Krithi Shetty : అక్కడ అలా, ఇక్కడ మరోలా... ప్రస్తుతానికి ఇలా సెట్ అయిన బేబమ్మ!
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కృతి శెట్టి (Krithi Shetty) బ్యూటీఫుల్ లుక్స్ తో మైమరిపిస్తోంది. వరుస పోస్టులతో ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చూపుతిప్పుకోకుండా చేసింది.
‘ఉప్పెన’ హీరోయిన్ కృతి శెట్టి Krithi Shetty బ్యూటీఫుల్ ఫొటోషూట్లతో అదరగొడుతోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో మెరుస్తూ ఆకట్టుకుంటోంది. నయా లుక్స్ తో మెస్మరైజ్ చేస్తోంది.
కృతి శెట్టి టాలీవుడ్ లో ‘ఉప్పెన’ తర్వాత సెన్సేషన్ గా మారిన విషయం తెలిసిందే. తొలిసినిమాతోనే రూ.100 కోట్లు సంపాదించిన తొలి హీరోయిన్ గా రికార్డు క్రియేట్ చేసింది.
ఆ తర్వాత నుంచి వరుస సినిమాలతో అలరిస్తూ వచ్చింది. టాలీవుడ్ (Tollywood) లోకి ఎంట్రీ ఇచ్చి ఇవ్వగానే హ్యాట్రిక్ హిట్ ను అందుకుని మరో ఆ జాబితాలో నిలిచింది. స్టార్ హీరోయిన్ గా మారింది.
కానీ తర్వాత వరుస డిజాస్టర్లు అందుకొని తెలుగులో సినిమాలకు నోచుకోవడం లేదు. ఈ క్రమంలో బేబమ్మ కోలీవుడ్ (Kollywood) లో మాత్రం ప్రస్తుతం సెన్సేషన్ గా మారింది.
ఈ క్రమంలో కృతి శెట్టి వరుసగా ఫొటోషూట్లు చేస్తోంది. సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. తాజాగా కలర్ ఫుల్ డ్రెస్ లో కనిపించి మెస్మరైజ్ చేసింది. కిర్రాక్ ఫోజులిస్తూ అదరగొట్టింది.
ఇలా కృతిశెట్టి తమిళ తంబీలను వరుస చిత్రాలతో అలరిస్తోంది.... ఇక్కడ ఫ్యాన్స్ ను మాత్రం సోషల్ మీడియా దర్శనంతో ఆకట్టుకుంటోంది. బేబమ్మ చేతిలో ప్రస్తుతం ‘శర్వా35’, ‘లవ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్’, Vaa Vaathiyaare, Genie సినిమాలు ఉన్నాయి.