MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Chiranjeevi: లేడీ గెటప్ లో చిరంజీవి, మీసం లేకుండా చూసి సురేఖ ఏమని వార్నింగ్ ఇచ్చిందంటే?

Chiranjeevi: లేడీ గెటప్ లో చిరంజీవి, మీసం లేకుండా చూసి సురేఖ ఏమని వార్నింగ్ ఇచ్చిందంటే?

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన పాత్రలు చేశారు. అందులో కొన్ని లేడీ గెటప్స్ కూడా వేశారు. మొదటి సారి లేడీ గెటప్ లో మీసం లేకుండా చూసి ఆయన భార్య సురేఖ, తల్లి అంజనమ్మ ఏమన్నారో తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 28 2026, 08:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మెగాస్టార్ చిరంజీవి 45 ఏళ్ల సినిమా కెరీర్..
Image Credit : Asianet News

మెగాస్టార్ చిరంజీవి 45 ఏళ్ల సినిమా కెరీర్..

ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలో సొంతంగా ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి.. 45 ఏళ్ల ఫిల్మ్ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన పాత్రలు చేశారు. ఎంతో కష్టపడి మెగాస్టార్ రేంజ్ కు ఎదిగారు. ఆయన కెరీర్ లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చాలా చేశారు. ఒక్కోసారి స్టార్ ఇమేజ్ ను పక్కన పెట్టి.. చిరంజీవి లేడీ క్యారెక్టర్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరు ఏదో ఒక సందర్భంలో లేడీ పాత్రలు చేసిన వారే. అయితే చిరంజీవి పెళ్లైన తరువాత ఓ సినిమాలో మీసం తీసేసి, ఫారెన్ గౌను వేసుకుని.. సాంగ్ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఆయన పడిన తిప్పలు అన్నీ ఇన్నీ కావు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చిరంజీవి లేడీ గెటప్ వేసిన సినిమాలేంటి?
Image Credit : Asianet News

చిరంజీవి లేడీ గెటప్ వేసిన సినిమాలేంటి?

చిరంజీవి రెండు సినిమాల్లో పలు సందర్భాల్లో లేడీ గెటప్ లో కనిపించారు. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయ్ మూవీలో మెగాస్టార్ ఓ డిటెక్టీవ్ పాత్రలో కనిపించారు. డిటెక్టివ్ పాత్రలో నటిస్తూ విభిన్న గెటప్స్ వేశారు. ఇందులో భాగంగానే ఒక సీన్, సాంగ్ లో గౌను, తలపై టోపీ ధరించి లేడీ గెటప్‌లో కనిపించి ప్రేక్షకులను ఎంతగానో నవ్వించారు. అంతే కాదు అంతకు ముందు పట్నం వచ్చిన పతివ్రతలు సినిమాలో కూడా మోహన్ బాబుతో కలిసి లేడీ గెటప్ వేసుకుని కనిపించాడు చిరంజీవి. అయితే చంటబ్బాయి సినిమా టైమ్ లో మాత్రం మెగాస్టార్ తన ఇంట్లో తిట్లు తినాల్సి వచ్చిందట.

35
చిరంజీవి భార్య, తల్లి ఏమన్నారంటే?
Image Credit : X/@KChiruTweets

చిరంజీవి భార్య, తల్లి ఏమన్నారంటే?

లేడీ గెటప్‌ గురించి ఓ సినిమా ఈవెంట్ లో చిరంజీవి డైరెక్ట్ కామెంట్స్ చేశారు. చంటబ్బాయిలో ఆ క్యారెక్టర్ నాకు సెట్ కాలేదని నా కుటుంబసభ్యులు అన్నారు. అలా నన్ను చూడలేకపోయారు. అమ్మ అంజనమ్మ అయితే ఏంటిరా ఇది అని తిట్టారు.. ఇక సురేఖ అయితే.. మళ్లీ మీసాలు పెంచేవరకు కంటికి కనిపించొద్దని వార్నింగ్ కూడా ఇచ్చింది అంటూ ‘చంటబ్బాయి’ సంగతులు గుర్తుచేసుకున్నారు చిరంజీవి.

45
జంధ్యాలకు చిరంజీవి పెట్టిన కండీషన్ ఏంటి?
Image Credit : Asianet News

జంధ్యాలకు చిరంజీవి పెట్టిన కండీషన్ ఏంటి?

లేడీ గెటప్‌ కోసం మీసాలు తీయాల్సి వచ్చినప్పుడు, చిరంజీవి దర్శకుడు జంధ్యాలకు ఓ షరతుకూడా పెట్టారట. షూటింగ్‌లో ఉన్న70 మంది స్టాఫ్ కూడా మీసాలు తీస్తేనే తాను తీస్తానన్నారు. దీనికి అందరూ అంగీకరించడంతో చిరంజీవి కూడా మీసాలు తీయక తప్పలేదు. అంతే కాదు అక్కడ ఉన్న చాలామందితో లేడీ గెటప్ లు కూడా వేయించారట. జంధ్యాల. తను ఇబ్బందిపడుతూ షూటింగ్ చేయకూడదని.. డైరెక్టర్ కాస్త డిఫరెంట్ గా ఆలోచించారట.

55
70 ఏళ్ళ వయసులో దూసుకుపోతున్న మెగాస్టార్...
Image Credit : ETV WIN

70 ఏళ్ళ వయసులో దూసుకుపోతున్న మెగాస్టార్...

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. 70 ఏళ్ళ వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ.. రచ్చ చేస్తున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలోనే మన శంకర వరప్రసాదుగారు సినిమాతో భారీ సంక్రాంతి హిట్ కొట్టిన చిరంజీవి.. ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి బరిలో దిగాలని పట్టుదలతో ఉన్నాడు. ఇక ఈలోపు విశ్వంభర కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RC17: ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ తో డీల్ కుదర్లేదా ? సుకుమార్, రామ్ చరణ్‌ మూవీ కోసం అనిరుధ్
Recommended image2
Rashmi Gautam: రష్మి గౌతమ్‌ నవరాత్రి స్పెషల్ ఫొటోషూట్..ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తోందిగా
Recommended image3
Allu Aravind: పవన్‌ కళ్యాణ్‌ వెండితెరకు పరిచయమై 30ఏళ్లు.. అల్లు అరవింద్‌ ఎమోషనల్‌ నోట్‌
Related Stories
Recommended image1
Bhagyaraj: ఒకే కథ, ఇద్దరు దిగ్గజాలు, రెండు బ్లాక్‌బస్టర్లు.. భాగ్యరాజ్, భారతీరాజా చేసిన అద్భుతం
Recommended image2
Bhagyaraj: భాగ్యరాజ్ మొదటి భార్య ఎవరో తెలుసా? పెళ్లైన రెండేళ్లకే ఎలా చనిపోయింది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved