- Home
- Entertainment
- Pranitha Subhash : ప్రణీతా సుభాష్ లేటెస్ట్ లుక్... అభిమానులు రిక్వెస్ట్ చేసి మరీ చెబుతున్నారు!
Pranitha Subhash : ప్రణీతా సుభాష్ లేటెస్ట్ లుక్... అభిమానులు రిక్వెస్ట్ చేసి మరీ చెబుతున్నారు!
తెలుగు ప్రేక్షకుల మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ ప్రణీతా సుభాష్... ఇప్పుడు సోషల్ మీడియాలో క్రేజ్ పెంచుకుంటోంది. వరుసగా పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటోంది.

యంగ్ అండ్ గ్లామరస్ హీరోయిన్ ప్రణీతా సుభాష్ (Pranitha Subhash) తెలుగు ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.
‘బావ’ చిత్రంతో క్రేజ్ దక్కించుకున్న ప్రణీతా సుభాష్ నటిగా ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగులోనే వరుసగా ఇక్కడ అవకాశాలు అందుకుంది.
ప్రణీతా సుభాష్ కన్నడ బ్యూటీ అయినప్పటికీ ఇక్కడ తన నటన, సినిమాలతో మంచి ఫాలోయింగ్ దక్కించుకుంది. అభిమానులను కూడా సంపాదించుకుంది.
ఇదిలా ఉంటే.. ప్రణీతా సుభాష్ వరుస ఫొటోషూట్లతో నెట్టింట ఆకట్టుకుంటోంది. ఎక్కువగా ఈ ముద్దుగుమ్మ ట్రెడిషనల్ లుక్ లో మెరుస్తూ ఉంటుంది.
ఆమెను ప్రజలు కూడా ఎక్కువగా సంప్రదాయ లుక్ లోనే చూడాలని ఆశిస్తుంటారు. ఈ క్రమంలో ప్రణీతా కూడా పట్టువస్త్రాల్లో పద్ధతిగా మెరుస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా అలాగే మెరిసింది.
పట్టుచీరలో బుట్టబొమ్మ వజ్రంలా మెరిసింది. చూడచక్కని బొమ్మలా అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా నిండుగా దర్శనమివ్వడం, ఆకర్షణీయమై న అభరణాలు ధరించడంతో ఫఇదా అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో ఫొటోలను వైరల్ చేస్తున్నారు. ఎప్పటికీ ఇలాగే కనిపించాలని రిక్వెస్ట్ చేసి మరీ చెబుతున్నారు.