పొగరు అనుకున్నా పర్లేదు.! రామ్ చరణ్ 'పెద్ది' మూవీ ఆఫర్ అందుకే రిజెక్ట్ చేశా
Peddi Movie: పెద్ది మూవీ ఆఫర్‌ను ఎందుకు రిజెక్ట్ చేశానోనని నటుడు బండి సరోజ్ కుమార్ చెప్పుకొచ్చాడు. తాను క్యారెక్టర్ రోల్స్ చేయకూడదని అనుకున్నానని.. అందుకే పెద్ది ఆఫర్ రిజెక్ట్ చేశానని అన్నాడు. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా

ఇండస్ట్రీ అనుభవాలు ఇలా..
సుమ కనకాల కొడుకు రోషన్ కనకాల, దర్శకుడు సందీప్ రాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'మోగ్లీ'. ఈ మూవీలో కీలక పాత్రలో కనిపించనున్నాడు నటుడు, దర్శకుడు బండి సరోజ్ కుమార్. తన సినీ ప్రయాణం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. మొదట్లో జూనియర్ ఆర్టిస్ట్‌గా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించానని, హీరో కావాలనే లక్ష్యంగా ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎక్కానని చెప్పాడు. అయితే పరిశ్రమలో పరిస్థితులు చూసి హీరో కావడం కష్టమని భావించి.. తన వ్యూహాన్ని మార్చుకున్నానని చెప్పాడు.
దర్శకుడిగా మారే క్రమంలో విమర్శలు..
హీరో నుంచి దర్శకుడిగా మారాలని నిర్ణయించుకుని.. ఆ వైపుగా తన గమనాన్ని కొనసాగించనని బండి సరోజ్ కుమార్ తెలిపాడు. దర్శకుడిగా మారే క్రమంలో, కొందరు తనను విమర్శించినా.. వాటిని పెద్దగా పట్టించుకోలేదన్నాడు. మొదట వడ్డే నవీన్, తారకరత్న వంటి ఫ్లాప్ హీరోలతో పని చేసి.. వాళ్లను స్టార్‌లుగా మార్చాలనుకున్నాను.
గోపీచంద్, మహేష్ బాబులను కలవాలనుకున్నా..
అయితే ఆ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. ఒక సీనియర్ కో-డైరెక్టర్ సలహా మేరకు మార్కెట్ ఉన్న హీరోలతో పని చేస్తేనే నిర్మాతల హెల్ప్ లభిస్తుందని గ్రహించాను. గోపీచంద్, మహేష్ బాబు వంటి ప్రముఖ హీరోలను కలిసే ప్రయత్నం చేశానని, అయితే ఆ ప్రయత్నాలు కేవలం మార్కెట్ కోసమే తప్ప, వారిపై తనకు ప్రత్యేక అభిమానం లేదని స్పష్టం చేశాడు.
కొత్త నటులతో సినిమాలు..
కొత్త నటులతో సినిమాలు తీయడం ప్రారంభించాను. ఆ తర్వాత తనను తాను హీరోగా పరిచయం అయ్యాను. ఈ నిర్ణయమే తన కెరీర్‌లో విజయాన్ని తీసుకొచ్చింది. మార్కెట్ ఉన్నవారితో పనిచేయడం వల్ల లాభం ఉంటుందని తెలిసినా, తనను తాను నిరూపించుకున్న తర్వాత లభించే గౌరవం వేరని చెప్పుకొచ్చాడు. బాల లాంటి దర్శకులు కొత్త నటులను స్టార్‌లుగా తయారు చేసినప్పుడు లభించే గౌరవం, సాధారణ కమర్షియల్ దర్శకులకు లభించదని తెలిపాడు. పరాక్రమం సినిమా ద్వారా తాను చాలా నేర్చుకున్నానని, థియేట్రికల్ సినిమాను ఎలా తీయాలో ఇప్పుడు తనకు అవగాహన వచ్చిందని సరోజ్ కుమార్ చెప్పాడు.
పెద్ది ఆఫర్ రిజెక్ట్..
పెద్ది మూవీ ఆఫర్ విషయానికి వస్తే.. బుచ్చిబాబు పరాక్రమం షూటింగ్ సమయంలోనే తనను సంప్రదించాడని సరోజ్ కుమార్ తెలిపాడు. మంచి పాత్ర ఉందని చెప్పాడని తెలిపాడు. అయితే, 'నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ చేయను సర్. నన్ను గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉంది' అని చెప్పినట్టుగా సరోజ్ కుమార్ చెప్పాడు. తన ప్రేక్షకులు తనను హీరోగా చూడాలని, క్యారెక్టర్ రోల్స్ చేయడం ద్వారా ఆ ఇమేజ్‌ను తక్కువ చేసుకోలేనని బండి సరోజ్ కుమార్ క్లారిటీ ఇచ్చాడు.

