రేట్లు పెంచేసిన టాలీవుడ్ హీరోలు.. రెమ్యూనరేషన్ విషయంలో బాలీవుడ్ హీరోలకే షాక్ ఇస్తున్నారు.
రెమ్యూనరేషన్ లో బాలీవుడ్(Bollywood) ను కూడా మించిపోయారు మన టాలీవుడ్ హీరోలు. పాన్ ఇండియా పాట పాడుతున్న తెలుగు స్టార్ హీరోలు.. అంతే రేంజ్ లో భారీ పారితోషికాలు కూడా అందుకుంటున్నారు. మరి మన హీరోలు అందుకుంటున్న ప్రస్తుత రెమ్యూనరేషన్ ఎంత..?
బాహుబలి(Bahubali) ఏమంటా రిలీజ్ అయ్యిందో మన టాలీవుడ్ రేంజే మారిపోయింది. మన హీరోలంతా.. పాన్ ఇండియా జపం చేయడం.. టాలీవుడ్ సినిమాల పాపులారిటీ భారీగా పెరిగింది. దాంతో మన కథలు.. మన హీరోలకు దేశప్యాప్తంగా డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు మన టాలీవుడ్ ను చిన్న చూపు చూసిన బాలీవుడ్, కోలీవుడ్ లాంటి ఇండస్ట్రీలే.. మనకు జీ హుజూర్ అనే పరిస్థితి ఇప్పుడు. దాంతో మన హీరోల స్థాయి కూడా పెరిగిపోయింది. దాంతో పాటు వారి రెమ్యూనరేషన్లు కూడా రెట్టింపు అయ్యాయి.
టాలీవుడ్ లోనే కాదు దేశ వ్యాప్తంగా ఇఫ్పుడు భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas). పాన్ ఇండియా సినిమాలతో యూనివర్సల్ ఇమేజ్ సాధించిన ప్రభాస్ 100 కోట్ల క్లబ్ లోకి ఎప్పుడో జాయిన్ అయ్యాడు. ఇఫ్పుడు అది కూడా దాటుకుని 150 కోట్లకు చేరాడు. సాహ(Saho) సినిమా నుంచే ఒక్కొ సినిమాకు 100 కోట్ల వరకూ తీసుకుంటూ వస్తున్నారట ప్రభాస్. ఇక రీసెంట్ గా నాగ్ అశ్విన్ మూవీతో పాటు సందీప్ వంగాతో చేయబోతున్న స్పిరిట్ మూవీకి దాదాపు 150 కోట్లు తీసుకోబోతున్నట్టు సమాచారం.
టాలీవుడ్ లో స్టార్ హీరోల రెమ్యూనరేషన్స్ ఇంతకు ముందలా లేవు. ఇంతకు ముందు పది నుంచి 20 కోట్లు తీసుకుంటే చాలా ఎక్కువెక్కువ. కాని స్టార్ హీరో ఇమేజ్ ఉన్న టాలీవుడ్ హీరో రెమ్యూనరేషన్ ఇప్పుడు 40 కోట్లు పైనే.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్(Mahesh Babu) క్రేజ్ తెలియంది కాదు. ఈ స్టార్ హీరో సరిలేరు నీకెవ్వరు సినిమా నుంచి 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. వీటితో పాటు సినిమా లో భాగస్వామి కూడా అవుతున్నాడు. ఇక రీసెంట్ గా ఆ రేటు 70 కోట్ల వరకూ పెరిగిందని సమాచారం. పరశురామ్ డైరెక్షన్ లో మైత్రీ మేకర్స్ నిర్మిస్తున్న సర్కారువారి పాట సినిమాకు 70 కోట్ల పైనే అందుకుంటున్నారట మహేష్. దాంతో పాటు తన ప్రతీససినిమాలో నిర్మాణ భాగస్వామిగా ఉంటున్నారు సూపర్ స్టార్.
ఇక టాలీవుడ్ లో భారీ పారితోషకాల లిస్ట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కూడా ఉన్నారు. వకీల్ సాబ్ తో రీ ఎంట్రీ ఇచ్చిన వెంటనే రెమ్యూనరేషన్ లో 50 కోట్లకు పెంచాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ విషచంలో కిన్ని విమర్షలు కూడా ఫేస్ చేశారు. వకీల్ సాబ్ తో పాటు వరుస సినిమాలు ప్రకటించిన పవర్ స్టార్.. ప్రస్తుతం చేస్తున్న సినిమాలకు 60 కోట్లకు పైనే పారితోషికాన్ని అందుకుంటున్నారట. హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న భవదీయుడు భగత్ సింగ్ సినిమా వరకూ వచ్చేసరికి అది 70 కోట్లు అయ్యిందంటున్నారు సినీ జనాలు.
