MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • కృష్ణ, ఎన్టీఆర్ నుంచి రాంచరణ్, రవితేజ వరకు.. క్రేజీ హీరోలు ప్రాణం పెట్టి నటించిన అత్యుత్తమ దేశభక్తి చిత్రాలు

కృష్ణ, ఎన్టీఆర్ నుంచి రాంచరణ్, రవితేజ వరకు.. క్రేజీ హీరోలు ప్రాణం పెట్టి నటించిన అత్యుత్తమ దేశభక్తి చిత్రాలు

Best Patriotic movies: టాలీవుడ్ లో రూపొందిన అత్యుత్తమ దేశభక్తి సినిమాల జాబితా ఈ కథనంలో ఉంది. అల్లూరి సీతారామరాజు నుంచి ఆర్ఆర్ఆర్ వరకు ఉత్తమ దేశభక్తి సినిమాల గురించి ఈ కథనంలో తెలుసుకోండి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jan 26 2026, 12:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Best patriotic movies
Image Credit : Asianet News

Best patriotic movies

రిపబ్లిక్ డే రోజున దేశభక్తి చిత్రాలు చూడాలనుకునే ప్రేక్షకులకు ఈ సినిమాలు బెస్ట్ ఛాయిస్ అనే చెప్పాలి. స్వర్గీయ ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ నుంచి ఈతరం హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ వరకు చాలా మంది దేశభక్తి చిత్రాల్లో నటించారు. టాలీవుడ్ లో వచ్చిన ఉత్తమ దేశభక్తి సినిమాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
అల్లూరి సీతారామరాజు (1974)
Image Credit : our own

అల్లూరి సీతారామరాజు (1974)

సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో మైలురాయిలా నిలిచింది అల్లూరి సీతారామరాజు. బ్రిటిష్ వారి వెన్నులో వణుకు పుట్టించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. అల్లూరి పాత్రలో కృష్ణ పెర్ఫార్మెన్స్ గురించి రాబోవు తరాల ప్రేక్షకులు కూడా చెప్పుకుంటూనే ఉంటారు. ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఈ మూవీ అనేక అవార్డ్స్, రివార్డ్స్ సొంతం చేసుకుంది. వి. రామచంద్రరావు అల్లూరి సీతారామరాజు చిత్రానికి దర్శకత్వం వహించారు. 

39
బొబ్బిలి పులి (1982)
Image Credit : madhura takies

బొబ్బిలి పులి (1982)

ఎన్టీఆర్ తన పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులకు అందించిన దేశభక్తి చిత్రం బొబ్బిలి పులి. దర్శకరత్న దాసరి నారాయణరావు తెరకెక్కించిన ఈ మూవీలో ఎన్టీఆర్ ఆర్మీ మేజర్ రోల్ చేశాడు. సమాజంలో చీడపురుగులా తయారైన దుర్మార్గులను అంతం మొందించేందుకు హంతకుడిగా మారిన మేజర్ గా ఎన్టీఆర్ కనిపించారు. శ్రీదేవి హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో ఎన్టీఆర్ కోర్ట్ రూమ్ సీన్ సినిమాకే హైలెట్. న్యాయవ్యవస్థలో ఉన్న లోపాలను సైతం ఎత్తిచూపారు. 

49
నా దేశం(1982)
Image Credit : Sr NTR

నా దేశం(1982)

స్టార్ హీరోగా ఎన్టీఆర్ వెలిగిపోతున్న రోజుల్లో దర్శకుడు బాపయ్య తెరకెక్కించిన చిత్రం నా దేశం. ఈ మూవీలో ఎన్టీఆర్ అనాథగా కనిపిస్తారు. జయసుధ హీరోయిన్. అప్పటి సమాజంలో ఉన్న రాజకీయ, సామాజిక లోపాలను ఈ సినిమాలో ఎండగట్టారు. 

