలు చేసింది : అమెజాన్ ప్రైమ్ వీడియో
కన్నడ సినిమాకు చెందిన ఈ పీరియడ్ యాక్షన్ సినిమా 2022లో విడుదలైంది. ఇందులో యశ్, సంజయ్ దత్, రవీనా టాండన్ లాంటి నటులు కనిపించారు. దాదాపు 100 కోట్ల రూపాయలతో తీసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్త కలెక్షన్ సుమారు 1215 కోట్ల రూపాయలు.
3. కల్కి 2898 AD
- ఓటీటీ డీల్ ఎంతకు జరిగింది : 375 కోట్ల రూపాయలు
- ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్ కొనుగోలు చేసింది : అమెజాన్ ప్రైమ్ వీడియో
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ తెలుగు ఎపిక్ సైన్స్ ఫిక్షన్ సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రలు పోషించారు. దాదాపు 600 కోట్లతో తీసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 1042.25 కోట్ల రూపాయలు సంపాదించింది.
2. AA22xA6 (వర్కింగ్ టైటిల్)
- ఓటీటీ డీల్ ఎంతకు జరిగింది : 600 కోట్ల రూపాయలు
- ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్ కొనుగోలు చేసింది : నెట్‌ఫ్లిక్స్
ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కానీ, ఈ అప్‌కమింగ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని నివేదికలు చెబుతున్నాయి. అట్లీ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్, దీపికా పదుకొణె, మృణాల్ ఠాకూర్ లాంటి స్టార్ నటులు కనిపించబోతున్నారు. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 800 కోట్లపైనే అని సమాచారం.
1. వారణాసి
- ఓటీటీ డీల్ ఎంతకు జరిగింది : 650 కోట్ల రూపాయలు
- ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్ కొనుగోలు చేసింది : నెట్‌ఫ్లిక్స్
నివేదికల ప్రకారం, ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న ఈ ఎపిక్ ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా హక్కులను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్టుసమాచారం. ఈ సినిమాలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. దాదాపు 1500 కోట్ల రూపాయల బడ్జెట్ తో వారణాసి తెరకెక్కుతున్నట్టు సమాచారం.

