- Home
- Entertainment
- బ్రహ్మరాక్షసుడిగా ప్రభాస్, హోంబలే ఫిలిమ్స్ భారీ ప్లాన్.. ముగ్గురూ సరిగ్గా ప్లాన్ చేస్తే 6 వేల కోట్లు కష్టమా ?
బ్రహ్మరాక్షసుడిగా ప్రభాస్, హోంబలే ఫిలిమ్స్ భారీ ప్లాన్.. ముగ్గురూ సరిగ్గా ప్లాన్ చేస్తే 6 వేల కోట్లు కష్టమా ?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని నమ్ముకుని నిర్మాతలు వేల కోట్ల బిజినెస్ కి రెడీ అవుతున్నారు. ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని స్టార్ హీరో. బాహుబలి, కల్కి లాంటి చిత్రాలు ప్రభాస్ సత్తా ఏంటో చూపించాయి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Prabhas
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని నమ్ముకుని నిర్మాతలు వేల కోట్ల బిజినెస్ కి రెడీ అవుతున్నారు. ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని స్టార్ హీరో. బాహుబలి, కల్కి లాంటి చిత్రాలు ప్రభాస్ సత్తా ఏంటో చూపించాయి. ప్రస్తుతం ప్రభాస్ ఫౌజి, రాజా సాబ్ చిత్రాల్లో నటిస్తున్నారు. స్పిరిట్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది.
మరోవైపు కెజిఎఫ్ చిత్రంతో దేశం మొత్తం హాట్ టాపిక్ గా మారిన నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ భారీ ప్లాన్ వేసింది. ప్రభాస్ తో రానున్న రోజుల్లో మూడు భారీ చిత్రాలు నిర్మించబోతున్నట్లు ఆల్రెడీ ప్రకటించింది. ప్రభాస్ హోంబలే ఫిలిమ్స్ లో సలార్ 2లో నటించాల్సి ఉంది. ఇది కాకుండా ప్రశాంత్ నీల్ తో మరో చిత్రం ప్లాన్ చేస్తున్నారట.ప్రశాంత్ నీల్ కమిట్మెంట్స్ పూర్తయ్యాక కాస్త ఆలస్యంగా ఈ ప్రాజెక్టు ఉంటుంది.
ప్రభాస్ తో వీలైనంత త్వరగా హోంబలే సంస్థ నిర్మించే చిత్రం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఉండబోతోంది అని అంటున్నారు. ఆ చిత్రం మరేదో కాదు ప్రశాంత్ వర్మ డ్రీం ప్రాజెక్టు బ్రహ్మరాక్షస. ఈ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ ముందుగా రణ్వీర్ సింగ్ తో తెరకెక్కించాలని ప్రయత్నించారు. కానీ ఊహించని కారణాల వల్ల ఈ కాంబినేషన్ ముందుకి వెళ్ళలేదు. దీనితో ప్రశాంత్ వర్మ ప్రభాస్ తో అత్యంత భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడట.
హోంబలే బ్యానర్ లో ప్రభాస్ తో మూవీ చేయబోయే మరో దర్శకుడు లోకేష్ కనకరాజ్ అని ప్రచారం జరుగుతోంది. ఈ ముగ్గురు దర్శకులు పాన్ ఇండియా స్థాయిలో నిరూపించుకున్న వారే. సరిగ్గా ప్లాన్ చేస్తే ఒక్కో చిత్రం 2 వేల కోట్ల వసూళ్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయి. అంతే ఈ ముగ్గురు దర్శకులు మనసు పెడితే 6 వేలకోట్లు కష్టం కాకపోవచ్చు.