మన హీరోలు ఇంత దారుణమా.. ఒకరిని మించి మరొకరు!
First Published Aug 24, 2019, 6:05 PM IST
90 దశకం వరకు టాలీవడ్ స్టార్ హీరోల నుంచి ఏడాదికి మూడు, నాలుగు చిత్రాలు వచ్చేవి. కానీ ఆ తర్వాత జనరేషన్ హీరోలు ఏడాదికి ఒక సినిమా లేదంటే రెండు మాత్రమే చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలు ఇటీవల చాలా స్లోగా సినిమాలు చేస్తున్నారు. మహేష్, పవన్, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు ఎన్నేళ్లలో ఎన్ని సినిమాలు చేశారనే వివరాలు ఇవే.

మహేష్ బాబు : మహేష్ హీరోగా నటించిన తొలి చిత్రం రాజకుమారుడు. 20 ఏళ్ల కెరీర్ లో మహేష్ చేసింది కేవలం 25 సినిమాలు మాత్రమే. 2008,09 సంవత్సరాలలో మహేష్ నుంచి ఏ సినిమా విడుదల కాలేదు.

ఎన్టీఆర్: తన 18 ఏళ్ల సినీ కెరీర్ లో ఎన్టీఆర్ చేసిన చిత్రాలు 28. కెరీర్ ఆరంభంలో ఎన్టీఆర్ స్పీడ్ గా సినిమాలు చేసినా ఇప్పుడు మాత్రం ఏడాదికి ఒక చిత్రంలోనే నటిస్తున్నాడు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?