చిరంజీవి, అల్లు అర్జున్, నాని.. టాలీవుడ్ స్టార్స్ ఇంట ఘనంగా గణపతి పూజ
తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఊరూవాడా గణేశ్ మండపాలు ఏర్పాటు చేసిన భక్తులు, విఘ్నవినాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదానాలతో కోలాహలం నెలకొంది. ఇక టాలీవుడ్ లో కూడా స్టార్ హీరోల నివాసాలలో బొజ్జ గణపయ్యలు కొలువుదీరారు. ఘనంగా పూజలందుకున్నారు.

ఇక టాలీవుడ్ లో కూడా స్టార్ హీరోల నివాసాలలో బొజ్జ గణపయ్యలు కొలువుదీరారు. ఘనంగా పూజలందుకున్నారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు.. నేచురల్ స్టార్ నానీ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఆది .. ఇలా హీరోలంతా విఘ్న వినాయకుడికి భక్తితో పూజ చేశారు.
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన నివాసంలో వినాయక చవితి పండుగ జరుపుకున్నారు. ప్రకృతి హితంగా..తమ పూజా మందిరంలో మట్టి గణపయ్యను భక్తితో కొలుచుకున్నారు చిరు ఫ్యామిలీ. తల్లి అంజనాదేవి, భార్య సురేఖలతో కలిసి స్వామికి ఘనంగా పూజలు చేశారు మెగాస్టార్.
తన ఇంట కొలువుదీరిన గణపతికి ఇష్టమైన పాయసం, పులిహోర,ఉండ్రాళ్లు, కుడుములు, వడలు, పండ్లు ఇలా రకరకాల నైవేద్యాలు బొజ్జ గణపయ్యకు సమర్పించారు మెగాస్టార్. అంతే కాదు అందరికి చవితి శుభాకాంక్షలు తెలుపుతూ.. ఈ పూజకుకి సంబంధించిన ఫొటోలను చిరంజీవి ట్విట్టర్ లో పంచుకున్నారు. అందరి జీవితాలలో విఘ్నాలు తొలగి విజయాలు, సుఖ సంతోషాలు కలిగేలా ఆ విఘ్నేశ్వరుడు సదా ఆశీర్వదించాలని ఆయన కోరుకున్నారు.
మరో వైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంట కూడా గణపతి పూజా ఘనంగా జరిగింది. అల్లువారు కూడా మట్టిగణపతినే పూజించారు. ట్రెడిషన్ డ్రెస్ లో కనిపించిన అల్లు అర్జున్, స్నేహారెడ్డి వారి ఇద్దరు పిల్లలు.. కలిసి పూజ చేసిన పిక్ ను స్నేహారెడ్డి తన సోషల్ మీడియా పేజ్ లో పంచుకున్నారు.
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని కూడా తన ఇంట ఘనంగా గణపతి పూజ చేసుకున్నారు. తన వారసుడితో కలిసి పూజ చేసుకున్న నానీ.. ఆపిక్ ను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
అటు యంగ్ స్టార్.. సాయి కుమార్ తనయుడు.. ఆది సాయి కుమార్ కూడా వినాయక చవితిని ట్రెడిషనల్ గా జరుపుకున్నారు. ఓ చిన్న మట్టి గణపతిని తన కూతురు పట్టుకుని ఉండగా.. ట్రెడిషనల్ డ్రెస్సులో ఉన్న ఆది, అతని భార్య, పాప ముగ్గురు ఫోటో తీసుకున్నారు. ఈ పిక్ ను సోషల్ మీడియాలో పంచుకున్నారు ఆది సాయి కుమార్.