- Home
- Entertainment
- మహేష్, రాంచరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ ఒకసారి దూకితే బాక్సాఫీస్ కి ముచ్చెమటలే.. 2023 సమ్మర్ బరిలో
మహేష్, రాంచరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ ఒకసారి దూకితే బాక్సాఫీస్ కి ముచ్చెమటలే.. 2023 సమ్మర్ బరిలో
సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, రెబల్ స్టార్ ప్రభాస్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నలుగురూ 2023 సమ్మర్ కి బరిలో దిగబోతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి.

ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కువగా పాన్ ఇండియా చిత్రాల హవా కొనసాగుతోంది. అలాంటి పాన్ ఇండియా చిత్రాలు ఒక్కసారిగా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తే ఎలా ఉంటుంది ? తెలుగు సినీ ప్రేక్షకులకు పండగే. అలాంటి సంకేతాలే ప్రస్తుతం కనిపిస్తున్నాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, రెబల్ స్టార్ ప్రభాస్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నలుగురూ 2023 సమ్మర్ కి బరిలో దిగబోతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. సమ్మర్ అంటే చిత్ర పరిశ్రమకు గోల్డెన్ పీరియడ్. స్కూల్స్, కాలేజీలకు సెలవులు ఉంటాయి కాబట్టి ఆ టైం లో విడుదలైన చిత్రాలకు కలెక్షన్స్ బావుంటాయి.
అందుకే నిర్మాతలు ఎక్కువగా కుదిరితే సంక్రాంతి లేదంటే సమ్మర్ అంటుంటారు. ఇదిలా ఉండగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న సలార్ చిత్రం 2023 సంక్రాంతి బెర్త్ ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా మూవీగా విడుదల కాబోతున్న ఈ చిత్రంపై కనీవినీ ఎరుగని అంచనాలు ఉన్నాయి. జనవరి కల్లా ప్రొడక్షన్ పూర్తయితే ఏప్రిల్ లేదా మేలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
మెగా పవర్ స్టార్ రాంచరణ్ దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం RC15(వర్కింగ్ టైటిల్). దాదాపు 300 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సోషల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శంకర్ కళ్ళు చెదిరే యాక్షన్ ఎపిసోడ్స్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
సమ్మర్ బరిలో నిలిచిన మరో చిత్రం త్రివిక్రమ్, మహేష్ బాబు మూవీ. ఈ చిత్రం త్రివిక్రమ్ స్టైల్ లో క్లాస్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఆగష్టు నుంచి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానున్నట్లు ఇటీవల ప్రకటించారు. వచ్చే ఏడాది సమ్మర్ కి రిలీజ్ చేయాలనేది ప్లాన్.
ఇక సమ్మర్ రేసులో నిలిచిన మరో చిత్రం ఎన్టీఆర్, కొరటాల మూవీ. ఆల్రెడీ ఈ చిత్రానికి అనౌన్సమెంట్ జరిగింది. స్క్రిప్ట్ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడంతో షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. ఎలాగైనా ఈ చిత్రాన్ని సమ్మర్ రేసులో నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నారు. అన్ని కుదిరితే ఈ నాలుగు చిత్రాలు వచ్చే ఏడాది సమ్మర్ కి సందడి చేయడం పక్కా. ఇదే కనుక జరిగితే బాక్సాఫీస్ వద్ద సునామి ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు.