- Home
- Entertainment
- చిరంజీవి చిత్రానికి టిల్లు నో చెప్పడానికి కారణం అదే.. సిద్ధూ జొన్నలగడ్డ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా
చిరంజీవి చిత్రానికి టిల్లు నో చెప్పడానికి కారణం అదే.. సిద్ధూ జొన్నలగడ్డ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సినీ అభిమానుల్లో టిల్లు ఫీవర్ నడుస్తోంది. టిల్లు స్క్వేర్ చిత్రం కలెక్షన్స్ లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం రెండు రోజుల్లోనే 25 కోట్ల వరకు షేర్ రాబట్టింది.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సినీ అభిమానుల్లో టిల్లు ఫీవర్ నడుస్తోంది. టిల్లు స్క్వేర్ చిత్రం కలెక్షన్స్ లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం రెండు రోజుల్లోనే 25 కోట్ల వరకు షేర్ రాబట్టింది. టిల్లు పాత్రలో సిద్ధూ చేసిన సందడికి అంతా ఫిదా అవుతున్నారు.
అనుపమ, సిద్ధూ జొన్నలగడ్డ మధ్య కెమిస్ట్రీ యువతని అలరిస్తోంది. దర్శకుడు కథని అనుపమ, సిద్దు మధ్య నడిపించిన విధానం థ్రిల్లింగ్ గా అనిపిస్తోంది. ప్రస్తుతం సిద్ధూ జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.
ఓ ఇంటర్వ్యూలో సిద్దు జొన్నలగడ్డ మెగాస్టార్ చిరంజీవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతంలో సిద్దు జొన్నలగడ్డకి చిరంజీవితో నటించే అవకాశం వచ్చింది. కానీ సిద్దు ఆ చిత్రాన్ని రిజెక్ట్ చేశాడు. తాజాగా ఇంటర్వ్యూలో సిద్దు దానిపై క్లారిటీ ఇచ్చారు. చిరంజీవి గారితో నేను ఒక చిత్రం చేయాల్సింది. కొన్ని కారణాల వాళ్ళ అది కుదర్లేదు. చిరంజీవి గారితో సినిమా అంటే జీవితానం గుర్తుండిపోయేలా ఉండాలని నా ఫీలింగ్. ఆయనతో చేస్తే ఎక్ట్రార్డినరీ చిత్రం చేయాలి అని ఆ చిత్రాన్ని అంగీకరించలేదని సిద్దు తెలిపాడు.
టాలీవుడ్ లో నా ఆల్ టైం ఫేవరిట్ హీరో విక్టరీ వెంకటేష్. నాపై ఆయన చిత్రాల ప్రభావం చాలా ఉంది అని టిల్లు హీరో తెలిపాడు. నాకు అమితాబ్, రజనీకాంత్ కూడా ఇష్టం. వీరితో పాటు చిరంజీవి, బాలకృష్ణ లతో కూడా సినిమా చేయాలనీ ఉంది. సరైన సందర్భం వచ్చినప్పుడు అది జరుగుతుంది అని సిద్ధూ తెలిపాడు.
చిరంజీవి గారిని కలిసినప్పుడు మేమిద్దరం నేను చేయకపోయిన చిత్రం గురించి మాట్లాడుకుంటాం. ఆయన ఒక సూపర్ హ్యూమన్ అని సిద్ధూ తెలిపాడు.టాలీవుడ్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది చిరంజీవి గారే అని ప్రశంసలు కురిపించాడు.
Chiranjeevi
చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్స్ నాకు నిజంగానే ఆకాశంలోని తారలతో సమానం. అలాంటి స్టార్స్ తో సినిమా అంటే నా కెరీర్ లోనే ది బెస్ట్ ప్రాజెక్ట్ అయి ఉండాలి అని టిల్లు హీరో తెలిపాడు. త్వరలో చిరంజీవి గారితో నటించే అవకాశం రావాలని కోరుకుంటున్నా అని సిద్ధూ జొన్నలగడ్డ తెలిపాడు.