‘గణపథ్’కి ప్రభాస్ ‘కల్కి’తో పోలికలు..షాక్ లో ఫ్యాన్స్
గణ్‍పథ్ సినిమా టీజర్ చూస్తుంటే.. ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ సినిమాకు కొన్ని పోలికలు ఉన్నట్టు అనిపిస్తోంది.

Ganapath vs Kalki 2898 AD
బాలీవుడ్ గణపథ్ తెలుగు వెర్షన్ టీజర్ ను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. టైగర్ ష్రాఫ్, అమితాబ్ బచ్చన్, కృతిసనన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం గణపథ్ టీజర్ ని తెలుగులోనూ రిలీజ్ చేసారు. ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ టీజర్ రిలీజైన తర్వాత అందరూ ఈ సినిమాని ప్రభాస్ తాజా చిత్రం కల్కి 2898 తో పోలుస్తున్నారు.
ఆ సినిమా టీజర్ చూసిన వారు ... కల్కి చిత్రానికి కాన్సెప్టు పరంగా దగ్గరగా గణపథ్ ఉందనిపిస్తోందంటున్నారు. యాభై సంవత్సరాల తర్వాత 2070 ADలో జరిగే కథగా గణపథ్ ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.
‘వార్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘గణపత్’ (Ganapath). వికాస్ బహ్లు దర్శకత్వం వహిస్తున్నారు. కృతి సనన్ కథనాయిక. గణేశ్ చతుర్థి సందర్భంగా ఈ చిత్రం నుంచి టైగర్ ష్రాఫ్ పవర్ ఫుల్ లుక్ లోని పోస్టర్ ను విడుదల చేశారు. ఈ చిత్రం హిందీతో పాటు సౌత్ లాంగ్వేజేస్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలోనూ విడుదల కానుంది.
కల్కి సినిమా 2898వ సంవత్సరంలో జరిగితే.. గణపథ్ సినిమా 2070లో జరిగే కథ గా రూపొందుతోంది. రెండు చిత్రాల టీజర్స్ కాన్సెప్ట్ కూడా ఒకేలా ఉన్నాయి. ఈ టీజర్ లో ప్రైవేట్ మిలటరీ డ్రెస్‍లు వేసుకున్న కొందరు ప్రజలను.. వేధిస్తుంటారు. వారిని రక్షించేందుకు వీరుడు వస్తాడని అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ ఉంది.
అప్పుడు గణపథ్ (టైగర్ ష్రాఫ్) ఇంట్రడక్షన్ ఉంది. ప్రజలను కాపాడే బాధ్యతను అతడు తీసుకుంటాడని తెలుస్తోంది. హీరోయన్ కృతి సనన్ కూడా యాక్షన్ అవతార్‌లో కనిపించారు. మొత్తంగా ఫ్యూచరస్టిక్ యాక్షన్ మూవీగా గణపథ్ ఉండనుందని టీజర్‌తో అర్థమవుతోంది. ఈ టైటిల్‍కు ఏ హీరో ఈజ్ బార్న్ అనే క్యాప్షన్ ఉంది. ఇవి రెండు చూసిన వారు ఈ రెండు సినిమాల కాన్సెప్ట్స్ ఒకేలా ఉన్నాయని అంటున్నారు.
‘కల్కి 2898 ఏడీ’తో ఈ గణపథ్ సినిమాకు కొన్ని పోలికలు ఉన్నాయి. ఈ రెండు చిత్రాలు ఫ్యుచరిస్టక్ థీమ్‍తో తెరకెక్కుతున్నాయి. కల్కి చిత్రంలో మహావిష్ణువు 10వ అవతారమైన కల్కిగా నటిస్తున్నారు ప్రభాస్. గణ్‍పథ్ చిత్రంలో వినాయకుడికి హీరో పాత్రకు సంబంధం ఉండేలా కనిపిస్తోంది. ఈ రెండు చిత్రాల్లోనూ అమితాబ్ బచ్చన్ దాదాపు ఒకేలాంటి పాత్ర చేస్తున్నట్టు అర్థమవుతోంది.
ప్రభాస్ ఫ్యాన్స్ కు ఈ విషయం కంగారుపెడుతున్నా... బడ్జెట్, క్యాస్టింగ్, క్వాలిటీ, విఎఫెక్స్ లాంటి విషయాల్లో కల్కితో దగ్గరగా వెళ్లడం కలలో కూడా జరిగే పని కాదు అంటున్నారు.
"ప్రియాతి ప్రియమైన టైగర్ ష్రాఫ్, కృతి సనన్, అన్నింటికి మించి నా గురువు అమితాబ్ బచ్చన్ నటించిన గణపథ్ చిత్రం టీజర్ పంచుకోవడం సంతోషం కలిగిస్తోంది. ఈ చిత్రం విజయం సాధించాలంటూ చిత్ర టీమ్ కి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను" అంటూ చిరంజీవి ట్విట్టర్ లో స్పందించారు.
పూజా ఎంటర్టయిన్ మెంట్, గుడ్ కో ప్రొడక్షన్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ హై ఓల్టేజ్ యాక్షన్ చిత్రానికి వికాస్ బెహెల్ దర్శకుడు. ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Project K చిత్రానికి ‘కల్కి 2898 ఏడీ’గా టైటిల్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం విశేషం. ‘మహానటి’ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ప్రభాస్ సూపర్ హీరోగా నటిస్తున్నారు. దీపికా పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
అమెరికాలో జరిగిన శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్లో ‘కల్కి 2898 ఏడీ’ గ్లింప్స్‌ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘కల్కి 2898 ఏడీ’ రిలీజ్ డేట్‍ను చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించినా.. ఆ తేదీకి ఈ చిత్రం రావడం లేదని స్పష్టమవుతోంది. అయితే, ఈ సినిమా విడుదల కోసం వైజయంతీ మూవీస్ సెంటిమెంట్‍ను ఫాలో అవుతుందంటూ సమాచారం చక్కర్లు కొడుతోంది.