MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Vijay Salary: 200 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే విజయ్‌ సీఎంగా ఎంత జీతం తీసుకుంటున్నాడో తెలుసా? పెట్రోల్‌కి కూడా సరిపోవేమో

Vijay Salary: 200 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే విజయ్‌ సీఎంగా ఎంత జీతం తీసుకుంటున్నాడో తెలుసా? పెట్రోల్‌కి కూడా సరిపోవేమో

Vijay Salary: ఒక సినిమాకు రూ. 200 కోట్ల పారితోషికం తీసుకునే విజయ్, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎంత జీతం తీసుకుంటున్నాడో తెలుసా? జయలలిత, కరుణానిధి శాలరీ చరిత్ర ఏంటి?  అనేది చూద్దాం. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 24 2026, 03:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సీఎంగా దళపతి విజయ్‌ జీతం ఎంతంటే?
Image Credit : X

సీఎంగా దళపతి విజయ్‌ జీతం ఎంతంటే?

దళపతి విజయ్‌ కోలీవుడ్‌లో బిగ్గెస్ట్ స్టార్‌ హీరో. రజనీకాంత్‌, కమల్‌ హాసన్ తరం తర్వాతి హీరోల్లో విజయ్‌ని మించిన స్టార్‌ లేరని చెప్పొచ్చు. అయితే విజయ్‌ ఇటీవల రాజకీయాల్లోకి వెళ్లాడు. ఏకంగా సీఎం కూడా అయ్యాడు. ప్రస్తుతం తమిళనాడు సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తనదైన స్టయిల్‌లో ట్రెండ్‌ సెట్టర్‌ సీఎంగా నిలుస్తున్నాడు. మరి హీరోగా రూ.200కోట్ల పారితోషికం తీసుకునే విజయ్‌, ఇప్పుడు సీఎంగా ఎంత పారితోషికం తీసుకుంటున్నాడనేది చూస్తే.  నెలకు కేవలం 2 లక్షల రూపాయలే కావడం గమనార్హం.  '200 కోట్లు ఎక్కడ, 2 లక్షలు ఎక్కడ? మా అన్న రోల్స్ రాయిస్ కారుకు పెట్రోల్ పోయించడానికి కూడా ఇది సరిపోదు' అని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆదాయం తగ్గినా విజయ్ డోంట్‌ కేర్
Image Credit : X

ఆదాయం తగ్గినా విజయ్ డోంట్‌ కేర్

ఆదాయం పాతాళానికి పడిపోయినా విజయ్ పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ఎందుకంటే, తమిళనాడు రాజకీయాల్లో జీతాల చరిత్రే అలా ఉంది. 1991లో జయలలిత మొదటిసారి సీఎం అయినప్పుడు, 'ప్రజాసేవకు వచ్చాను' అని చెప్పి నెలకు కేవలం 1 రూపాయి జీతం తీసుకున్నారు. కోట్లాది రూపాయల ఆస్తి ఉన్నా, ఆ ఒక్క రూపాయి జీతం అప్పట్లో పెద్ద వార్త అయ్యింది. అలాగే, కరుణానిధి ఐదుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చాలాసార్లు తన జీతాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు.

Related Articles

Related image1
RC17: మీరు ఎంతైనా ఊహించుకోండి, రామ్‌ చరణ్‌తో మూవీపై అంచనాలు పెంచిన సుకుమార్‌.. అదిరిపోయే హింట్‌
Related image2
Maa Inti Bangaram 5 Days Collections: బాక్సాఫీసు వద్ద మా ఇంటి బంగారం ర్యాంపేజ్‌.. సమంత మూవీకి ఎన్నికోట్ల లాభం అంటే
35
ముఖ్యమంత్రి జీతం ఇలా పెరిగింది
Image Credit : X

ముఖ్యమంత్రి జీతం ఇలా పెరిగింది

కాలం మారేకొద్దీ, పెరిగిన ధరలకు అనుగుణంగా రాజకీయ నాయకుల జీతాలు కూడా పెరిగాయి. 2018లో అమల్లోకి వచ్చిన చట్టం ప్రకారం, తమిళనాడు ముఖ్యమంత్రి జీతాన్ని అలవెన్సులతో కలిపి సుమారు రూ. 2.05 లక్షలుగా నిర్ణయించారు. దాని ప్రకారమే, మాజీ సీఎం ఎం.కే. స్టాలిన్ అందుకున్న జీతాన్నే ఇప్పుడు విజయ్ కూడా తీసుకుంటున్నారు. సినిమా మార్కెట్‌లో శిఖరాగ్రంలో ఉన్న విజయ్, ఇప్పుడు పక్కా రాజకీయ నాయకుడిగా మారి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం తన బడ్జెట్‌ను సర్దుబాటు చేసుకున్నారు.
45
ప్రజల డబ్బు ముట్టుకుంటే వదలను
Image Credit : Asianet News

ప్రజల డబ్బు ముట్టుకుంటే వదలను

సినిమాల్లో కోట్లు చూసిన విజయ్, ఇప్పుడు 2 లక్షల రూపాయల బడ్జెట్‌లో ఎలా లైఫ్‌ లీడ్‌ చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. అదే సమయంలో ఇప్పుడు ప్రభుత్వ ఖజానాను దోచుకునే వాళ్లను చూసి, 'ప్రజల ఒక్క పైసా కూడా ఎవరూ ముట్టుకోలేరు, ముట్టుకుంటే వదలను' అని అసెంబ్లీలో గర్జిస్తున్నారు. 'మీరు సినిమా షూటింగ్ సెట్ నుంచి నేరుగా వచ్చారు' అని ప్రతిపక్షాలు విమర్శిస్తే, 'మేము అభిమాన సంఘంలో ఉన్నప్పుడే స్టెర్లైట్, జల్లికట్టు విషయాల్లో ప్రజలతో నిలబడ్డాం' అని మన సీఎం సమాధానం చెప్పడం విశేషం. 

55
సినిమాలకు టాటా చెప్పేశారు
Image Credit : X

సినిమాలకు టాటా చెప్పేశారు

విజయ్ జీతం ఆయన కారు పెట్రోల్ ఖర్చుకు సరిపోతుందో లేదో గానీ, ఆయన అమలు చేస్తున్న కొత్త పథకాలు తమిళనాడు రాజకీయాల్లో 'మాస్టర్' క్లాస్ అనిపిస్తున్నాయి. కోట్లు తెచ్చిపెట్టే సినిమాలకు 'టాటా' చెప్పేసి, ఈ 2 లక్షల రూపాయల జీతాన్ని సంతోషంగా స్వీకరించిన విజయ్ జనాల్లో మంచి సీఎంగా నిలిచిపోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే విజయ్‌ బ్యాంక్‌ల్లో మూడు వందల కోట్లకుపైగా ఎఫ్‌డీ చేశారు. అంటే నెలకు లక్షల్లో ఇంట్రెస్ట్ వస్తుంది. వాటితో లైఫ్‌ లీడ్‌ చేసే అవకాశం ఉంది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
టీవీకే విజయ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తమిళ సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Samarasimha Reddy Review: చిరంజీవికి ఎంతో ఇష్టమైన బాలకృష్ణ సినిమా, 365 రోజులు ఆడిన ట్రెండ్ సెట్టర్, సమరసింహా రెడ్డి రివ్యూ
Recommended image2
Chiranjeevi Stunts: దున్నపోతుల మధ్యలో రియల్ స్టంట్స్, రెడీగా అంబులెన్స్.. స్నేహితుల కోసం తెగించిన చిరంజీవి
Recommended image3
Upcoming Movies: రజనీతో అజిత్ పోటీ, సూర్య హ్యాట్రిక్ కొడతాడా?.. వచ్చే 4 నెలల్లో రాబోతున్న భారీ చిత్రాలివే
Related Stories
Recommended image1
RC17: మీరు ఎంతైనా ఊహించుకోండి, రామ్‌ చరణ్‌తో మూవీపై అంచనాలు పెంచిన సుకుమార్‌.. అదిరిపోయే హింట్‌
Recommended image2
Maa Inti Bangaram 5 Days Collections: బాక్సాఫీసు వద్ద మా ఇంటి బంగారం ర్యాంపేజ్‌.. సమంత మూవీకి ఎన్నికోట్ల లాభం అంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved