టాలీవుడ్ ప్రముఖ దర్శకుల నుంచి వచ్చిన చెత్త సినిమాలు ఇవే

First Published 10, Sep 2019, 3:48 PM IST

పరాజయాలు ఎదురుకావడం సహజమే. ప్రముఖ దర్శకులుగా చలామణి అవుతున్న వారి నుంచి దారుణమైన చిత్రాలు ఎవరూ ఊహించరు. కాగా టాలీవుడ్ లో ఈ దర్శకుల నుంచి వచ్చిన చిత్రాలు వారి కెరీర్ లోనే చెత్త సినిమాలుగా నిలిచిపోయాయి.

బిగ్ బాస్: చిరంజీవి నటించిన ఈ చిత్రానికి విజయ బాపినీడు ఈ చిత్రానికి దర్శకుడు. అప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గ్యాంగ్ లీడర్ చిత్రం సంచలన వసూళ్లతో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దీనితో సహజంగానే ఆ తర్వాత వస్తున్న బిగ్ బాస్ చిత్రంపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. కానీ బిగ్ బాస్ చిత్రం చిరంజీవి కెరీర్ లో ఓ చెత్త సినిమాగా నిలిచిపోయింది.

ఒక్క మగాడు: నందమూరి ఫ్యామిలీకి అభిమాని అనే పేరు ప్రముఖ దర్శకుడు వైవిఎస్ చౌదరికి ఉంది. హరికృష్ణకు అప్పటికే వైవిఎస్ చౌదరి లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య లాంటి ఘనవిజయాలు అందించారు. దీనితో బాలయ్యతో తెరకెక్కించే ఒక్కమగాడు చిత్రం సంచలనం సృష్టించడం ఖాయం అని అంతా భావించారు. ఆ చిత్రం బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.

ఆంధ్రావాలా : ఇడియట్, అమ్మా నాన్నా ఓ తమిళమ్మాయి, శివమణి లాంటి సూపర్ హిట్స్ తో డాషింగ్ డైరెక్టర్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అదే సమయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సింహాద్రి చిత్రంతో ఇండస్ట్రీని షేక్ చేశాడు. సింహాద్రి తర్వాత పూరి దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ విడుదలైన ఆంధ్రావాలా చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది.

మృగరాజు: చూడాలని ఉంది చిత్రంతో అప్పటికే గుణశేఖర్, చిరంజీవిలది సూపర్ హిట్ కాంబినేషన్. చిరంజీవి, అప్పటి యువత కలలరాణి సిమ్రాన్ జంటగా భారీ వ్యయంతో గుణశేఖర్ మృగరాజు చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ మృగరాజు చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

పలనాటి బ్రహ్మనాయుడు : దర్శకుడు బి గోపాల్, బాలయ్య కాంబినేషన్ లో నరసింహనాయుడు, సమరసింహా రెడ్డి లాంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఆ తర్వాత వీరిద్దరి కలయికలో వచ్చిన చిత్రం పలనాటి బ్రహ్మనాయుడు. ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది.

బ్రహ్మోత్సవం : శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ని ఉర్రూతలూగించింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో రాబోయే బ్రహ్మోత్సవం చిత్రం కూడా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుందని అంతా భావించారు. కానీ మహేష్ అభిమానుల నుంచి సైతం ఈ చిత్రానికి విమర్శలు ఎదురయ్యాయి.

షాడో : మెహర్ రమేష్ ఈ చిత్రానికి దర్శకుడు. వెంకటేష్ కెరీర్ లో ఇదో చెత్త చిత్రంగా నిలిచిపోయింది.

అజ్ఞాతవాసి : పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే అంచనాలు ఏస్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.అత్తారింటికి దారేది లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న అజ్ఞాతవాసిపై ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. కానీ ఆ అంచనాలన్నింటినీ తల్లక్రిందులు చేసింది.

ఇంటెలిజెంట్ : వివి వినాయక్ ఈ చిత్రానికి దర్శకుడు. వరుస పరాజయాలతో ఉన్న సాయి ధరమ్ తేజ్ కు ఈ చిత్రంతో మరో ఫ్లాప్ ఎదురైంది.

ఆఫీసర్ : నాగార్జునకు ఆర్జీవీ శివ లాంటి చరిత్రలో నిలిచిపోయే సినిమా అందించాడు.. నిజమే. కానీ వర్మ ప్రస్తుత ఫామ్ దృష్ట్యా ఆఫీసర్ చిత్రంపై ఏమాత్రం అంచనాలు లేవు. కనీసం ఒకమాదిరిగా అయినా ఆడుతుందని భావించిన నాగ్ అభిమానులు ఈ చిత్రం షాకిచ్చింది. నాగార్జున కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఆఫీసర్ చిత్రం.

అమర్ అక్బర్ ఆంటోని : ఈ చిత్రంతో అయినా ఫేము లోకి వస్తాడని భావించిన శ్రీనువైట్ల అభిమానులకు నిరాశే. రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రంతో శ్రీనువైట్ల తన డిజాస్టర్ జర్నీని కొనసాగించాడు.

నక్షత్రం : సాయిధరమ్ తేజ్, సందీప్ కిషన్ నటించిన మల్టీస్టారర్ చిత్రం ఇది. క్రియేటివ్ డైరెక్టర్ అని పేరున్న కృష్ణవంశీ చెత్త సినిమా తీశాడనే విమర్శలు ఎదురయ్యాయి.

loader