- Home
- Entertainment
- టాలీవుడ్ స్టార్స్ డైరెక్టర్స్ వయసు తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది... ఎవరు ఓల్డ్? ఎవరు యంగ్?
టాలీవుడ్ స్టార్స్ డైరెక్టర్స్ వయసు తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది... ఎవరు ఓల్డ్? ఎవరు యంగ్?
రాజమౌళి, పూరి జగన్నాథ్, త్రివిక్రమ్, సుకుమార్, కొరటాల శివ, సందీప్ రెడ్డి వంగ, శ్రీను వైట్ల, ప్రశాంత్ నీల్ టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ గా ఉన్నారు. వీరి వయసు తెలిస్తే ఒకింత షాక్ కావడం ఖాయం. ఎవరెవరు ఎప్పుడు పుట్టారో? వారి వయసు ఎంత? ఎవరు ఓల్డ్? ఎవరు యంగ్? అనేది చూద్దాం..

ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు దర్శకుడు రాజమౌళి. ఆర్ ఆర్ ఆర్ మూవీతో గ్లోబల్ ఫేమ్ రాబట్టాడు. రాజమౌళి 1973 అక్టోబర్ 10న జన్మించాడు. ఆయన వయసు 50 ఏళ్ళు. సినిమాకు రెండు మూడేళ్లు తీసుకుంటున్నారు. నెక్స్ట్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు.
పుష్ప చిత్రంతో సుకుమార్ ఇమేజ్ పాన్ ఇండియాకు చేరింది. టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత స్థానం ప్రస్తుతం సుకుమార్ దే. సుకుమార్ వయసులో రాజమౌళి కంటే పెద్దవాడు. 1970 జనవరి 11న జన్మించిన సుకుమార్ వయసు 54 ఏళ్ళు. ప్రస్తుతం పుష్ప 2 పనుల్లో బిజీగా ఉన్నారు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరు. 1971 నవంబర్ 7న త్రివిక్రమ్ జన్మించారు. ఆయన వయసు 52 ఏళ్ళు. ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రకటించాల్సి ఉంది.
దేవర మూవీతో బాక్సాఫీస్ ని షేక్ చేసేందుకు సిద్ధం అవుతున్నాడు కొరటాల శివ. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో 1975 జూన్ 15న కొరటాల శివ జన్మించారు. ఆయన వయసు 48 ఏళ్ళు.
దర్శకుడు పూరి జగన్నాధ్ టాలెంటెడ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ గా పేరు గాంచాడు. పూరి జగన్నాధ్ ఈ జనరేషన్ స్టార్ డైరెక్టర్స్ అందరిలో పూరి జగన్నాధ్ వయసులో పెద్దవాడు కావడం విశేషం. 1966 సెప్టెంబర్ 28న జన్మించిన పూరి జగన్నాధ్ వయసు 55 ఏళ్ళు. ప్రస్తుతం ఆయన డబుల్ ఇస్మార్ట్ మూవీ చేస్తున్నారు.
వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఆయన డెబ్యూ మూవీ అర్జున్ రెడ్డి ఒక సంచలనం. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ అంతకు మించిన విజయం సాధించింది. ఇక యానిమల్ తో రూ. 900 కోట్ల వసూళ్లు రాబట్టాడు. 1981 డిసెంబర్ 25న జన్మించిన సందీప్ రెడ్డి వంగ వయసు 41 ఏళ్ళు.
కెజిఎఫ్ సిరీస్ తో దేశాన్ని ఊపేశాడు ప్రశాంత్ నీల్. ఆంధ్రప్రదేశ్ లో పుట్టిన ప్రశాంత్ నీల్ కన్నడ పరిశ్రమలో సెటిల్ అయ్యాడు. సలార్ తో టాలీవుడ్ లో అడుగుపెట్టాడు. 1980 జూన్ 4న పుట్టిన ఆయన వయసు 44 ఏళ్ళు.