MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Vijay-Samantha: ఆయన ధైర్యం నాకు స్ఫూర్తి.. సీఎం విజయ్‌పై సమంత ఎమోషనల్ కామెంట్‌

Vijay-Samantha: ఆయన ధైర్యం నాకు స్ఫూర్తి.. సీఎం విజయ్‌పై సమంత ఎమోషనల్ కామెంట్‌

Vijay-Samantha: తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్‌ను కలిసిన నటి సమంత, ఆయనపై ప్రశంసలు కురిపించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన ధైర్యాన్ని మెచ్చుకుంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.   

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 18 2026, 05:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సీఎం విజయ్‌ని కలిసిన సమంత
Image Credit : Asianet News

సీఎం విజయ్‌ని కలిసిన సమంత

నటి సమంత రూత్ ప్రభు బుధవారం తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్‌ను కలిశారు. ఈ భేటీ తర్వాత, సమంత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక భావోద్వేగ పోస్ట్ పెట్టారు. విజయ్ ఒక కొత్త రంగంలోకి అడుగుపెట్టడాన్ని ఆమె ప్రశంసించారు. ఆయన ప్రయాణం చాలా మందికి నిజమైన స్ఫూర్తి అని పేర్కొన్నారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
 విజయ్‌పై సమంత ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌
Image Credit : instagram

విజయ్‌పై సమంత ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌

 సమంత చెబుతూ, `ఈరోజు చెన్నైకి వచ్చినప్పుడు నాలో ఒక పెద్ద సంతోషం. మన ముఖ్యమంత్రిని కలవబోతున్నానని అనుకున్నాను. విజయ్ సార్ కేవలం తెరపైనే హీరోగా ఉండాల్సిన వ్యక్తి కాదని నాకు ఎప్పుడూ అనిపించేది. ఆయన ఎనర్జీ, ఆయన ఉనికి, ప్రజలు ఆయనపై చూపే ప్రేమ.. ఇవన్నీ చూస్తుంటే, ఆయన ఇంతకంటే పెద్ద విషయాల కోసం పుట్టారని అనిపించేది. ఒక కొత్త రంగంలోకి దిగడానికి ఆయన చూపిన ధైర్యమే నాకు పెద్ద ఇన్స్పిరేషన్. బాగా తెలిసిన ఒక రంగాన్ని వదిలి, సవాళ్లు ఎక్కువగా ఉండే చోటికి రావడం సాధారణ విషయం కాదు. అది సులభం కాదు, కానీ తన వల్ల ఒక మార్పు తీసుకురాగలననే నమ్మకంతో ఆయన ఈ పని చేశారు` అని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు.

34
 విజయ్‌ అందరిని సర్‌ప్రైజ్‌ చేస్తారు
Image Credit : instagram

విజయ్‌ అందరిని సర్‌ప్రైజ్‌ చేస్తారు

సమంత ఇంకా చెబుతూ, `మనందరికీ జీవితంలో ఒక దశలో, మనకోసం మాత్రమే కాకుండా ఇతరులకు కూడా ఏదైనా చేయాలనే ప్రేరణ వస్తుంది. కానీ, కొద్దిమంది మాత్రమే ఆ పిలుపుకు స్పందిస్తారు. విజయ్ సార్, తనను నమ్మిన వాళ్లనే ఆశ్చర్యపరుస్తారని నాకు అనిపిస్తోంది. ఆయన పదవిలో ఉన్నందువల్ల కాదు, ఆయన ఆ పదవిని చూసే విధానం కోసం చెబుతున్నాను. ఆయనకు  మానసిక బలం , జ్ఞానం, ఈ మార్గంలో ప్రయాణించడానికి ధైర్యం కలగాలని కోరుకుంటున్నాను. ఇది చూసే ప్రతి యువతకు ఒక రిమైండర్. మీరు మొదలుపెట్టిన జర్నీ కంటే జీవితం చాలా పెద్దది` అని సమంత చెప్పింది. ఈ సందర్భంగా  విజయ్‌తో దిగిన ఫోటోలను పంచుకుంది సమంత. ఆమె `మా ఇంటి బంగారం` మూవీతో ఈ శుక్రవారం ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.

44
సీఎంగా చరిత్ర సృష్టించిన దళపతి విజయ్‌
Image Credit : Asianet News

సీఎంగా చరిత్ర సృష్టించిన దళపతి విజయ్‌

తమిళనాడులో దశాబ్దాలుగా ఉన్న డీఎంకే, ఏఐఏడీఎంకే ఆధిపత్యానికి ముగింపు పలుకుతూ, మే 10న ఒక కొత్త రాజకీయ శకం మొదలైంది. ఆ రోజే, నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన సి. జోసెఫ్ విజయ్, రాష్ట్ర 13వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది 'నిజమైన, లౌకిక, సామాజిక న్యాయంతో కూడిన కొత్త శకం' అని ఆయన తన ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తమిళ సినిమా
టీవీకే విజయ్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
AK 47 Teaser Review: ఫ్యామిలీ ఇమేజ్‌ని పక్కన పెట్టిన వెంకటేష్‌, ఎందుకంటే?.. ఆదర్శ కుటుంబ టీజర్‌ ఎలా ఉందంటే?
Recommended image2
Tollywood Senior Heroes: దసరా నుంచి సంక్రాంతి వరకు, క్యూ కట్టిన సీనియర్ హీరోలు..300 కోట్లు కొట్టే బొమ్మ ఏది ?
Recommended image3
Panchanama Review: ఉదయభాను నిర్మించిన 'పంచనామా' సిరీస్ రివ్యూ.. ఒక్క క్లూతో కూపీ మొత్తం లాగిన పోలీస్
Related Stories
Recommended image1
Samantha Top 5 Disasters: సమంత టాప్‌ 5 డిజాస్టర్లు, సామ్‌ని కోలుకోలేని దెబ్బకొట్టిన చిత్రాలివే.. తప్పు చేసిందా?
Recommended image2
Chiru-RGV: చిరంజీవితో సినిమా చేయకపోవడంపై వర్మ బోల్డ్ స్టేట్‌మెంట్‌.. నాకు ఆ సత్తా లేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved