MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Karthika Deepam 2 Today Episode: దీపను దారుణంగా అవమానించిన జ్యో- దీప, CEO పోటీ నుంచి తప్పుకుంటుందా?

Karthika Deepam 2 Today Episode: దీపను దారుణంగా అవమానించిన జ్యో- దీప, CEO పోటీ నుంచి తప్పుకుంటుందా?

Karthika Deepam 2 Today Episode (మే 21వ తేదీ)లో దీపకు సంతకం పెట్టొచ్చా అని అవమానించిన జ్యో. దీప, జ్యోలకు ఎదెరుదురుగా క్యాబిన్స్. దీప ముందు ల్యాప్ టాప్ పెట్టిన మేనేజర్. బిత్తరపోయిన దీప. ఎగతాళి చేసిన జ్యో. ఈ రోజు ఎపిసోడ్ లో ఇంకా ఏం జరిగిందంటే.. 

3 Min read
Author : Kavitha G
Published : May 21 2026, 08:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ గురువారం ఎపిసోడ్‌లో అందరిముందు అగ్రిమెంట్‌పై సంతకం చేస్తుంది జ్యోత్స్న. ఆ తర్వాత దీపను చేయమంటే.. అసలు తనకు సంతకం చేయొచ్చా అని ఎగతాళి చేస్తుంది జ్యోత్స్న. కార్తీక్ కోపంగా దీప 5వ తరగతి వరకు చదువుకుందని చెప్తాడు. ఏదో ఎంబీబీఎస్ చదివినట్లు గొప్పగా చెప్తావేంటి బావ అని వెటకారంగా అంటుంది జ్యోత్స్న. 

చాలామంది కష్టపడితే నువ్వు ఈజీగా చదువుకున్నావు. కానీ దీప పరిస్థితి అలా కాదు. తను కష్టపడి చదువుకుంది. తండ్రి తన కోసం పడుతున్న కష్టం చూసి, తనకిష్టమైన చదువును వదిలేసింది. తన ఐదో తరగతి, నీ పీజీతో సమానం అని చెప్తాడు కార్తీక్. ఆ తర్వాత దీప... కె. దీప అని సంతకం పెడుతుంది. కె అంటే ఏంటి అని జ్యో అడిగితే కార్తీక్.. అదే నా చిరునామా అని గర్వంగా చెప్తుంది దీప.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
గెలిచే ఛాన్స్ ఎక్కువ
Image Credit : Jiohotstar

గెలిచే ఛాన్స్ ఎక్కువ

ఆ తర్వాత జ్యోత్స్న, దీపకు ఎదురెదురుగా క్యాబిన్స్ ఏర్పాటు చేస్తారు. ఫైల్ చూసి తనకు పంజాగుట్టా బ్రాంచ్ ఇచ్చారని చెబుతుంది జ్యోత్స్న. నీకు ఏ బ్రాంచ్ ఇచ్చారని దీపను అడుగుతాడు కార్తీక్. ఇదంతా ఇంగ్లీష్‌లో ఉంది బావ అంటుంది దీప. గట్టిగా నవ్వుతుంది జ్యోత్స్న. ఆ ఫైల్ కార్తీక్ చూసి మైత్రివనం బ్రాంచ్ ఇచ్చారు. ఇక్కడ పోటీ గట్టిగానే ఉంటుంది. గెలిచే ఛాన్స్ కూడా ఉందని చెప్తాడు కార్తీక్.

Related Articles

Related image1
Karthika Deepam 2 Today Episode: దీపపై కాంచన ఫైర్- శివన్నారాయణ ఎమోషనల్- కార్తీక్ ప్లాన్- జ్యోకు షాక్
Related image2
Karthika Deepam 2 Today Episode: కాంచన, దీప సూపర్ హ్యాపీ- జ్యోపై పారు ఫైర్- సూరజ్ పై జ్యో రివేంజ్
36
పారు, శ్రీధర్ వాదన
Image Credit : Jiohotstar

పారు, శ్రీధర్ వాదన

మరోవైపు శివన్నారాయణ ఇంట్లో శౌర్య, కాంచన ఆడుకుంటూ ఉంటారు. నువ్వు నానమ్మ కళ్లు మూయి తాతయ్య, నేను దాక్కుంటాను అని చెప్తుంది శౌర్య. శ్రీధర్ కాంచన కళ్లు మూసేందుకు వెళ్లి ఆగిపోతాడు. అదంతా చూసిన పారిజాతం, పిల్లలను అడ్డం పెట్టుకొని బంధాలను బాగానే కలుపుకుంటున్నావ్ అల్లుడు అంటుంది. శ్రీధర్ కూడా పారుపై గట్టిగానే సెటైర్లు వేస్తాడు. మీరు ఇద్దరూ ఆపితే బాగుంటందని కాంచన అనడంతో వాదనకు ఫుల్ స్టాప్ పెడతారు పారు, శ్రీధర్.

46
దీపకు సైట్ కొట్టిన కార్తీక్
Image Credit : Jiohotstar

దీపకు సైట్ కొట్టిన కార్తీక్

కార్తీక్‌ కి ఫైల్ ఇచ్చి చదవమంటుంది జ్యోత్స్న. ఫైల్ అడ్డుగా పెట్టుకొని దీపకు సైట్ కొడుతుంటాడు కార్తీక్. అదంతా చూసి చిరాకు పడుతుంది జ్యోత్స్న. కార్తీక్ ని పిలిచి ఏం చేస్తున్నావ్ బావ అని అడుగుతుంది. మా ఆవిడకు సైట్ కొడుతున్నాను. నిజానికి నా భార్యతో నేను ఈరోజే ప్రేమలో పడ్డాను అని చెప్తాడు కార్తీక్. నువ్వు ఆఫీసుకు వచ్చింది సైట్ కొట్టడానికి కాదు. ఇక్కడి నుంచి వెళ్లి తాత గదిలో కూర్చో అని చెప్తుంది జ్యోత్స్న. క్యాంటిన్ కి రమ్మని దీపకు హింట్ ఇచ్చి వెళ్లిపోతాడు కార్తీక్.

56
దీప వార్నింగ్
Image Credit : Jiohotstar

దీప వార్నింగ్

ఆ తర్వాత దీప క్యాంటిన్ కి వెళ్తుంది. తీసుకోండి మేడం అని కాఫీ కప్ చేతికి ఇస్తాడు కార్తీక్. మేడం ఏంటి బావ అంటుంది దీప. నీ సొంత కంపెనీకి కాబోయే సీఈఓ మీరు అంటాడు కార్తీక్. నీ భార్యకు మించిన అధికారం మరొకటి లేదని అంటుంది దీప. డైలాగ్స్ బాగా చెప్తావు దీప అనుకుంటూ వస్తుంది జ్యోత్స్న. సీఈఓగా గెలవడం అంత ఈజీ కాదు అంటుంది. నీ గెలుపు నీకోసం. నా గెలుపు కుటుంబం కోసం. నా కుటుంబం జోలికి వస్తే ఊరుకుంటానా అని జ్యోత్స్నకు చిన్న వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది దీప. ఫస్ట్ డే కదా అని వదిలేశాను. నేను ఫోకస్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.

66
దీపకు అవమానం
Image Credit : Jiohotstar

దీపకు అవమానం

దీప దగ్గరకు ల్యాప్ టాప్ తీసుకొస్తాడు మేనేజర్ వంశీ. రెస్టారెంట్ వివరాలు, ఫైల్స్ అన్ని అందులో ఉంటాయని, మెయిల్ ఐడీతో లాగిన్ కావాలని చెప్తాడు. ల్యాప్‌టాప్‌లో వర్క్ అనేసరికి బిత్తరపోతుంది దీప. మెయిల్ ఐడీతో లాగిన్ అవ్వండి మేడం అని మళ్లీ చెప్తాడు వంశీ. తన దగ్గర ఓటర్ ఐడీ మాత్రమే ఉందని చెప్తుంది దీప. జ్యోత్స్న గట్టిగా నవ్వుతూ.. స్టాఫ్ ని పిలిచి చూశారా తనకు మెయిల్ ఐడీ గురించి కూడా తెలియదు అంటూ చులకనగా మాట్లాడుతుంది.

మేనేజర్ వంశీని పిలిచి.. ఎవరి దగ్గర ఏం చెప్పాలో తెలుసుకో వంశీ. తనని వంటల గురించి అడుగు బాగా చెప్తుంది. ల్యాప్‌ టాప్ ముందు పెట్టి లాగిన్ కావాలి అంటే కంగారుపడిపోదా పాపం అని దీప గురించి ఎగతాళిగా మాట్లాడుతుంది జ్యోత్స్న. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: ఈ బిగ్ బాస్ హౌస్ లో ఎవరి వయసు ఎంత? ఏజ్ లో చిన్న ఎవరు?
Recommended image2
Vishwanath & Sons: రూ.250 కోట్ల సినిమా ఓటీటీలోకి..చాలా ఏళ్ళ తర్వాత సూర్య నుంచి వచ్చిన కంప్లీట్ ఫ్యామిలీ మూవీ
Recommended image3
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు సెలబ్రిటీల సొంత ఊరు ఏదో తెలుసా?
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: దీపపై కాంచన ఫైర్- శివన్నారాయణ ఎమోషనల్- కార్తీక్ ప్లాన్- జ్యోకు షాక్
Recommended image2
Karthika Deepam 2 Today Episode: కాంచన, దీప సూపర్ హ్యాపీ- జ్యోపై పారు ఫైర్- సూరజ్ పై జ్యో రివేంజ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved