MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Tollywood Six Pack Heroes: చొక్కాలు చించుకుంటున్న టాలీవుడ్ యంగ్ హీరోలు.. జిమ్ముల్లో తెగ కుమ్ముతున్నారు..

Tollywood Six Pack Heroes: చొక్కాలు చించుకుంటున్న టాలీవుడ్ యంగ్ హీరోలు.. జిమ్ముల్లో తెగ కుమ్ముతున్నారు..

టాలివుడ్ యంగ్ హీరోలంతా.. ఇప్పుడు చొక్కాలు చించుకొని మరీ హీరోయిజం చూపిస్తున్నారు. సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్ లతో.. బాక్సాఫీస్ ని షేక్ చేసేందుకు ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం యంగ్ స్టార్స్ అంతా ఇదే పనిమీద ఉన్నారు. విజయ్ దేవరకొండ, కార్తికేయ,వరుణ్ ఇలా యువ హీరోలంతా టోన్డ్ బాడీతో పిచ్చెక్కిస్తున్నారు.

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 23 2022, 01:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

ఒకప్పుడు హీరో అంటే డీసెంట్ గా.. రాముడు మంచి బాలుడు అన్నట్టు ఉండేది. ఎప్పుడైనా రౌడీలు అటాక్ చేస్తేనే హీరోయిజం బయట పడేది కాని ఇప్పుడు పద్దతి మారింది. అన్ని ట్రెండ్స్ చేంజ్ అవుతున్నట్టుగానే హీరోయిజం  ట్రెండ్ కూడా చేంజ్ అయ్యింది. చొక్కాలు చించుకుని కండలు చూపిస్తేనే హీరోయిజం ఎలివేట్ అవుతోంది. చాలామంది ఆడియన్స్ కూడా అదే కోరుకుంటున్నారు. అందుకే.. హీరోలంతా బాడీని వంచి  కష్టపడుతున్నారు. కుదిరితే సిక్స్ ప్యాక్.. ఇంకా కుదిరితే ఎయిట్ ప్యాక్స్ చేసి దడదడలాడించబోతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

లైగర్ మూవీ కోసం తెగ కష్టపడ్డాడు  రౌడీ హీరో విజయ్ దేవరకొండ. స్క్రీన్ మీద ఆయన కష్టం కనిపించింది. రీసెంట్ గా  రిలీజ్ అయిన  లైగర్ టీజర్ లో విజయ్ అగ్రెసివ్ యాటిట్యూడ్ కి.. ఐరన్ బాడీ తోడవ్వడంతో బాక్సింగ్ రింగ్ లో పంచ్ లు ఓ రేంజ్ లో పడ్డట్టు కనిపిస్తోంది. అంతేకాదు కాదు ఈ బాడీతో అమ్మాయి  హృదయంలో ఇంకాస్త లోతుగా వెళ్లిపోయాడు విజయ్. లైగర్ లో బాక్సింగ్ స్టార్ మైక్ టైసన్ కూడా ఓ క్యారెక్టర్ చేయడంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.

39

మెగా ప్రిన్స్ గా పేరు తెచ్చుకున్న వరుణ్ తేజ్(Varun Tej) రోమల్ శిల్పంలా మారిపోయాడు. మార్చి 18న రిలీజ్ కి రెడీ అవుతోన్న స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ గనీలో వరుణ్ తేజ్ ఫస్ట్ టైం చొక్కా విప్పాడు. సిక్స్ ప్యాక్ తో ఎట్రాక్టీవ్ బాడీతో రచ్చ చేస్తున్నాడు. ఇప్పటికే సిక్స్ ఫీట్ ఉన్న వరుణ్ కు సిక్స్ ప్యాక్ కూడా తో డు అవ్వడంతో మెగా హీరో ఇమేజ్ అమాంతం పెరిగిపోతోంది. ఇప్పటికే రిలీజ్ ఐన గని టీజర్ చూస్తుంటే  బాక్సర్ గని పంచుల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది.

49

ఇస్మార్ట్ శంకర్ తో కంప్లీట్ గా మేక్ ఓవర్ అయ్యాడు చాక్లెట్ బాయ్ రామ్ పోతినేని(Ram Pothineni). ఈ  గెటప్ తో మాస్ ఇమేజ్ సాధించేశాడు. ఎనర్జిటిక్ టార్ గా తనను తాను నిరూపించుకున్నాడు. ఆతరువాత వచ్చిన రెడ్ నిరాశపరిచినా.. మరోసారి తనను తాను ఇంకాస్త కొత్తగా మేకోవర్ చేసుకునే పనిలో ఉన్నాడు రామ్. ది వారియర్ మూవీ కోసం భారీగా వర్కవుట్స్ చేస్తున్నాడు. లింగుస్వామి డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ బైలింగ్వల్ మూవీలో.. రామ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నాడు. అందుకే.. మళ్లీ కండలు పెంచి ఫిట్ గా తయారయ్యాడట. ది వారియర్ క్లైమాక్స్ ఫైట్ లో రామ్ సిక్స్ ప్యాక్ ని ఓ రేంజ్ లో చూపించబోతున్నట్టు తెలుస్తోంది.

59

అఖిల్ అక్కినేని(Akhil) కూడా సిక్స్ ప్యాక్ తో అదరగొడుతున్నాడు. బీభత్సమైన వర్కవుట్స్ తో తన లుక్ ను కంప్లీట్ గా చేంజ్ చేశాడు. జిమ్ములో  చెమటలు కక్కిస్తున్నాడు. మొన్నటిదాకా లవర్ బాయ్ లా కనిపించిన అఖిల్.. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఏజెంట్(Agent) మూవీ కోసం.. సిక్స్ ప్యాక్ చేసి కంప్లీట్ గా మారిపోయాడు. రఫ్ అండ్ రగ్డ్ లుక్ లో  అఖిల్ సిక్స్ ప్యాక్ ఫోటోస్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో రా ఏజంట్ గా నటిస్తున్నాడు అఖిల్. అఖిల్ లుక్  చూసి అందరూ షాక్ అవుతున్నారు. మరి ఏజంట్ ఏ రేంజ్ లో అలరిస్తాడో కూడా చూడాలి.

69

ఇక కార్తికేయ(Karthikeya) గురించి ప్రత్యేకంగ చెప్పనక్కర్లేదు. హీరోగా ఎంట్రీనే సిక్స్ ప్యాక్ తో ఇచ్చాడు కుర్ర హీరో. టాలీవుడ్ లో సిక్స్ ఫీట్ సిక్స్ ప్యాక్ హీరోగా ప్రభాస్ తరువాత అనిపించికుంది మన కార్తికేయానే. ఈ ఫిట్ నెస్ తో అటు హీరోగా ఇటు విలన్ గా కూడా దూసుకుపోతున్నాడు కార్తికేయ. అమ్మాయిల  నుంచి కార్తికేయ కు మంచి ఫాలోయింగ్ ఉంది. వరుస ఫేయిల్యూర్స్ ఫేస్ చేస్తున్నా. మనోడి ఇమేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం తమిళ్ లో తల అజిత్(Ajith) మూవీ వాలిమైలో విలన్ గా చేస్తోన్న కార్తికేయ.. మరోసారి తన సిక్స్ ప్యాక్ బాడీతో దుమ్మురేపనున్నాడు. యాక్షన్ సీన్స్ లో అజిత్ తో పోటీపడి స్టంట్స్ చేశాడు కార్తికేయ.

79

రీసెంట్ గా లక్ష్య సినిమా కోసం తెగ కష్టపడ్డాడు యంగ్ స్టార్ నాగశౌర్య. సిక్స్ ప్యాక్ కోసం బాగా కృషి చేశాడు.ఈ మవీలో ఓ సీన్ కోసం నీళ్లు కూడా తాగకుండా తనను తాను ఇబ్బంది పెట్టుకుంటూ సినిమా చేశాడు. తన ఇమేజ్ ను పూర్తిగామార్చుకుని.. ఫుల్ గా మేక్ ఓవర్ అయినా.. శౌర్యకు హిట్  లభించలేదు. లక్ష్య మూవీ డిజాస్టర్ అయ్యింది.

89

యంగ్ హీరోలే కాదు.. రామ్ చరణ్(Ram Chararan), ఎన్టీఆర్(NTR), అల్లు అర్జున్(Allu Arjun) లాంటి స్టార్ హీరోలు కూడా తమ సినిమాల కోసం తెగ కష్టపడుతున్నారు. ట్రిపుల్ ఆర్ లో రామ్ చరణ్ టోన్డ్ బాడీ..స్పెషల్ మేకోవర్ కు మెగా ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. చరణ్ ను ఇంలాంటి డిఫరెంట్ లుక్ లో చూస్తాం అని వారు అనుకోలేదు. సీతారామరాజుగా ఆయన టీజర్ చూసిన అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు

99

ఇప్పటికే  మన  స్టార్ హీరోలు సిక్స్ ప్యాక్ బాడీతో మెస్మరైజ్ చేశారు. ఇప్పటికీ అదే ఫిట్ నెస్ ని మెయిన్ టైన్ చేస్తున్నారు. అందులో  అర్జున్., ఎన్టీఆర్ లాంటివారు కూడా ఉన్నారు. అసలు టాలీవుడ్ కు సిక్స్ ప్యాక్ ను పరిచయం చేసిందే అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీ కోసం బన్నీ మరోసారి చొక్కా విప్పబోతున్నట్టు తెలుస్తోంది. ఇక టెంపర్ తో ఎన్టీఆర్(Ntr) ఫస్ట్ టైమ్ సిక్స్ పాక్య్ చూపించారు. అరవింద సమేతలో అది కంటీన్యూ చేశాడు. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ కోసం డిఫఱెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు తారక్.  ఫిల్మ్ ఇండస్ట్రీలో రకరకాల ట్రెండ్స్ వచ్చాయి పోయాయి కని.. సిక్స్ ప్యాక్ ట్రెండ్ మాత్రం అలాగే కంటిన్యూ అవుతోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Balakrishna: చిరంజీవి, బాలకృష్ణతో ఒక్క సినిమా కూడా చేయని స్టార్ హీరోయిన్ ఎవరు? కారణం ఏంటి?
Recommended image2
Ramya Krishnan: లవ్‌ లో ఫెయిల్యూర్‌ అయిన వాళ్ల కోసం పార్టనర్‌ని సెట్‌ చేస్తున్న రమ్యకృష్ణ.. క్రేజీ షో
Recommended image3
Vijay-Samantha: ఆయన ధైర్యం నాకు స్ఫూర్తి.. సీఎం విజయ్‌పై సమంత ఎమోషనల్ కామెంట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved