మెగా ఫ్యామిలీని తిడితే జరిగేది ఇదే? సోషల్ మీడియాను ఊపేస్తున్న న్యూస్!
టాలీవుడ్ ని మెగా హీరోలు శాసిస్తుస్తుంది అనడంలో సందేహం లేదు. మరి అలాంటి ఫ్యామిలీ ని చిన్న నటులు తిడితే పరిస్థితి ఏంటి? జరిగేది ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

Mega Family
ఏ రంగంలో అయినా ఆధిపత్య పోరు ఉంటుంది. బలమైనవారి హవా నడుస్తుంది. టాలీవుడ్ లో అతిపెద్ద శక్తిగా మెగా ఫ్యామిలీ ఎదిగింది. నందమూరి, అక్కినేని, దగ్గుబాటి, ఘట్టమనేని, మంచు ఫ్యామిలీలు వారిని ఢీ కొట్టే పరిస్థితి లేదు. కారణం మెగా ఫ్యామిలీలో నలుగురు స్టార్ హీరోలు, మరో ముగ్గురు నలుగురు టైర్ టు హీరోలు ఉన్నారు.
ఈ ఫ్యామిలీకి గీతా ఆర్ట్స్, కొణిదెల ప్రొడక్షన్స్, అంజనా ప్రొడక్షన్స్ వంటి నిర్మాణ సంస్థలు ఉన్నాయి భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కించే నిర్మాతలు సన్నిహితులుగా ఉన్నారు. బలమైన ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు.
ఈ క్రమంలో మెగా ఫ్యామిలీని లేదా మెగా హీరోలను దూషిస్తే పర్యవసానాలు దారుణంగా ఉంటాయనే ఓ వాదన ఉంది. 2009 ఎన్నికలకు ముందు రాజశేఖర్, జీవిత దంపతులు చిరంజీవి ఛారిటీ సంస్థల మీద ఆరోపణలు చేశారు. ఈ ఘటన తర్వాత హీరో రాజశేఖర్ కెరీర్ గ్రాఫ్ బాగా పడిపోయింది.
Mega Family
అలాగే పవన్ కళ్యాణ్ మీద పోసాని, థర్టీ ఇయర్స్ పృథ్వి కీలక ఆరోపణలు చేశారు. ఇద్దరికీ ఆఫర్స్ తగ్గాయి. వైసీపీ పార్టీ ఇచ్చిన పదవి పోగొట్టుకున్న పృథ్విరాజ్ యూటర్న్ తీసుకుని జనసేనలో చేరాడు. ఇప్పుడిప్పుడే అతని కెరీర్ తిరిగి గాడిన పడుతుంది.
Mega Family
పోసాని ఇప్పటికీ వైసీపీ పార్టీతోనే ఉన్నారు. తరచుగా పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయాల్లోకి రాకముందు పోసాని బిజీ ఆర్టిస్ట్. ప్రస్తుతం అడపాదడపా చిత్రాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీ మీద ఆరోపణలు చేసిన వారికి కెరీర్ ఉండదు. వాళ్లకు భయపడి ఎవరూ ఆఫర్స్ ఇవ్వరనేది సోషల్ మీడియా టాక్.
దర్శకులకు, నిర్మాతలకు మెగా హీరోలు కావాలి. కాబట్టి వారి శత్రువులకు అవకాశం ఇస్తే వాళ్లకు నచ్చకపోవచ్చనే భయానికి గురయ్యే అవకాశం ఉంది. ఆఫర్స్ ఇవ్వొద్దని మెగా ఫ్యామిలీ సూచించకున్నా... దర్శక నిర్మాతలు భయపడతారట. ఎందుకులే రిస్క్ అని అవకాశాలు ఇవ్వరట. అయితే ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు. పవన్ కళ్యాణ్ కి దూరంగా ఉంటున్న ఆలీకి బాగానే ఆఫర్స్ వస్తున్నాయి. కాబట్టి మెగా హీరోలను తిడితే దర్శక నిర్మాతలు అవకాశాలు ఇవ్వరు అనే వాదనకు బలమైన ఆధారాలు లేవు.