చాలా సినిమాలు రిజెక్ట్ చేసిన సాయి పల్లవిని... రిజెక్ట్ చేసిన స్టార్ హీరో...?
ఇండస్ట్రీలో హీరోయిన్ల అందరిలో సాయి పల్లవి డిఫరెంట్.. స్టార్ హీరోలకు కూడా షాక్ ఇస్తుంటుంది బ్యూటీ. కథ నచ్చితేనే సినిమా చేస్తుంది. లేకుంటే.. ఎంత పెద్ద హీరో అయినా రిజెక్ట్ చేస్తుంది. అయితే అటువంటి సాయి పల్లవికి కూడా ఓ స్టార్ హీరో షాక్ ఇచ్చాడట.

సాయి పల్లవి గురించి .. ఇండస్ట్రీలో అందరికి తెలుసు.. ఆమె ఎంత స్ట్రిక్ట్ హీరోయిన్ అన్నది ఆడియన్స్ కు కూడా తెలుసు. స్కిన్ షో ఉండదు.. అసభ్యానికి ప్లేస్ ఉండదు.. హీరో డామినేషన్ ను ఒప్పుకోదు.. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కరెక్ట్ గా ఉంటేనే సినిమా చేస్తుంది. అంతే కాని హీరోయిన్ ను గ్లామర్ పార్ట్ కే పరిమితం చేసే సినిమాలు ఆమె చేయదు. అందుకే సాయి పల్లవిని ఒక రకంగా పంతులమ్మ అంటుంటారు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్లు అంటే ఎలాంటి ఉద్దేశ్యం ఉందంటే.. ముద్దు ముద్దుగా ముద్దులు పెడుతూ ..హగ్గులు చేసుకుంటూ.. అందాలు ఆరబోయాలి.. అనే అభిప్రాయం కొంత మంది వల్ల క్రియేట్ అయ్యింది. కాని అందుకు భిన్నంగా స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సాధించింది సాయి పల్లవి. అందుకే ఆమెకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
సాయి పల్లవి రొమాంటిక్ సీన్స్ లో నటించదు.. రొమాంటిక్ డైలాగ్స్ చెప్పదు.. వల్గర్ సీన్స్ ఉంటే ఆ సినిమానే రిజెక్ట్ చేసి పడేస్తుంది . చాలామంది స్టార్ హీరోల సినిమాలను అమ్మడు కోట్లు రెమ్యూనరేషన్ ఇస్తామనిచెప్పిన రిజెక్ట్ చేసిన విషయం తెలిసిందే . రీసెంట్గా సాయి పల్లవి కి సంబంధించిన ఒక వార్త నెట్టింట బాగా వైరల్ గా మారింది .
ఈ వార్త వింటే అందరితో పాటు మీరు కూడా ఆశ్చర్య పోతారు. విషయం ఏంటంటే..? అందరి హీరోలను రిజెక్ట్ చేసే సాయి పల్లవి ని తెలుగు హీరో రిజెక్ట్ చేశాడట. అంవును ఆ హీరో కూడా మరెవరో కాదు.. విజయ్ దేవరకొండ.. అవును రౌడీ హీరో విజయ్ దేవరకొండ సాయి పల్లవి తో సినిమాను రిజెక్ట్ చేసాడట .
ఇంతకీ ఆ సినిమా ఏదో తెలుసా.. త్వరలో రిలీజ్ కాబోతున్న ఫ్యామిలీ స్టార్ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ కంటే ముందుగా సాయి పల్లవిని అనుకున్నారట . ఈ పాత్రకు సాయి పల్లవి బాగా సూట్ అవుతుంది. అంతా ఒకే అనుకున్న టైమ్ కు .. సాయి పల్లవి ఆ పాత్రకి వద్దు అంటూ విజయ్ నో చెప్పారట. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త మాత్రమే.. అందులో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉ:ది.
అయితే సాయి పల్లవిని తీసుకోకపోవడానికి కారణంఇదే అంటూ.. నెట్టింట మరో న్యూస్ వైరల్ అవుతోంది. ఎంత ఫ్యామిలీ పాత్ర అయినా సరే అరా కొరా రొమాన్స్ లేకపోతే ఆ పాత్ర పండదు . అలాంటి సీన్స్ కూడా ఆమె చేయను అంటుంది. అడిగి నో అనిపించుకోవడం కంటే మనమే రిజెక్ట్ చేయడం బెటర్ అంటూ విజయ్ దేవరకొండ సాయి పల్లవి ని వద్దు అన్నారట.
విజయ్ చెప్పిన పాయింట్ నచ్చడంతో.. ఫ్యామిలీ స్టార్ మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దాంతో ఆ పాత్రలోకి మృణాల్ ఠాకూర్ వచ్చింది. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతోంది.