టాలీవుడ్ కు జాతీయ అవార్డుల పంట, బాలయ్య, బలగం తో పాటు ఎవరు గెలుచుకున్నారు?
ఈసారి నేషనల్ అవార్డుల్లో టాలీవుడ్ దుమ్మురేపింది. పెద్ద సినిమాలే కాదు చిన్న సినిమాలు కూడా తమ సత్తా చూపించగలవు అని టాలీవుడ్ నిరూపించింది. ఈసారి జాతీయ అవార్డుల్లో తెలుగు నుంచి చిన్న సినిమాలు కూడా బలం చూపించాయి.

జాతీయ అవార్డుల్లో టాలీవుడ్ హవా
71st National Film Awards: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించే 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల జాబితాను అధికారికంగా విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 22 భాషల్లోని 115 సినిమాలను పరిశీలించిన జ్యూరీ సభ్యులు ఉత్తమ చిత్రాలకు, కళాకారులకు అవార్డులు ప్రకటించారు. ఈ అవార్డుల్లో తెలుగు సినిమాలకు అవార్డుల పంట పండింది. మొత్తంగా టాలీవుడ్ గెలుచుకున్న అవార్డులు ఎన్నంటే?
KNOW
బెస్ట్ తెలుగు ఫిల్మ్ గా భగవంత్ కేసరి
ఉత్తమ తెలుగు చిత్రంగా నందమూరి బాలకృష్ణ నటించిన "భగవంత్ కేసరి" ఎంపికైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2023లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలిచింది. ఇందులో తెలంగాణ యాసలో బాలకృష్ణ నటనకు ఫ్యాన్స్ ఊర్రూతలూగిపోయారు. శ్రీలీల ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమా కథ, కథనాలతో ఆకట్టుకుంది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఈ సినిమాకు జాతీయ అవార్డు రావడంతో మూవీ టీయ్ ఆనందం వ్యక్తం చేసింది.
అదరగొట్టిన హనుమాన్ మూవీ
రెండు జాతీయ అవార్డులు గెలుచుకుంది హనుమాన్ మూవీ. బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ కేటగిరీలో "హనుమాన్" సినిమాకు అవార్డు లభించింది. బాలనటుడిగా కెరీర్ స్టార్ట్ చేసి, హీరోగా మారిన తేజ సజ్జ నటించిన ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్‌కు నందు, పృథ్వి స్టంట్ కొరియోగ్రాఫర్లుగా పనిచేసారు. దీనితో పాటు బెస్ట్ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ లో కూడా హనుమాన్ సినిమా జాతీయ అవార్డును సాధించింది.
జాతీయ అవార్డుల్లో బలం చూపించిన బలగం సినిమా
చిన్న సినిమాగా విడుదలై సంచలనంగా మారింది"బలగం" మూవీ. జబర్ధస్త్ కమెడియన్ వేణు డైరెక్ట్ చేసిన ఈసినిమాలో టైటిల్ సాంగ్ కు జాతీయ అవార్డు లభించింది. ఈ చిత్రంలోని "ఊరుపల్లెటూరు" పాటకుగాను కాసర్ల శ్యామ్ ఉత్తమ గీత రచయితగా నేషనల్ అవార్డుకు ఎంపికయ్యారు. అంతే కాదు దిల్ రాజు నిర్మించిన ఈసినిమా అంతర్జాతీయ స్థాయిలో 100 అవార్డ్ లకు పైగా సాధించింది.
Congratulations national award winner @LyricsShyam anna💐💐
Congratulations to all winners 💐💐💐 #nationalawardspic.twitter.com/t8EJ88PY2O— Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) August 1, 2025
బేబీ సినిమాకు రెండు నేషనల్ అవార్డ్స్
ఇక చిన్న సినిమాగా రిలీజ్ అయిన "బేబీ" రెండు జాతీయ అవార్డులను గెలుచుకుంది. ఈ సినిమాకుగాను డైరెక్టర్ నీలం సాయిరాజేష్ ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా జాతీయ అవార్డు కు ఎంపికయ్యారు. అలాగే ఈ సినిమాలోని "ప్రేమిస్తున్నా" పాటను అద్భుతంగా ఆలపించినందుకు పీవీఎన్ఎస్ రోహిత్ ఉత్తమ గాయకుడిగా అవార్డు గెలుచుకున్నారు. ఈ అవార్డులు రావడంపై వారు స్పందించారు.
డైరెక్టర్ సుకుమార్ కూతురికి జాతీయ అవార్డు
ఇక పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా ఇంత వరకూ సుకుమార్ సాధించలేని పని, ఆయన కూతురు సుకృతి వేణి సాధించింది. "గాంధీ తాత చెట్టు" అనే చిత్రంలో ామె ప్రదర్శించిన నటనకు ఉత్తమ బాలనటిగా జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. చిన్న వయసులో తన నైపుణ్యంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమెకు ఈ గౌరవం దక్కింది. ఈ ఏడాది జాతీయ అవార్డుల్లో తెలుగు సినీ పరిశ్రమ అనేక విభాగాల్లో ప్రదర్శించిన ప్రతిభకు గుర్తింపు దక్కింది.