- Home
- Entertainment
- రిలేషన్ షిప్ పై ఓపెన్ అయిన మృణాల్ ఠాకూర్.. ‘ఇద్దరు పిల్లల్ని కూడా కనాలని ఉంది’.. క్రేజీ హీరోయిన్ కామెంట్స్
రిలేషన్ షిప్ పై ఓపెన్ అయిన మృణాల్ ఠాకూర్.. ‘ఇద్దరు పిల్లల్ని కూడా కనాలని ఉంది’.. క్రేజీ హీరోయిన్ కామెంట్స్
స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) తాజాగా రిలేషన్ షిప్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు ఆమె మాటలు నెట్టింట హాట్ టాపిక్ గ్గా మారాయి.

మరాఠి ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదనే చెప్పాలి. ప్రస్తుతం తెలుగులోనే వరుసగా సినిమాలు చేస్తూ మన ఆడియెన్స్ ను అలరిస్తోంది. మరింతగా దగ్గరవుతూనే వస్తోంది.
‘సీతారామం’, ‘హాయ్ నాన్న’ వంటి చిత్రాలతో దక్షిణాదిలో సెన్సేషన్ గా మారింది. నెక్ట్స్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తో కలిసి ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star)తో అలరించబోతోంది.
ఫ్యామిలీ స్టార్ చిత్రం ఏప్రిల్ 5న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని దిల్ రాజ్ నిర్మించగా.. గోపీ సుందర్ సంగీతం అందించారు. పరుశు రామ్ పెట్ల దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
తన సినిమా రిలీజ్ కాబోతున్న సందర్బంగా మృణాల్ ఠాకూర్ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతోంది. రీసెంట్ గా ఓ ఛానెల్ లో మాట్లాడిన మృణాల్ తన రిలేషన్ షిప్, సెలబ్రెటీలు ఎదుర్కొనే సమస్యలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.
తను మాత్రం ఎవరితో రిలేషన్ షిప్ లో లేనని చెప్పింది. రిలేషన్ లో ఉన్న వారు మాత్రం ఆ ప్రేమను మరింత పెంచేందుకు ప్రయత్నించాలని సూచించింది. ఇద్దరూ నమ్మకంగా ఉండాలని, అప్పుడు ఆ బంధం బలపడుతుందని, నిలబడుతుందని కామెంట్స్ చేసింది.
అలాగే సెలబ్రెటీలుగా ఉండటం చాలా కష్టమని.. ఎప్పుడూ షూటింగ్స్ లో ఉండి కుటుంబీలకు దూరమవ్వాల్సి వస్తుందన్నారు. తనకూ నార్మల్ లైఫ్ గడపాలని ఉంటుందని, ఇద్దరు పిల్లల్ని కని వారితో కలిసి డిన్నర్ కి వెళ్తే ఎంత బాగుంటుందోనంటూ చెప్పుకొచ్చింది. ఇక తనకున్న పెద్ద భయం మరణమన్నారు.