హైదరాబాద్ లో ఆస్తులు కొంటున్న మహేష్ బాబు.. ఎన్ని కోట్ల ప్రాపర్టీ అంటే..?
వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. అంతే కాదు ఆడ్స్ , బిజినెస్ లు అంటూ భారీగా సంపాదిస్తున్నాడు కూడా. ఇక కొంత సమాజ సేవ చేస్తూ.. మరికొంతతో భారీగా ఆస్తులు కొంటున్నాడు సూపర్ స్టార్.

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం ప్రిపేర్ అవుతున్న మహేష్ బాబు.. వరుసగా యాడ్స్ లో నటిస్తూ.. సందడి చేస్తున్నాడు. ఇప్పటికే 25 కు పైగా బ్రాండ్స్ ను ప్రమోట్ చేశాడు మహేష్. కాగా.. రీసెంట్ గా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మహేష్ బాబు ఓ యాడ్ షూటింగ్ లో పాల్గొన్నారు ఆలుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
త్వరలో రాజమౌళి, మహేష్ సినిమాకు సంబంధించి మహేష్ లుక్ కూడా ఫైనల్ అయిందని.. షూటింగ్ కూడా ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇక చేతినిండా సంపాదిస్తున్న మహేష్ బాబు.. తన సంపాదనలో కొంత భాగం సమాజ సేవకోసం వినియోగిస్తున్నారు. చాలా మందిచిన్నారులకు ఇప్పటికే హార్ట్ ఆపరేషన్లు చేయించాడు మహేష్ బాబు.
ఇక మహేష్ వరుసగా ఆస్తులు కొంటున్నట్టు తెలుస్తోంది. ఆయన ఇప్పటి ఏఏంబీమాల్ తో పాటు.. మరికొన్ని బిజినెస్ లు కూడా ఉన్నాయి. కాగా క్రాస్ రోడ్ లో కూడా మరో థియేటర్ ను ఆయన తీసుకున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఈ స్టార్ హీరో హైదరాబాద్ శివార్లలో 2.5 ఎకరాల భూమిని కొనుగోలు చేశారట. సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును తెలివిగా భూమి మీద ఇన్వెస్ట్ చేశారని సమాచారం.
మహేష్ బాబు కొనుగోలు చేసిన ఈ ఆస్తులు విలువ 50 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. మహేష్ బాబుకు ఇప్పటికే థియేటర్లు, రెస్టారెంట్ బిజినెస్ లలో ఇన్వెస్ట్ లు చేసి ఆ వ్యాపారాల ద్వారా ఊహించని స్థాయిలో లాభాలను సొంతం చేసుకుంటున్నారు. హీరోగా మాత్రమే కాదు సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ గా కూడా మంచి సక్సెస్ ను అందుకున్నారు మహేష్ బాబు.
ఇక సినిమాల ద్వారా కూడా మహేష్ బాబు భారీగా సంపాదిస్తున్నారు. రెమ్యూనరేషన్ కూడా టాప్ లో ఉందని టాక్. 100 కోట్ల రేంజ్ లో ఈయన పారితోషికం అందుకుంటూ ఇండస్ట్రీల్లో మంచి స్థానం సంపాదించుకున్నారు. ఇక డైరెక్టర్ రాజమౌళితో సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఓ రెండు సంవత్సరాలు ఇతర సినిమాలకు కమిట్ అవకుండా ఉండాల్సిందే. కానీ ఆ తర్వాత హిట్ కూడా అదే రేంజ్ లో ఉంటుందని టాక్.మొత్తం మీద సినిమాలు, బిజినెస్ ల ద్వారా సంపాదిస్తూ.. లాండ్ అయితే కొన్నారు. మరి చూడాలి ఇందులో ఎంత నిజం ఉందనేది..