59
నేటి భారతం( 1983)
Image Credit : our own

నేటి భారతం( 1983)

లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, సుమన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు టి. కృష్ణ తెరకెక్కించిన నేటి భారతం టాలీవుడ్ లో తెరకెక్కిన దేశభక్తి చిత్రాల్లో ఒకటి. ఈ చిత్రంలో విజయశాంతి నటన అద్భుతంగా ఉంటుంది. విజయశాంతి లేడి సూపర్ స్టార్ గా ఎదగడంలో దర్శకుడు టి కృష్ణ కీలక పాత్ర వహించారు. 

69
భారతీయుడు (1996)
Image Credit : our own

భారతీయుడు (1996)

లంచగొండితనం, అవినీతిపై దర్శకుడు శంకర్ ఎక్కుపెట్టిన బాణాలలో భారతీయుడు చిత్రం ఒకటి. వృద్ధుడిగా కమల్ నటన ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. మనీషా కొయిరాలా, ఊర్మిళ హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీ దేశవ్యాప్తంగా భారీ విజయం సాధించింది. తెలుగులో ఇది డబ్బింగ్ చిత్రం అయినప్పటికీ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కమల్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేశారు. 

79
ఖడ్గం(2002)
Image Credit : prime video

ఖడ్గం(2002)

విలక్షణ చిత్రాల దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కించిన గొప్ప దేశభక్తి చిత్రం ఖడ్గం. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే కాన్సెప్ట్ తో టెర్రరిజానికి వ్యతిరేకంగా ఖడ్గం తెరకెక్కింది. శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ కీలక రోల్స్ చేశారు. పేట్రియాటిక్ జోనర్ లో ఖడ్గం బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. ఈ మూవీలో చిత్ర పరిశ్రమలో తెరవెనుక జరిగే చీకటి కథలని కూడా కృష్ణ వంశీ బయటపెట్టారు. 

89
సైరా (2019)
Image Credit : Facebook/Chiranjeevi konidela

సైరా (2019)

చిరంజీవి హీరోగా తెరకెక్కిన భారీ పాన్ ఇండియా చిత్రం సైరా. తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేశారు. సిపాయిల తిరుగుబాటు కంటే ముందే బ్రిటీష్ పాలనపై వ్యతిరేకంగా కత్తిదూసిన వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. తమన్నా, నయనతార హీరోయిన్స్ గా నటించారు. 

99
ఆర్ ఆర్ ఆర్ (2022)
Image Credit : our own

ఆర్ ఆర్ ఆర్ (2022)

రాజమౌళి విజువల్ వండర్ ఆర్ ఆర్ ఆర్ టాలీవుడ్ ఉత్తమ దేశభక్తి చిత్రాల్లో ఒకటి. ఇద్దరు వీరులు భీమ్, రామ్ తమ లక్ష్య సాధన కోసం బ్రిటీష్ కోటలను ఎలా బద్దలు కొట్టారు. వారిపై ఎలా విజయం సాధించారనేది వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. ఫిక్షనల్ కథగా తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ వరల్డ్ వైడ్ రూ. 1100 కోట్లు కొల్లగొట్టింది. హీరోలుగా నటించిన ఎన్టీఆర్, రామ్ చరణ్ గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
నందమూరి తారక రామారావు
కృష్ణ ఘట్టమనేని
రామ్ చరణ్ కొణిదెల
 

Latest Videos
Recommended Stories
Recommended image1
The Paradise Review: నాని జాతకం మారబోతోందా? స్టార్ హీరోల లిస్ట్ లో చేరినట్టేనా? ది పారడైజ్ మూవీ ఫస్ట్ రివ్యూ..
Recommended image2
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image3
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Related Stories
Recommended image1
OTT Movies: 1000 కోట్ల పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ఓటీటీలోకి, శ్రీకాంత్ కొడుకు రోషన్ మూవీ కూడా.. ఈ వారం పండగే
Recommended image2
రాంచరణ్ కోసం వీధుల్లో తిరిగింది, ఈ మూవీ కోసం అప్పు తీసుకుంది.. కూతురు సుస్మిత సీక్రెట్స్ బయటపెట్టిన చిరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved