- Home
- Entertainment
- టాలీవుడ్ టాప్ స్టార్ గా ప్రభాస్ నెక్స్ట్ ఎన్టీఆర్... లేటెస్ట్ సర్వేలో మహేష్ వెనక్కి టాప్ 5లో చోటు వీరికే!
టాలీవుడ్ టాప్ స్టార్ గా ప్రభాస్ నెక్స్ట్ ఎన్టీఆర్... లేటెస్ట్ సర్వేలో మహేష్ వెనక్కి టాప్ 5లో చోటు వీరికే!
ప్రముఖ బాలీవుడ్ మీడియా సంస్థ ప్రతి నెలా వెండితెర, బుల్లితెర, స్పోర్ట్స్ స్టార్స్ పై సర్వే నిర్వహిస్తూ ఉంటుంది. దేశంలోని ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగా ప్రతి రంగానికి చెందిన స్టార్స్ కి ర్యాంక్స్ కేటాయిస్తుంది. జూన్ నెలకు గాను టాలీవుడ్ స్టార్ హీరోలకు పాపులారిటీ ఆధారంగా ర్యాంక్స్ కేటాయించడం జరిగింది. దాని ప్రకారం డార్లింగ్ ప్రభాస్ ఫస్ట్ ర్యాంక్ కైవసం చేసుకున్నాడు.

బాహుబలి తర్వాత ప్రభాస్(Prabhas) పాపులారిటీ దేశవ్యాప్తమైంది.దీంతో జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయన ఇమేజ్ తగ్గడం లేదు. ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ ఘోరపరాజయం చవిచూసినప్పటికీ ఇండియన్ ప్రేక్షకులు ఆయనకు టాప్ ర్యాంక్ ఇస్తున్నారు.
జూన్ సర్వే ప్రకారం ఎన్టీఆర్(NTR) సెకండ్ ర్యాంక్ లోకి దూసుకొచ్చాడు. మే నెలలో ఆయన థర్డ్ ర్యాంక్ లో ఉన్నారు. ప్రభాస్, మహేష్ మొదటి రెండు స్థానంలో ఉన్నారు. తాజా సర్వేలో ఎన్టీఆర్ మహేష్ ని వెనక్కి నెట్టి 2వ రాంక్ రాబట్టాడు. ఆర్ ఆర్ ఆర్ హిట్ నేపథ్యంలో పాన్ ఇండియా స్టార్స్ లిస్ట్ లో కూడా ఎన్టీఆర్ టాప్ టెన్ లో స్థానం దక్కించుకుంటున్నాడు.
ఇక పుష్ప మూవీతో అల్లు అర్జున్(Allu Arjun) రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. పుష్ప హిందీలో రికార్డు వసూళ్లు సాధించగా ఆయనకు పాన్ ఇండియా ఇమేజ్ దక్కింది. ఇక జూన్ సర్వేలో ప్రభాస్ 3వ ర్యాంక్ కైవసం చేసుకున్నాడు. మే నెల రిజల్ట్ ప్రకారం మాత్రం అల్లు అర్జున్ 4వ ర్యాంక్ లో ఉండడం విశేషం.
సూపర్ స్టార్ మహేష్(Mahesh Babu) ఈసారి రెండు స్థానాలు కోల్పోయాడు. ఆయన ర్యాంక్ నుండి 4వ ర్యాంక్ కి పడిపోయింది. మే నెలలో 2వ ర్యాంక్ లో ఉన్న మహేష్ జూన్ నాటికి రెండు స్థానాలు దిగజారారు. మహేష్ లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట మంచి విజయం సాధించినప్పటికీ మహేష్ ర్యాంక్స్ లో వెనుకబడ్డారు.
ఇక టాప్ ఫైవ్ లో రామ్ చరణ్ కి చోటు దక్కింది. రామ్ చరణ్(Ram Charan) ర్యాంక్ సుస్థిరంగా ఉంది. మే, జూన్ నెలల్లో 5వ ర్యాంక్ రామ్ చరణ్ కి దక్కింది. ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ మూవీతో పాన్ ఇండియాతో పాటు గ్లోబల్ ఇమేజ్ దక్కింది.
Tollywood Top Stars
ఇక టాప్ టెన్ లో పెద్దగా మార్పులు లేవు. పవన్ కళ్యాణ్ గత నెల మాదిరి 6వ ర్యాంక్ కి పరిమితమయ్యాడు. నాని సైతం 7వ ర్యాంక్ సుస్థిరం చేసుకున్నాడు. చిరంజీవి ఒక ర్యాంక్ మెరుగుపరుచుకొని 8వ ర్యాంక్ దక్కించుకోగా విజయ్ దేవరకొండ ఎనిమిది నుండి 9వ ర్యాంక్ కి పడిపోయాడు. హీరో రవితేజ మే నెల మాదిరి 10వ ర్యాంక్ తో సరిపెట్టుకున్నాడు.