ఇక టాలీవుడ్ సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) స్థాయి వేరు. ఏజ్ పెరుగుతున్నా కొద్ద మెగాస్టార్ క్రేజ్ కూడా పెరుగుతుంది. కుర్ర హీరోలతో పోటీ పడుతూ వరుసగా నాలుగైదు సినిమాలు అనౌన్స్ చేశారు మెగాస్టార్. అయితే 2017 లో ఆయన రీ ఎంట్రీ తరువాత జోష్ తో పాటు.. రెమ్యూనరేషన్ కూడా పెంచేశాడట. మెగాస్టార్ ప్రస్తుతం సినిమాలకు 50 కోట్ల వరకూ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. వాటితో పాటు సినిమాకు సంబంధించిన కొన్ని ఏరియల్ రైట్స్ కూడా తీసుకుంటున్నారట మెగాస్టార్.
ఇక మెగా ఫ్యామిలీ నుంచే స్టార్ హీరోగా ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan) కూడా రెమ్యూనరేషన్ విషయంలో పరుగులు పెడుతున్నారు. ట్రిపుల్ ఆర్ పుణ్యమా అని చరణ్ తో పాటు ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ కూడా భారీగా పెరిగినట్టు తెలుస్తుంది. రామ్ చరణ్(Ram charan) హీరోగా నిర్మాతగా సక్సెస్ ఫుల్ కెరీర్ ను రన్ చేస్తన్నారు. మొన్నటి వరకూ 35 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ తీసుకున్న చరణ్(Ram charan).. ఇప్పుడు నలబై కోట్లకు పైనే డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. వాటితో పాటు సినిమాకు సబంధించిన ఏరియల్ రైట్స్ తో కలుపుకుని అది 60 కోట్లకుపైనే అవుతుంది. ప్రస్తుతం శంకర్ తో మరో పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు చరణ్ ఇది హిట్ అయినే చరణ్ 100 కోట్ల క్లబ్ లో చేరినా ఆశ్చర్య పడక్కర్లేదు.
ఇక మరో ట్రిపుల్ ఆర్(RRR) హీరో ఎన్టీఆర్ కూడా తగ్గేదే లే అంటున్నారు. ఎన్టీఆర్(NTR) కూడా మొన్నటి వరకూ 30 నుంచి 35 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారు. అది కాస్తా ఇప్పుడు 45 కోట్లకు చేరిందట. ట్రిపుల్ ఆర్ హిట్ అయితే ఎన్టీఆర్ కూడా 70 కోట్ల వరకూ డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఎప్పుడూ సేఫ్ జోన్ లో ఉండటానికి ప్రయత్నం చేసే తారక్.. ట్రిపుల్ ఆర్(RRR) తరువాత కొరటాల తో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ తో ఎన్టీఆర్ కూడా పాన్ ఇడియా కాంపిటేషన్ లో జాయిన్ అయ్యే అవకాశాలు లేకపోలేదు.
అటు పుష్ప పార్ట్ 1 సక్సెస్ తో ఫుల్ జోష్ మీద ఉన్నాడు అల్లు అర్జున్(Allu Arjun). తగ్గేదే లే అంటున్నాడు. సుకుమార్(Sukumar) డైరెక్షన్ లో తెరకెక్కిన పుష్ప(Pushpa) మూవీ పాన్ ఇడియా రేంజ్ లో దడదడలాడించే సరికి.. బన్నీ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక మలయాళంలో బన్నీ క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప మూవీ ఓవర్ ఆల్ గా 300 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. దాంతో బన్నీ మార్కెట్ పెరిగింది. ఇప్పుడు రెమ్యూనరేషన్ కూడా భారీగానే పెరుగుతుందని టాక్. పుష్ప(Pushpa) రెండు సినిమాలకు కలిసి బన్నీకి 80 కోట్ల వరకూ ముట్టే అవకాశం ఉంది. ఇక సెకండ్ పార్ట్ కూడా హిట్ పడితే.. అల్లు అర్జున్(Allu Arjun) ను ఆపడం ఎవరి తరం కాదు. అసలే పాన్ ఇండియాను దృస్టిలో పెట్టుకుని దూసుకుపోతున్నాడు బన్నీ. నెక్ట్స్ ఇయర్ వరకూ 100 కోట్ల హీరో అయిపోయినా.. ఆశ్చర్యం అవసరం లేదు.