MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • K-Dramas: కుర్రాళ్ల కు కిక్కిచ్చే టాప్ 5 కొరియన్ డ్రామాలు, ఓటీటీలో రచ్చ చేస్తున్న రొమాంటిక్ వెబ్ సిరీస్ లు, ఎక్కడ చూడొచ్చంటే?

K-Dramas: కుర్రాళ్ల కు కిక్కిచ్చే టాప్ 5 కొరియన్ డ్రామాలు, ఓటీటీలో రచ్చ చేస్తున్న రొమాంటిక్ వెబ్ సిరీస్ లు, ఎక్కడ చూడొచ్చంటే?

K-Dramas: ఈమధ్య ఇండియాలో కొరియన్ డ్రామాలకు డిమాండ్ భారీగా పెరిగిపోయింది. ముఖ్యంగా యూత్ అయితే K-Dramas అంటే పడిచస్తున్నారు. ప్రస్తుతం ఓటీటీలో ట్రెండింగ్ లో ఉన్న టాప్ 5 కొరియన్ రొమాంటిక్ వెబ్ సిరీస్ లు ఏంటో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 24 2026, 02:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కొరియన్ డ్రామాలకు పెరిగిన డిమాండ్
Image Credit : Netflix

కొరియన్ డ్రామాలకు పెరిగిన డిమాండ్

రీసెంట్ గా మన దేశంలో, ముఖ్యంగా యూత్‌లో కొరియన్ డ్రామాల (K-Dramas) క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. థ్రిల్లర్, యాక్షన్ జోనర్లతో పోలిస్తే... మనసుకు హత్తుకునే ప్రేమకథలు, పగలబడి నవ్వించే కామెడీతో సాగే రొమాంటిక్ కామెడీ (Rom-Com) కే-డ్రామాలకు యూత్‌లో విపరీతమైన ఆదరణ ఉంది. కుర్రాళ్లకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తూ, వీకెండ్‌లో బింజ్ వాచ్ చేసేందుకు పర్ఫెక్ట్ ఛాయిస్‌గా నిలిచే టాప్ 5 కొరియన్ రొమాంటిక్ డ్రామాలు ఇవే

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
1. క్వీన్ ఆఫ్ టియర్స్ (Queen of Tears)
Image Credit : Netflix

1. క్వీన్ ఆఫ్ టియర్స్ (Queen of Tears)

రీసెంట్ గా ఈ వెబ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సిరీస్ ఒక సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయి, సాధారణ నేపథ్యం ఉన్న అబ్బాయి వివాహ బంధం చుట్టూ తిరుగుతుంది. రిలేషన్ షిప్ లో వచ్చే విభేదాలు, ప్రేమను తిరిగి గెలుచుకునే క్రమంలో సాగే ఎమోషన్స్ , హ్యూమర్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఈ సిరిస్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

Related Articles

Related image1
Naga Babu Remuneration: రీ ఎంట్రీలో రేటు భారీగా పెంచిన నాగబాబు, జబర్దస్త్ జడ్జిగా మెగా బ్రదర్ రెమ్యునరేషన్ ఎంతంటే?
Related image2
Jana Nayagan Collections: బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపిన దళపతి విజయ్ సినిమా, జన నాయగన్ ఫస్ట్ డే ఎంత వసూలు చేసిందంటే?
36
2. లవ్లీ రన్నర్ (Lovely Runner)
Image Credit : Netflix

2. లవ్లీ రన్నర్ (Lovely Runner)

టైమ్ ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన ఈ ఫాంటసీ రొమాంటిక్ కామడీ డ్రామా కుర్రాళ్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. తన అభిమాన స్టార్‌ను కాపాడుకోవడం కోసం హీరోయిన్ గతం లోకి వెళ్లడం, అక్కడ వారి మధ్య చిగురించే ప్రేమకథ చూస్తుంటే కడుపుబ్బ నవ్వించడమే కాకుండా మనసును తేలికపరుస్తుంది. ఈ సిరీస్ చూడాలి అనుకునే వారికి ప్రైమ్ వీడియోస్ తో పాటు నెట్ ఫ్లిక్స్ లో కూడా అందుబాటులో ఉంది.

46
3. బిజినెస్ ప్రపోజల్ (Business Proposal)
Image Credit : Netflix

3. బిజినెస్ ప్రపోజల్ (Business Proposal)

పక్కా యూత్‌ఫుల్ హంగులతో సాగే అవుట్ అండ్ అవుట్ ఫన్ రైడ్ ఇది. తన ఫ్రెండ్ తరఫున బ్లైండ్ డేట్‌కు వెళ్లిన హీరోయిన్, అక్కడ ఊహించని విధంగా తన కంపెనీ సీఈఓనే కలవడం.. ఆ తర్వాత వారి మధ్య జరిగే నాటకీయ పరిణామాలు ప్రేక్షకులకు నాన్-స్టాప్ వినోదాన్ని అందిస్తాయి. ఈ సిరీస్ కూడా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

56
4. ట్రూ బ్యూటీ (True Beauty)
Image Credit : Netflix

4. ట్రూ బ్యూటీ (True Beauty)

స్కూల్ - కాలేజీ లైఫ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ లవ్ స్టోరీ కుర్రాళ్లకు భలే కిక్కిస్తుంది. మేకప్ వెనుక దాగి ఉన్న అసలైన అందం, ఆత్మవిశ్వాసం, ముక్కోణపు ప్రేమకథ ఆధారంగా సాగే ఈ సిరీస్‌లోని కామెడీ, ఫ్రెండ్‌షిప్ సన్నివేశాలు ఎంత చూసినా బోర్ కొట్టవు. ఈ సిరిస్ అమెజాన్ మాక్స్ ప్లేయర్ లో అందుబాటులో ఉంది చూసేయండి.

66
5. క్రాష్ ల్యాండింగ్ ఆన్ యు (Crash Landing on You)
Image Credit : Netflix

5. క్రాష్ ల్యాండింగ్ ఆన్ యు (Crash Landing on You)

రొమాంటిక్ డ్రామాలకు బెంచ్ మార్క్‌లాంటి సిరీస్ ఇది. పారాగ్లైడింగ్ ప్రమాదంలో ఉత్తర కొరియాలో ల్యాండ్ అయిన ఒక దక్షిణ కొరియా వ్యాపారవేత్తకు, అక్కడ ఆర్మీ ఆఫీసర్‌కు మధ్య సాగే అనూహ్యమైన ప్రేమకథ ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్తుంది. ఈ సిరీస్ కూడా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది యూత్, బ్యాచిలర్స్ తమ ఫ్రీ టైమ్‌లో సరదాగా రిలాక్స్ అవ్వడానికి, మనసును తేలికపరచుకోవడానికి ఈ 5 కే-డ్రామాలు బెస్ట్ ఛాయిస్!

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఓటీటీ
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan: పవన్‌ వల్లే ఉదయ్‌ కిరణ్‌ ఫోటోలు లీక్‌.. సుస్మిత ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌ వెనుక జరిగింది ఇదే
Recommended image2
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Recommended image3
Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్
Related Stories
Recommended image1
Naga Babu Remuneration: రీ ఎంట్రీలో రేటు భారీగా పెంచిన నాగబాబు, జబర్దస్త్ జడ్జిగా మెగా బ్రదర్ రెమ్యునరేషన్ ఎంతంటే?
Recommended image2
Jana Nayagan Collections: బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపిన దళపతి విజయ్ సినిమా, జన నాయగన్ ఫస్ట్ డే ఎంత వసూలు చేసిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved