- Home
- Entertainment
- దుబాయ్ లో టాలీవుడ్ నిర్మాత మృతి, అల్లు అర్జున్ కి అతడు ఫ్రెండ్.. ఈ విషాదం ఎలా జరిగిందంటే
దుబాయ్ లో టాలీవుడ్ నిర్మాత మృతి, అల్లు అర్జున్ కి అతడు ఫ్రెండ్.. ఈ విషాదం ఎలా జరిగిందంటే
దుబాయ్ లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. టాలీవుడ్ నిర్మాత కేదార్ సెలగంశెట్టి మృతి చెందారు. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా కేదార్ గంగం గణేశా అనే చిత్రాన్ని నిర్మించారు.

Kedar Selagamsetty
దుబాయ్ లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. టాలీవుడ్ నిర్మాత కేదార్ సెలగంశెట్టి మృతి చెందారు. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా కేదార్ గంగం గణేశా అనే చిత్రాన్ని నిర్మించారు. మరికొన్ని చిత్రాలకు కూడా ఆయన ప్లాన్ చేస్తున్నారు. అయితే దుబాయ్ లో ఆయన ఆకస్మికంగా మరణించడం సంచలనంగా మారింది.
Kedar Selagamsetty
కేదార్ మృతికి స్పష్టమైన కారణాలు తెలియడం లేదు. కానీ డ్రగ్స్ వల్లే అయి ఉండొచ్చు అంటూ వార్తలు వస్తున్నాయి. గతంలో కేదార్ రాడిసన్ హోటల్ లో డ్రగ్స్ పార్టీలో దొరికారు. కేదార్ మరణ వార్తని దుబాయ్ అధికారులు ధృవీకరించారు. టాలీవుడ్ లో కేదార్ కి చాలా మంది సన్నిహితులు ఉన్నారు. వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు.
Kedar Selagamsetty
అల్లు అర్జున్ ప్రోత్సాహంతోనే కేదార్ నిర్మాతగా మారినట్లు తెలుస్తోంది. బన్నీ వాసు, విజయ్ దేవరకొండతో కూడా కేదార్ కి పరిచయాలు ఉన్నాయి. గంగం గణేశా చిత్రంతో పాటు ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్ పై కేదార్ కొన్ని చిత్రాలని నిర్మించారు. సుకుమార్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో కేదార్ ఒక చిత్రాన్ని ప్లాన్ చేశారు. కానీ ఆది కార్యరూపం దాల్చకముందే అతడు మరణించారు. కేదార్ మరణ వార్తతో అతడి సన్నిహితులు, స్నేహితులు విషాదంలో ఉన్నారు.