- Home
- Entertainment
- Emmanuel Lover : ప్రియురాలిని పరిచయం చేసిన బిగ్ బాస్ ఇమ్మాన్యుయేల్, మరి పెళ్లి ఎప్పుడో తెలుసా?
Emmanuel Lover : ప్రియురాలిని పరిచయం చేసిన బిగ్ బాస్ ఇమ్మాన్యుయేల్, మరి పెళ్లి ఎప్పుడో తెలుసా?
Emmanuel : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో.. విన్నర్ కంటే కూడా బాగా ఫేమస్ అయిన వ్యక్తి ఇమ్మాన్యుయేల్. బిగ్ బాస్ లో ఉండగానే తనకు ఓ లవర్ ఉందని.. పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించిన ఇమ్ము.. తాజాగా ఓ ఫోటోను షేర్ చేసి.. తన ప్రేమను కన్ ఫార్మ్ చేశాడు.

బిగ్ బాస్ విన్నర్ కంటే ఎక్కువ ఫాలోయింగ్..
బిగ్ బాస్ సీజన్ 9లో పాల్గొన్న కంటెస్టెంట్లలో విన్నర్ గా నిలిచిన కళ్యాణ్, రన్నర్ గా నిలిచిన తనూజ కంటే కూడా ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకున్న కంటెస్టెంట్ ఇమ్మాన్యుయేల్. హౌస్ లో అతను చేసిన కామెడీ.. ఆ టైమింగ్.. ఎక్కడా అతి చేయకుండా.. అందరిని నవ్విస్తూ.. ఎంటర్టైన్ చేస్తూ.. అంతే సీరియస్ గా టాస్క్ లు కూడా ఆడాడు ఇమ్మాన్యుయేల్. బిగ్ బాస్ నుంచి అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన వ్యక్తిగా ఇమ్మాన్యుయేల్ నిలిచాడు. వినోదంతో పాటు టఫ్ కాంపిటేషన్ ను కూడా ఈక్వల్ గా చూపించిన కంటెస్టెంట్‌గా ఇమ్మాన్యుయేల్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ఈ కారణంగా ఈ సీజన్ విన్నర్‌గా అతడే నిలుస్తాడని చాలా మంది భావించారు.
విన్నర్ అవుతాడనుకుంటే..?
చాలామంది ఈ సీజన్ బిగ్ బాస్ విన్నర్ ఇమ్మాన్యుయేల్ అని అనుకున్నారు. కానీ.. అనుకోని పరిణామాల నేపథ్యంలో ఇమ్మాన్యుయేల్ బిగ్ బాస్ ప్రయాణం టాప్ 5 దశలోనే ముగిసింది. విజేత కాకపోయినా కనీసం టాప్ 2 కానీ... 3 కానీ వస్తుంది అనుకున్నారు. అది కూడా దక్కకపోవడంతో.. ఇమ్మాన్యుయేల్ అభిమానులు బిగ్ బాస్ పై మండిపడుతున్నారు. హౌస్ లో ఆ రేంజ్ లో పెర్ఫామెన్స్ ఎవరు ఇచ్చారు.. కమెడియన్ అయితే బిగ్ బాస్ టైటిల్ గెలుచుకోవడానికి పనికిరాడా.. అంటూ నెటిజన్లు పైర్ అవుతున్నారు. ఇక బిగ్ బాస్ టైటిల్ గెలవకపోయినా.. ఆడియన్స్ హృదయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు ఇమ్మాన్యుయేల్
ప్రేమలో పడ్డ ఇమ్మాన్యుయేల్
బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న సమయంలో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను కూడా ఇమ్మాన్యుయేల్ ప్రేక్షకులతో పంచుకున్నాడు. ముఖ్యంగా తన ప్రేమ జీవితం గురించి మాట్లాడడం అప్పట్లో ఆసక్తికరంగా మారింది.తాను కొంతకాలంగా ప్రేమలో ఉన్నానని, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని ఇమ్మాన్యుయేల్ వెల్లడించాడు. ఈ వ్యాఖ్యలతో అతడి వ్యక్తిగత జీవితం పట్ల అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఇమ్ము ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు, ఆ అమ్మాయి ఎవరు అనే ప్రశ్నలు అప్పటి నుంచే సోషల్ మీడియాలో చర్చకు వచ్చాయి.
ఇమ్మాన్యుయేల్ షేర్ చేసిన ఫోటోలో ఏముంది?
ఇమ్మాన్యుయేల్ బిగ్ బాస్ హౌస్ లో ఉండగా.. అతని అన్న ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇమ్ము ప్రేమించిన అమ్మాయి ఒక డాక్టర్.. ఆమె ప్రస్తుతం చదువుకుంటోంది.. అతను రాగానే త్వరలోనే ఎంగేజ్మెంట్ కు ప్లాన్ చేస్తామని చెప్పాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఇమ్మాన్యుయేల్ తన సోషల్ మీడియా స్టోరీలో ఒక ఫోటోను షేర్ చేశాడు. ఆ ఫోటోలో తన లవర్ చేయిని పట్టుకున్నది మాత్రమే కనిపించింది. పేరు గానీ, ముఖం గానీ వెల్లడించకుండా షేర్ చేసిన ఈ పిక్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఈ ఫోటోలో ఉన్న అమ్మాయే ఇమ్మాన్యుయేల్ పెళ్లి చేసుకోబోయే వ్యక్తి అని కామెంట్లు చేస్తున్నారు.
ఇమ్మాన్యుయేల్ పెళ్లి ఎప్పుడు?
అయితే, ఈ ఫోటో ద్వారా ఇమ్మాన్యుయేల్ ఒక విషయంపై మాత్రం క్లారిటీ ఇచ్చాడు. తాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నానని వెల్లడించాడు. కానీ ఎప్పుడు..? ఎక్కడ తన పెళ్లి జరుగుతుందో మాత్రం చెప్పలేదు. ఇక ఇమ్మాన్యుయేల్ షేర్ చేసిన ఈ పోటో వైరల్ అవ్వడంతో.. రకరకాల కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. అభిమానులు ఇమ్మాన్యుయేల్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక తనకు కాబోయే భార్యను ఎప్పుడు, ఎలా అందరికీ పరిచయం చేస్తాడనే అంశంపై ఆసక్తి కొనసాగుతోంది.

