- Home
- Entertainment
- నయనతార - విఘ్నేశ్ పెళ్లికి కట్టుదిట్టమైన భద్రత.. ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన శివన్..
నయనతార - విఘ్నేశ్ పెళ్లికి కట్టుదిట్టమైన భద్రత.. ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన శివన్..
కోలీవుడ్ స్టార్స్ నయనతార - విఘ్నేష్ శివన్ పెళ్లి పీటలు ఎక్కేందుకు సర్వం సిద్ధం అయ్యింది. వీరి వివాహా వేడుకకు చిత్ర పరిశ్రమ నుంచి స్టార్స్, ప్రముఖులు, అలాగే పొలిటిషన్స్ హాజరు కాబోతున్నారు. దీంతో వివాహా వేదిక వద్ద సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు.

లేడీ తలైవా నయనతార (Nayanthara), ఆమె ప్రియుడు, దర్శకుడు విఘ్నేష్ శివన్ (Vignesh Sivan) ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. కొన్నాళ్లుగా డేటింగ్ లో ఉన్న వీరిద్దరూ స్టార్ కపుల్ గా మారబోతున్నారు. గతంలోనే నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట నెల రోజులుగా వివాహా వేడుక పనుల్లో బిజీగా ఉన్నారు.
జూన్ 9న వీరి వివాహ వేడుక తమిళనాడులోని మహబలిపురంలో గల ఓ రిసార్ట్ లో ఘనంగా నిర్వహించనున్నారు. బంధువులు, సన్నిహితుల సమక్షంలో నయనతార - విఘ్నేష్ శివన్ ఒక్కటి కాబోతున్నారు. హిందూ సంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం జరగనుంది. ఈ సందర్బంగా పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లును పూర్తి ఇప్పటికే పూర్తి చేశారు.
అయితే, కోలీవుడ్ స్టార్స్ వివాహాం కావడంతో ఈ వేడుకకు చిత్ర పరిశ్రమకు సంబంధించి స్టార్స్, పొలిటిషన్స్ కూడా హాజరుకానున్నారు. ఇటీవల తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తో పాటు, స్టార్స్ కమల్‌హాసన్, రజినీ కాంత్, చిరంజీవి, అజిత్, విజయ్, సూర్య, కార్తీలతో సహా పలువురు సినీ ప్రముఖులు కూడా పెళ్ళికి హాజరుకానున్నట్టు తెలుస్తోంది.
దీంతో వివాహా వేదికైన రిసార్ట్ వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారని రిలేటీవ్స్ నుంచి అందిన సమాచారం. అలాగే అతిథులకు వివాహానికి ముందు ప్రత్యేక కోడ్‌ను అందజేస్తారని, కోడ్‌ను చూపిన తర్వాత వివాహ వేదికలోకి ప్రవేశించాలని తెలుస్తోంది. అదేవిధంగా పెళ్లికి సంబంధించిన డ్రెస్ కోడ్ కూడా నిర్దేశించారంట.
వివాహా వేదిక దగ్గర ఎలాంటి ఘర్షణ వాతావరణం గానీ, అతిథులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారని సమాచారం. అలాగే ఇప్పటికే వీరి వివాహా వేడకను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం చేయనున్నారనే టాక్ కూడా నడుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దర్శకుడు విఘ్నేష్ శివన్ ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్ కూడా చెప్పారు.
జూన్ 9న మధ్యాహ్నం పెళ్లికి సంబంధించిన ఫొటోలను అభిమానుల కోసం సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకుంటామని తెలిపారు. అలాగే రేపు (జూన్8)న గ్రాండ్ గా హల్దీ ఫంక్షన్ తోపాటు, సంగీత్ కూడా ఉండనుందన్నారు. జూన్ 11న నయనతార ఫ్యాన్స్ ను ప్రత్యేకంగా కలుస్తామని విఘ్నేశ్ వివన్ హామీనిచ్చారు. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ స్టార్ జంట ఒక్కటవుతుండటంతో సౌత్ ప్రేక్షకుల నుంచి బెస్ట్ విషెస్ అందుతున్నాయి.