MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • NBK: బాలకృష్ణ వీక్‌నెస్ తెలిసిపోయింది.. అందుకే డైరెక్టర్లు ఆ పనిచేస్తున్నారా? ఇండస్ట్రీలో సరికొత్త చర్చ..

NBK: బాలకృష్ణ వీక్‌నెస్ తెలిసిపోయింది.. అందుకే డైరెక్టర్లు ఆ పనిచేస్తున్నారా? ఇండస్ట్రీలో సరికొత్త చర్చ..

బాలకృష్ణ కథ నచ్చితే, డైరెక్టర్లు నచ్చితే సినిమాలు చేసేస్తారు. తనకు కావాల్సిన అంశాలుంటే చాలు డైరెక్టర్‌ ఎవరనేది కూడా చూడరు, వెంటనే ఓకే చెప్పేస్తారు. కానీ బాలయ్యలోని మరో వీక్‌నెస్‌ని కనిపెట్టారు డైరెక్టర్స్. ఆయనతో వరుసగా సినిమా ఆఫర్లు కొట్టేస్తున్నారు.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Aug 16 2022, 10:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బాలకృష్ణ(Balakrishna)తో సినిమా చేయడం ఇప్పుడు ఈజీ అయిపోయిందా? ఆయన్ని ఓ సినిమాకి ఓకే చెప్పించడం ఎలానో దర్శకులకు తెలిసిపోయిందా? ఆయనతో సినిమా చేయాలంటే ఏం చేయాలో డైరెక్టర్స్ పట్టేశారా? బాలయ్య వీక్‌నెస్‌ కనిపెట్టారా? అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇదే ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని(Gopichand Malineni) దర్శకత్వంలో `ఎన్బీకే107` (NBK107) చిత్రంలో నటిస్తున్నారు. శృతి హాసన్‌ కథానాయికగా నటిస్తున్న చిత్రమిది. మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సాగే చిత్రమిది. బాలయ్య ఇందులో సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోందీ సినిమా. ఇదిలా ఉంటే బాలయ్యతో గోపీచంద్‌ మలినేనికిదే మొదటిసారి. ఆ ఛాన్స్ `క్రాక్‌` కారణంగా వచ్చింది. 

37

రవితేజ(Raviteja)తో కలిసి గోపీచంద్‌ మలినేని రూపొందించిన `క్రాక్‌`(Krack) సినిమా మంచి విజయం సాధించింది. అందులోని మాస్‌ ఎలిమెంట్లు హైలైట్‌ అయ్యాయి. సినిమా హిట్‌ టాక్‌ వచ్చాక బాలయ్యకి ప్రత్యేకంగా షో వేసి చూపించారు దర్శక, నిర్మాతలు. సినిమా చూసిన బాలయ్య(NBK) ఇంప్రెస్‌ అయ్యారు. సినిమాపై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు గోపీచంద్‌ డైరెక్షన్‌ నచ్చి వెంటనే కమిట్‌మెంట్ ఇచ్చారు. ఆయనతో సినిమా చేస్తానని కథ రెడీ చేసుకోమని చెప్పారు. దీంతో బాలయ్య కోసం గోపీచంద్‌ మలినేని మంచి మాస్‌ స్టోరీని ప్రిపేర్‌ చేయడం, ఆయనకు నచ్చి వెంటనే ఓకే చేయడంతో `ఎన్బీకే 107` పట్టాలెక్కింది. 

47

నెక్ట్స్ బాలయ్య చేయబోతున్న సినిమా NBK108 విషయంలోనూ అదే జరిగింది. అనిల్‌ రావిపూడి(Anil Ravipudi) రూపొందించిన `సరిలేరు నీకెవ్వరు`, ఇటీవల చేసిన `ఎఫ్‌3` సినిమాలు చూశారు బాలకృష్ణ. ఆయా చిత్రాల్లోనూ అనిల్‌ రావిపూడి ఫన్‌ నచ్చింది. `సరిలేరు నీకెవ్వరు`లోని కమర్షియల్‌ అంశాలకు బాలయ్య ఫిదా అయ్యారు. దీంతో వెంటనే ఆయనతో సినిమా చేసేందుకు కమిట్‌మెంట్‌ ఇచ్చారు. అదే తరహాలో మంచి కథతో బాలయ్యని ఇంప్రెస్‌ చేశారు అనిల్‌ రావిపూడి. ఇప్పటి వరకు తాను తీయనటువంటి పూర్తి యాక్షన్‌ సినిమాని తీయబోతున్నారు. ఇటీవలే ఈ సినిమాని అఫీషియల్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. 
 

57

ఇప్పుడు మరో డైరెక్టర్‌కి కమిట్‌ మెంట్‌ ఇచ్చారు బాలయ్య. ఇటీవల తనయుడు కళ్యాణ్‌ రామ్‌(Kalyan Ram) హీరోగా నటించిన `బింబిసార`(Bimbisara) సినిమాని చూశారు బాలకృష్ణ. కొత్త దర్శకుడు వశిష్ట(Vashist) దీనికి దర్శకత్వం వహించారు. నందమూరి ఫ్యామిలీతో చాలా కాలంగా ట్రావెల్‌ అవుతున్న వశిష్ట కళ్యాణ్‌ రామ్‌తో చేసిన `బింబిసార` భారీ విజయాన్ని సాధించింది. థియేటర్‌కి జనం రావడం లేదనే బాధ పడుతున్న సమయంలో బూస్ట్ నిచ్చింది. కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. 

67

ఈ సినిమాని బాలయ్య కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. సినిమా చూసిన నందమూరి నటసింహం కళ్యాణ్‌ రామ్‌ నటనకు, దర్శకుడు వశిష్ట టేకింగ్‌కి ఫిదా అయ్యారు. సినిమా అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపించారు. అంతేకాదు త్వరలో కలిసి మనం సినిమా చేద్దామంటూ దర్శకుడు హామీ ఇచ్చారు. సరిగ్గా గోపీచంద్‌ మలినేని, అనిల్‌ రావిపూడిలకు కూడా ఇదే తరహాలోనే ఆఫర్లు వచ్చాయి. ఇప్పుడు వశిష్టకి కూడా బాలయ్యతో సినిమా ఆఫర్‌ కన్ఫమ్‌ అయినట్టే అని అంటున్నారు నెటిజన్లు. 
 

77

ఇదే ఇప్పుడు చర్చగా మారింది. బాలకృష్ణతో సినిమా చేయాలంటే ప్రత్యేకంగా ఆయన చుట్టూ తిరిగాల్సిన పనిలేదని, ఓ హిట్‌ సినిమా తీసి ఆయనకు ప్రత్యేక షోస్‌ వేస్తే ఛాన్స్ పక్కా అని ఫిక్స్ అయిపోతున్నారు. బాలయ్య వీక్‌నెస్‌ తెలుసుకున్న డైరెక్టర్లు ఇప్పుడు ఇదే స్ట్రాటజీని ఫాలో అయ్యే పనిలో బిజీగా ఉన్నారట. కానీ సినిమా తీసి హిట్‌ కొట్టడం, బాలయ్యకి నచ్చేలా మాస్‌ ఎలిమెంట్లు ఉండేలా చూసుకోవడమనేది అందరికి సాధ్యం కావడం కష్టమనే చెప్పాలి. అదే సమయంలో ఏదో ఒకరికి ఇద్దరి విషయంలో అలా జరిగిందని, అందరికి అలానే జరగాలని లేదు. టాలెంట్‌తోనే ఏదైనా సాధ్యం. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
100 కోట్ల క్లబ్‌లో సూర్య ఆరో సినిమా.. లిస్టులో ఇంకా ఏ మూవీస్ ఉన్నాయంటే?
Recommended image2
60 ఏళ్లలోనూ 20ల ఎలా? సల్మాన్ ఖాన్ ఇంత ఫిట్‌గా ఉండటానికి.. ఆఒక్కటి అస్సలు తినడని తెలుసా?
Recommended image3
Karthika Deepam 2 Today Episode: దీపపై కాంచన ఫైర్- శివన్నారాయణ ఎమోషనల్- కార్తీక్ ప్లాన్- జ్యోకు షాక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved