హీరోయిన్లకు కెరీర్ లో ఒక్కసారైనా ఇలాంటి సినిమాలు పడాలి!

First Published 15, Sep 2019, 12:21 PM IST

హీరోయిన్లుగా రాణించాలని చాలా మంది నటీమణులు ఇండస్ట్రీకి వస్తారు. కానీ వారిలో పూర్తిస్థాయిలో సక్సెస్ అయ్యేది కొందరే. కమర్షియల్ చిత్రాలతో పాటు, నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో మెప్పిస్తే స్టార్ హీరోయిన్లుగా ఎదుగుతారు. అలా టాలీవుడ్ హీరోయిన్లు అద్భుతమైన నటనతో అవార్డులు గెలుచుకున్న హీరోయిన్లు, వారు నటించిన చిత్రాలు ఇవే!

విజయశాంతి: లేడి సూపర్ స్టార్ విజయశాంతి 1990లో విడుదలైన కర్తవ్యం చిత్రంతో దేశం మొత్తాన్ని తనవైపుకు తిప్పుకుంది. ఆ చిత్రానికి గాను విజయశాంతికి ఉత్తమనటిగా జాతీయ అవార్డు లభించింది. ఇక ఒసేయ్ రాములమ్మా, ప్రతి ఘటన లాంటి చిత్రాలకు ఉత్తమనటిగా నంది అవార్డు సొంతం చేసుకుంది.

సౌందర్య : దివంగత నటి సౌందర్య తన కెరీర్ లో పవిత్రబంధం, అమ్మోరు, అంతఃపురం చిత్రాలకు ఉత్తమ నటిగా నంది అవార్డు గెలుచుకుంది.

రమ్యకృష్ణ : రమ్యకృష్ణ సూపర్ స్టార్ రజినీకాంత్ కు పోటాపోటీగా నటించిన చిత్రం నరసింహా. ఈ చిత్రానికి గాను రమ్య కృష్ణ తమిళనాడులో అనేక అవార్డులు సొంతం చేసుకుంది. కంటే కూతుర్నే కను చిత్రానికి గాను తెలుగులో నంది అవార్డు గెలుచుకుంది. బాహుబలి చిత్రంలో శివగామి పాత్రకు పలు ఫిలిం ఫేర్ అవార్డులు లభించాయి.

శ్రీదేవి : ఆలిండియా లేడి సూపర్ స్టార్, దివంగత నటి శ్రీదేవి వెంకటేష్ సరసన నటించిన క్షణ క్షణం చిత్రానికి ఉత్తమ నటిగా నంది అవార్డు సొంతం చేసుకుంది. తమిళం, హిందీ చిత్రాల్లో కూడా శ్రీదేవికి పలు అవార్డులు దక్కాయి.

ఆమని : సీనియర్ హీరోయిన్ ఆమని మిస్టర్ పెళ్ళాం, శుభ సంకల్పం చిత్రాలకు ఉత్తమ నటిగా నంది అవార్డు సొంతం చేసుకుంది. ఇక ఆల్ టైం సూపర్ హిట్ శుభలగ్నం చిత్రానికి ఆమెకు ఫిలిం ఫేర్ అవార్డు లభించింది.

రోజా : సర్పయాగం, స్వర్ణక్క చిత్రాలకు రోజా నంది అవార్డు గెలుచుకుంది.

మీనా: నటి మీనా తన కెరీర్ ఆరంభంలోనే సీతారామయ్య గారి మనవరాలు చిత్రంతో నటిగా అద్భుతమైన గుర్తింపు సొంతం చేసుకుంది. ఆ చిత్రంలో మీనా ఏఎన్నార్ కు మానవరాలిగా నటించింది. ఈ చిత్రానికి గాను మీనాకు ఉత్తమనటిగా నంది అవార్డు లభించింది. రాజేశ్వరి కళ్యాణం అనే మరో చిత్రానికి కూడా మీనా నంది అవార్డు గెలుచుకుంది.

అనుష్క: అరుంధతి చిత్రానికి గాను అనుష్క నంది స్పెషల్ జ్యూరి అవార్డుని సొంతం చేసుకుంది. బాహుబలి, రుద్రమదేవి లాంటి చిత్రాలకు అనుష్కని అనేక ఫిలిం ఫేర్ అవార్డులు వరించాయి.

సమంత : సమంత తన కెరీర్ లో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. తన తెలుగు డెబ్యూ మూవీ ఏ మాయ చేసావే చిత్రంతోనే నంది స్పెషల్ జ్యూరీ అవార్డు సొంతం చేసుకుంది. ఇంకా మనం, అత్తారింటికి దారేది, అ..ఆ, రంగస్థలం చిత్రాలకు అనేక ఫిలిం ఫేర్ అవార్డులు లభించాయి.

నయనతార : నయనతార శ్రీరామ రాజ్యం చిత్రానికి గాను ఉత్తమ నటిగా నంది అవార్డు సొంతం చేసుకుంది.

కీర్తి సురేష్ : లేటెస్ట్ సెన్సేషన్ కీర్తి సురేష్ మహానటి చిత్రంతో ప్రశంసలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా అవార్డు లభించింది.

ప్రియమణి : ప్రియమణి 2006లో జాతీయ ఉత్తమ నటిగా పరుత్తివీరన్ అనే తమిళ చిత్రానికి అవార్డు సొంతం చేసుకుంది.

loader