ప్రైవేట్ జెట్, కోట్ల ఆస్తి.. టాలీవుడ్ హీరోయిన్ సంపాదన తెలిస్తే ఫ్యూజుల్ ఔట్
`కూలీ` మూవీతో ఒక్కసారిగా సౌత్ ఇండస్ట్రీని షేక్ చేసింది రచితా రామ్. తెలుగులో `సూపర్ మచ్చి` చిత్రంలో నటించిన ఈ అమ్మడి ఆస్తులు చిట్టా తెలిస్తే మాత్రం ఫ్యూజులు ఎగిపోవాల్సిందే. ఏకంగా ప్రైవేట్ జెట్ కూడా ఉందట.

`కూలీ` మూవీతో పాపులర్ అయిన రచితా రామ్
కన్నడలో 'అదృష్ట దేవత' అని పిలువబడే నటి రచితా రామ్, ఇప్పుడు కన్నడనాట అత్యంత సక్సెస్‌ఫుల్, రిచ్ హీరోయిన్. 2013లో 'బుల్ బుల్' చిత్రంతో నటిగా వెండితెరకు పరిచయమైన ఈ సొట్టబుగ్గల సుందరి, ఇప్పుడు కోట్లాది రూపాయల ఆస్తికి యజమానురాలు. ఇటీవల `కూలీ` సినిమాలో నెగటివ్ రోల్‌లో రచ్చ చేసిన ఈ అమ్మడి ఆస్తులు వివరాలు బయటకు వచ్చాయి. అందరిని షాక్‌కి గురి చేస్తున్నాయి.

కోట్లలో పారితోషికం.. రచితా రామ్ మొత్తం ఆస్తి విలువ
ఇటీవల ప్రైవేట్ జెట్‌లో ప్రయాణిస్తున్న రచితా రామ్ వీడియో వైరల్ అయింది. ఆమె గ్యారేజీలో ఖరీదైన లగ్జరీ కార్ల కలెక్షన్ కూడా ఉంది. ఆమె లైఫ్ స్టయిల్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. మీడియా కథనాల ప్రకారం, రచితా రామ్ మొత్తం ఆస్తి విలువ వందల కోట్లు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 3 నుండి 8 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నారు.
టీవీ షోలు, బ్రాండ్ ప్రమోషన్లతోనూ రచితాకు భారీ ఆదాయం!
రచితా రామ్ సినిమాలతో పాటు, టీవీ రియాలిటీ షోలకు జడ్జిగా, ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రాండ్ ప్రమోషన్ల ద్వారా కూడా లక్షల్లో, కోట్లలో సంపాదిస్తున్నారు. ఇలా విభిన్న మార్గాల్లో ఆమె ఆదాయాన్ని పొందుతుంది.
స్టార్ హీరోలతో సూపర్ హిట్స్
రచితా రామ్ తెలుగులో `సూపర్ మచ్చి` అనే చిత్రంలో కన్నడలో పాపులర్ అయ్యింది. శివన్న, పునీత్, సుదీప్, దర్శన్ వంటి స్టార్ హీరోలతో నటించి 'రన్న', 'భర్జరి', 'క్రాంతి' వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చారు. పదేళ్లకుపైగా ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది. ఆమె హీరోయిన్‌గానే కాదు విలక్షణ నటిగానూ రాణిస్తోంది.
రచితా రామ్ పెళ్లి ఎప్పుడు?
తన పెళ్లి గురించి అడిగినప్పుడు, "మంచి అబ్బాయి దొరికినప్పుడు, కాలం కలిసి వస్తుంది. నా కెరీర్‌కు, కుటుంబానికి సపోర్ట్ చేసే భాగస్వామి దొరికితే పెళ్లి చేసుకుంటాను" అని చెప్పారు. ఇదిలా ఉంటే రచితా రామ్ తెలుగులో నటించిన `సూపర్ మచ్చి` మూవీలో కళ్యాణ్ దేవ్ హీరో. ఆయన చిరంజీవి చిన్న కూతురు శ్రీజకి మాజీ భర్త అనే విషయం తెలిసిందే.

