Balakrishna Birthday: విలువలు కలిగిన హీరో బాలయ్య!
నందమూరి అందగాడు, నటసింహం బాలయ్య 62వ పుట్టినరోజు నేడు (Balakrishna Birthday). ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలయ్య అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. తమ అభిమాన హీరో పుట్టినరోజును ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు.

Balakrishna Birthday
ఎన్టీఆర్ (NTR) నటవారసుడిగా 14 ఏళ్లకే బాలకృష్ణ నటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. తండ్రి స్పూర్తితో పౌరాణిక, జానపద, సోషల్, కమర్షియల్... భిన్నమైన జోనర్స్ ట్రై చేశారు. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలు పోషించారు. వీటన్నింటికీ మించి బాలయ్య విలువలు కలిగిన హీరోగా పేరు తెచ్చుకున్నారు.
Balakrishna Birthday
టాలీవుడ్ టాప్ స్టార్ గా బాలయ్య దశాబ్దాలు పరిశ్రమలో ఉన్నారు. అనేక ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బస్టర్స్ నమోదు చేశారు. సాధారణంగా ఓ హిట్ పడితే నెక్స్ట్ మూవీకి హీరోలు రెమ్యూనరేషన్ రెట్టింపు చేస్తారు. బాలయ్య (Balakrishna)అలా కాదు, ఆయన నిర్మాతల హీరో. పారితోషికం విషయంలో ఆయన కఠినంగా ఉండరు. వందకు పైగా చిత్రాలు చేసిన బాలయ్య డబ్బుల కోసం నిర్మాతలను ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు.
Balakrishna Birthday
ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నా... ఓ కోటి రూపాయలు వచ్చే మార్గం ఉంటే ఎవరూ వదులుకోరు. ఓ మోస్తరు హీరోకి కూడా యాడ్స్ రూపంలో కోట్లు సంపాదించే ఆస్కారం ఉంటుంది. ఓ రోజు షూట్ లో పాల్గొని, రెండు డైలాగ్స్ చెప్పి యాడ్ పూర్తి చేసి, సంస్థల ఉత్పత్తులను ప్రమోట్ చేస్తే... కోట్ల రూపాయలు వచ్చిపడతాయి. కానీ బాలయ్య దీనికి విరుద్ధం. ఎన్ని కోట్లు ఇచ్చినా వ్యాపార ప్రకటనల్లో నటించరు. బ్రాండ్స్ కి ప్రచార కర్తగా ఉండరు. తాను నమ్మని విషయాన్ని ప్రచారం చేయరు. బాలయ్య ఇంత వరకు ఒక్క యాడ్ లో కూడా నటించలేదు.
Balakrishna Birthday
బాలకృష్ణకు ఉన్న మరో గొప్ప గుణం రిమేక్స్ చేయడానికి ఇష్టపడరు. కెరీర్ బిగినింగ్ లో బాలయ్య ఒకటి రెండు రీమేక్స్ చేశాడు. 2001లో విక్రమ్ సామి రీమేక్ లక్ష్మీ నరసింహ చిత్రం చేశారు. మరలా బాలయ్య రీమేక్స్ జోలికి వెళ్ళలేదు. ఒరిజినల్, స్ట్రెయిట్ చిత్రాలు మాత్రమే చేస్తారు.
Balakrishna Birthday
బాలయ్య సామాజికవేత్త కూడాను. తండ్రి ఎన్టీఆర్ క్యాన్సర్ రోగుల చికిత్స కోసం నిర్మించిన బసవతారకం ఆసుపత్రిని బాలకృష్ణ విజయవంతంగా నడుపుతున్నారు. ప్రతి ఏడాది వేల మంది పేద రోగులకు వైద్యం అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు అత్యాధునిక వైద్య సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఎవరు ఆర్థిక సాయం కోరినా కాదనకుండా చేస్తారు.
Balakrishna Birthday
బాలయ్య దర్శకుల హీరో కూడాను. ఒక్కసారి స్క్రిప్ట్ ఫైనల్ అయ్యాక... ప్రాజెక్ట్ లో ఆయన తలదూర్చరు. దర్శకుడిని నమ్మి చెప్పినట్లు చేసుకుంటూ పోతారు. ప్రతి సినిమాకు చాలా కష్టపడతారు. ఫలితం అంతా దైవాధీనం అంటారు. అలాగే చాలా తక్కువ సమయంలో షూటింగ్ పూర్తి చేసి, దర్శకులకు, నిర్మాతలకు మంచి చేస్తారు.
Balakrishna Birthday
ఒకవైపు సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్న బాలయ్య 2014లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. హిందూపురం నుండి 2014, 2019 ఎన్నికల్లో ఎంఎల్ఏ గా గెలిచారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ... మంచి నేతగా పేరు తెచ్చుకున్నారు.