మెగా ఫ్యామిలీలో ఉపాసనకు కూడా దక్కని గౌరవం లావణ్య త్రిపాఠి సాధించిందా..?
ఈమధ్యే మెగా కోడలిగా అడుపెట్టింది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. అయితే అంతకు ముందు ఆఫ్యామిలీలో అడుగు పెట్టిన ఉపాసనకు కూడా దక్కని ఓ లక్ లావణ్యకు దక్కిందట. ఆ విపయంలో లావణ్య ఏమంటుందంటే..?
Lavanya Tripathi
టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. లావణ్య త్రిపాఠి తన మూవీ కెరీర్ లో స్కిన్ షోకు పెద్దగా ప్రాధానం ఇవ్వలేదు. పద్దతిగల పాత్రలు చేసింది.ముఖ్యంగా మెగా హీరో వరుణ్ తేజ్ ను తన యాటీట్యూడ్ తో పడేసింది. నటన పరంగా సత్తాచాటిన లావణ్య.. మెగా కోడలిగా అడుగు పెట్టింది.
పెళ్లి తరువాత ఆమె నటిస్తుందా లేదా అన్న అనుమానం పటాపంచలు చేస్తూ.. మెగా కోడలు అయ్యాక కూడా నటిస్తానని అంటోంది. అన్నట్టుగా సినిమాలు, వెబ్ సిరీస్ లలో మంచి పాత్రలను ఎంచుకుంటూ లావణ్య త్రిపాఠి ప్రశంసలు అందుకుంటున్నారు. అంతే కాదు మెగా ఫ్యామిలీలోకి వెళ్ళిన తరువాత ఆమెరెమ్యునరేషన్ కూడా పెరిగిందనిటాక్.
ఇక హీరోయిన్ అవ్వడం వల్లో ఏమో.. మెగా ఫ్యామిలీలో పెద్ద కోడలిగా ఉపాసనకు ఉన్న క్రేజ్ నుమించి లావణ్య త్రిపాఠి క్రేజ్ ను సాధించినట్టు తెలుస్తోంది. రామ్ చరణ్ భార్యగా, అపోలో అధిపతిగాఉపాసన అందరికి సుపరిచితం. అంతే కాదు ఆమె మంచితనం, క్రేజ్ గురించి అంతా తెలుసు.. కాని మెగా ఫ్యాన్స్ లో ఉపాసన కంటే లావణ్య బాగా దగ్గరయినట్టు సమాచారం.
అయితే లావణ్య త్రిపాఠిని మెగా అభిమానులు ప్రేమగా వదిన అని పిలుస్తున్నారట. మెగా ఫ్యాన్స్ వదినమ్మ అని పిలవడంతో ఆమె కూడా ఈ విషయం తెలిసి హ్యాపీ పీల్ అయ్యిందట. అయితే వాళ్లు వదినా అని పిలవడం పై తాజాగా స్పందించి లావణ్య త్రిపాఠి. మెగా ఫ్యాన్స్ అలా పిలవడం సో స్వీట్ అని ఆమె చెప్పుకొచ్చారు. తన ఫ్యామిలీలో మాత్రం నిహారిక మాత్రమే నన్ను వదిన అని పిలుస్తారని ఆమె తెలిపారు.
ఇక ప్రస్తుతం పద్దతిగా ఉండే కొన్ని ప్రాజెక్ట్ లు సెలక్ట్ చేసుకుని మరీ సినిమాలు చేస్తోంది లావణ్య. ఆమె తాజాగా నటించిన మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. లావణ్య త్రిపాఠి రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లతో ముందుకు వచ్చే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది.
Varun Tej
మెగా ఫ్యామిలీ గురించి లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ మెగా కుటుంబంలోని ప్రతి ఒక్కరూ నాతో ఎంతో ప్రేమగా వ్యవహరిస్తారని అన్నారు. ఆ కుటుంబానికి చెందిన అభిమానుల ప్రేమను సైతం పొందుతున్నానని ఆమె కామెంట్లు చేశారు. లావణ్య సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు.
లావణ్య ప్రతి వస్తువు క్లీన్ అండ్ పర్ఫెక్ట్ గా ఉండాలని భావించే యువతిగా మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ లో కనిపించారు. లవ్ అండ్ కామెడీగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కగా బిగ్ బాస్ అభిజిత్ ఈ వెబ్ సిరీస్ లో కీలక పాత్ర పోషించారు. లావణ్య త్రిపాఠి నటిస్తున్న వెబ్ సిరీస్ లు ఆమె రేంజ్ ను మరింత పెంచుతున్నాయి. మెగా ఫ్యామిలీ సినిమాలలో లావణ్య త్రిపాఠి నటించాలని అభిమానులు ఫీలవుతున్నారు.