టాలీవుడ్ స్టార్ కమెడియన్ ఇంట తీవ్ర విషాదం, గుండెపోటుతో కన్నుమూసిన జోష్ రవి తండ్రి
Josh Ravi Father Passes Away : టాలీవుడ్ స్టార్ కమెడియన్ జోష్ రవి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి అకస్మాత్తుగా మరణించడంతో రవి కుటుంబం షాక్ కు గురయ్యింది.

కమెడియన్ జోష్ రవి తండ్రి కన్నుమూత
టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ప్రముఖ కమెడియన్ జోష్ రవి తండ్రి సూర్య వెంకట నరసింహ శర్మ (68) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన ఆకస్మిక మరణంతో రవి కుటుంబం షాక్ కు గురయ్యింది. ఈ సంఘటనపై సినీ వర్గాలు సంతాపం వ్యక్తం చేస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలోని మార్టేరు గ్రామంలో నివాసముంటున్న సూర్య వెంకట నరసింహ శర్మకు స్థానికంగా మంచి వ్యక్తిగా పేరుపొందారు. ఆయనకు జోష్ రవి ఒక్కగానొక్క కుమారుడు.
సూర్య వెంకట నరసింహ శర్మకు గుండెపోటు
స్థానిక సమాచారం ప్రకారం, కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా సూర్య వెంకట నరసింహ శర్మ శివాలయానికి అభిషేకాలకు వెళ్లారు. అక్కడే ఆయన అకస్మాత్తుగా అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లగా.. అప్పటికే గుండెపోటు కారణంగా మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ వార్త తెలిసిన వెంటనే మార్టేరు గ్రామం అంతా విషాద ఛాయలు అలముకున్నాయి.
టాలీవుడ్‌లో స్టార్ కమెడియన్ గా రవి
జోష్ రవి టాలీవుడ్‌లో స్టార్ కమెడియన్ గా ఎదిగారు. జబర్థస్త్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రవి.. తన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్, ఎక్స్ ప్రెషన్స్ తో ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు. వరుస అవకాశాలతో మంచి గుర్తింపు పొందాడు రవి. తండ్రి మరణవార్త తెలిసిన రవి తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. ఈ దుర్ఘటన నేపథ్యంలో సినీ పరిశ్రమ నుంచి పలువురు నటీనటులు, దర్శకులు, కళాకారులు వ్యక్తిగతంగా రవి ఇంటికి వెళ్లి పరామర్శించారు. అనేకమంది సోషల్ మీడియాలో సంతాప సందేశాలు పోస్టు చేస్తూ రవి కుటుంబానికి ధైర్యం చెప్పారు.సూర్య వెంకట నరసింహ శర్మకు గ్రామంలో మంచి పేరుంది. సమాజ సేవకుడిగా, ఆదర్శవంతుడిగా పేరుపొందిన వ్యక్తి కావడంతో మార్టేరు గ్రామ ప్రజలు ఆయన మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.