పాకిస్థాన్‌లో కాసుల వర్షం కురిపించిన 5 బాలీవుడ్ సినిమాలు
`ధూమ్ 3` నుండి `సంజు` వరకు.., అనేక బాలీవుడ్ చిత్రాలు పాకిస్థాన్‌లో సంచలనం సృష్టించాయి. కాసుల వర్షం కురిపించాయి. మరి అక్కడ భారీగా వసూళ్లని రాబట్టిన బాలీవుడ్ సినిమాలేంటో చూద్దాం.

ధూమ్ 3
2013లో విడుదలైన బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్ చిత్రం `ధూమ్ 3` పాకిస్థాన్‌లో హిట్ అయ్యింది. ఇది సుమారు రూ.12కోట్లు వసూలు చేసిందని సమాచారం.
పీకే
2014లో వచ్చిన ఆమిర్ ఖాన్ సూపర్‌హిట్ చిత్రం పీకేని పాకిస్థాన్‌లో కూడా బాగా చూశారు. అక్కడ బాగా వసూళ్లు సాధించింది. ఇది సుమారు 18కోట్లు వసూలు చేసిందని తెలుస్తుంది.
బజరంగీ భాయ్‌జాన్
బజరంగీ భాయ్‌జాన్ చిత్రం 2015లో విడుదలైంది. దీన్ని పాకిస్థాన్‌లో కూడా బాగా ఇష్టపడ్డారు. సినిమా అక్కడ దాదాపు 23 కోట్లు వసూలు చేసింది.
దిల్‌వాలే
2015లో విడుదలైన దిల్‌వాలే చిత్రంలో షారుఖ్ ఖాన్, కాజోల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా పాకిస్తాన్‌లో 20 కోట్లకుపైగానే వసూలు చేసింది.
సుల్తాన్
సల్మాన్ ఖాన్ సుల్తాన్ చిత్రం 2016లో విడుదలైంది. పాకిస్థాన్ నుండి కోట్లలో వసూలు చేసింది. ఇది సుమారు 33 కోట్లు వసూలు చేసిందని సమాచారం.
సంజు
2018లో విడుదలైన రణ్‌బీర్ కపూర్ హిట్ చిత్రం సంజుకి పాకిస్థాన్‌లో మంచి ఆదరణ లభించింది. ఒక నెల పాటు థియేటర్లలో ప్రదర్శించబడింది. ఇది సుమారు రూ.37కోట్లు రాబట్టిందని సమాచారం.