- Home
- Entertainment
- OTT Movies: ప్రేమికుల రోజున మీ లవర్ తో తప్పకుండా చూడాల్సిన టాప్ 5 బెస్ట్ ఓటీటీ మూవీస్ ఇవే.. ఎక్కడ చూడాలంటే
OTT Movies: ప్రేమికుల రోజున మీ లవర్ తో తప్పకుండా చూడాల్సిన టాప్ 5 బెస్ట్ ఓటీటీ మూవీస్ ఇవే.. ఎక్కడ చూడాలంటే
ప్రేమికుల రోజున ప్రేమ జంటలు చూడాల్సిన టాప్ 5 బెస్ట్ మూవీస్ లిస్ట్ ఈ కథనంలో ఉంది. వీటిలో భారీ పాన్ ఇండియా చిత్రాలు, స్వచ్ఛమైన ప్రేమ కథలు ఉన్నాయి. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Top 5 Best Love Stories on Prime Video
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా చూడాల్సిన ప్రేమకథా చిత్రాలు చాలా ఉన్నాయి. టాప్ 5 ఉత్తమ ప్రేమ కథా చిత్రాలు ప్రైమ్ వీడియోలో ఉన్నాయి. వాలంటైన్స్ డే సందర్భంగా ప్రేమ జంటలు ఈ సినిమాలు చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఆ మూవీస్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
సీతారామం
డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ ఎమోషనల్ లవ్ స్టోరీలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. సంచలన విజయం సాధించిన ఈ మూవీ ప్రైమ్ వీడియోలో ఉంది.
రాధే శ్యామ్
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన పీరియాడిక్ ప్రేమ కథా చిత్రం కమర్షియల్ గా నిరాశపరిచింది. కానీ ప్రేమ జంటలని ఆకట్టుకునే ఫీల్ గుడ్ సన్నివేశాలు ఈ చిత్రంలో ఉన్నాయి.
కన్యాకుమారి
చిన్న సినిమాగా విడుదలైన కన్యాకుమారి చిత్రం ప్రైమ్ వీడియోలో సంచలన రెస్పాన్స్ దక్కించుకుంది. స్వచ్ఛమైన ప్రేమ కథగా అందరినీ ఆకట్టుకుంది. గీత్ షైనీ, శ్రీచరణ్ రాచకొండ ఈ చిత్రంలో జంటగా నటించారు.
ఆర్ఎక్స్ 100
బోల్డ్ లవ్ స్టోరీ చిత్రంగా ఆర్ఎక్స్ 100 మూవీ తెరకెక్కింది. ఈ మూవీలో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ యువతని ఆకట్టుకుంటాయి.
ఏ మాయ చేసావె
నాగ చైతన్య, సమంత జంటగా నటించిన తొలి చిత్రం ఏ మాయ చేసావె. వీరిద్దరూ తమ కెమిస్ట్రీతో నిజంగానే ప్రేక్షకులని మాయ చేశారు.

