- Home
- Entertainment
- Bigg Boss Telugu 10: హౌస్ నుంచి ఝాన్సీ అవుట్, అమాయకత్వంతో ఉండలేను అంటూ కన్నీళ్లు.. త్రిగుణ్ పై వర్షిణి కుట్ర
Bigg Boss Telugu 10: హౌస్ నుంచి ఝాన్సీ అవుట్, అమాయకత్వంతో ఉండలేను అంటూ కన్నీళ్లు.. త్రిగుణ్ పై వర్షిణి కుట్ర
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10లో భాగంగా శనివారం రోజు షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది. ఝాన్సీ ఎలిమినేట్ అయింది. ఆమె ఎలిమినేట్ కావడంతో ముకేశ్ కన్నీరుమున్నీరు అయ్యాడు.

ఝాన్సీ అవుట్
బిగ్ బాస్ హౌస్ నుంచి ఫోక్ సింగర్ ఝాన్సీ ఎలిమినేట్ అయింది. ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం ఆమె ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. ఈ వారం 2 ఎలిమినేషన్స్ ఉన్నాయి. ఝాన్సీ శనివారం ఎలిమినేట్ కాగా ఆదివారం రోజు మరొకరు ఎలిమినేట్ అవుతారు.
వాళ్లకు జీరో స్టార్స్
శనివారం రోజు నాగార్జున ఒక్కొక్కరి ఆటతీరుపై స్టార్స్ ఇచ్చారు. బాగా ఆడని వాళ్ళని జీరో స్టార్స్ కేటగిరిలో ఉంచారు. సుధీర్, ఝాన్సీ, ఆర్కే, నీతూ లకు నాగార్జున జీరో స్టార్స్ ఇచ్చారు. ఆర్కేని నవరస మామ అంటారు.. కానీ నీలో శోక రసం మాత్రమే ఉంది అంటూ నాగార్జున సెటైర్లు వేశారు. నరేష్, రామ్ ప్రసాద్ లకు నాగార్జున 5 స్టార్స్ ఇచ్చి వాళ్ళ ఆట తీరుని అభినందించారు.
'P' అంటే ఏంటి
ఈ వారం ఆట తీరు పర్వాలేదు అని భావించిన వారికి నాగార్జున 3 స్టార్స్ ఇచ్చారు. నాగార్జున వర్షిణికి 3 స్టార్స్ ఇచ్చినట్లే ఇచ్చి జీరో స్టార్స్ కి లాగేశారు. దానికి కారణం ఉంది. వర్షిణి, ముకేశ్, సుధీర్, రోహిత్ నలుగురూ శివ కుమార్ గురించి సీక్రెట్ గా మీటింగ్ పెట్టి గుసగుసలు ఆడారు. దాని గురించి నాగార్జున పరోక్షంగా ప్రస్తావిస్తూ వర్షిణిని 'P' అంటే ఏంటి అని.. సుధీర్ ని 'B' అంటే ఏంటి అని ప్రశ్నించారు. కాసేపు వాళ్లిదరూ ఏమీ తెలియనట్లు నటించి ఆ తర్వాత బిక్క ముఖం వేశారు.
నేను దెబ్బేస్తే వాడు పడిపోవాల్సిందే
శివ కుమార్ గురించి వాళ్ళు నలుగురు మాట్లాడుకున్న వీడియోను నాగార్జున బయట పెట్టారు. ఈ వీడియోలో రోహిత్ మాట్లాడుతూ శివకుమార్ మరో త్రిగుణ్ లాంటోడు. ఇక్కడ విషయాలు అక్కడ .. అక్కడ విషయాలు ఇక్కడ చెప్పే మీడియేటర్ అని ముకేశ్ అన్నాడు. నువ్వు పద్దతిగా ఆ మాట అన్నావు.. నేను అయితే వేరేలా అంటాను అని రోహిత్ తెలిపాడు. వెంటనే సుధీర్ ఆ మాట 'B' తో మొదలవుతుంది అని సుధీర్ తెలిపాడు. అది కాదు P అని వర్షిణి సైగ చేసింది. ఈ సంఘటన గురించే నాగార్జున వారిని అడిగారు. ఆ పదాలు ఏంటి అని నాగార్జున అడగగా ఎవ్వరూ చెప్పలేదు. చెప్పడానికే మీకే అంత ఇబ్బందిగా ఉంటే.. ఇక ఆడియన్స్ ఎలా ఫీల్ అయి ఉంటారు అంటూ నాగార్జున దుమ్మెత్తి పోశారు. అందుకే వర్షిణిని 3 స్టార్స్ నుంచి జీరో స్టార్ కి పంపారు. ఆ తర్వాత నాగార్జున త్రిగుణ్ ని అభించనందించారు. అల్టిమేట్ గోట్ అయిన త్రిగుణ్ కి నాగార్జున ఒక గిఫ్ట్ ఇచ్చారు. అదేంటంటే.. హౌస్ లో ఇతరాలు తన గురించి సీక్రెట్ గా ఏమనుకుంటున్నారో వీడియోలో చూపించారు. ఆ వీడియోలో నేను త్రిగుణ్ వీక్ నెస్ పై దెబ్బ కొడతా. నేను దెబ్బేస్తే వాడు పడిపోవాల్సిందే అలా కొడతా అంటూ వర్షిణి చేస్తున్న కుట్రని చూపించారు.సమయం వచ్చినప్పుడు దీని గురించి మాట్లాడతా అని త్రిగుణ్ నాగార్జునకు తెలిపారు.
నా అమాయకత్వంతో ఉండలేను
చివర్లో ఎలిమినేషన్ ప్రక్రియ రసవత్తరంగా సాగింది. త్రిగుణ్ కుండల్ని పగల గొట్టగా అందులో ఝాన్సీ ఫోటో రాలేదు. దీనితో ఝాన్సీ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. వాస్తవానికి మ్యాజిక్ పవర్ యూజ్ చేసి ముకేశ్ సుధీర్ ని సేవ్ చేశాడు లేకుంటే ఝాన్సీ ప్లేస్ లో సుధీర్ ఉండేవాడు అని నాగార్జున తెలిపారు. తన వల్ల ఝాన్సీ ఎలిమినేట్ అయింది అనే ఫీలింగ్ తో ముకేశ్ వెక్కి వెక్కి ఏడ్చాడు. ఝాన్సీ కూడా కన్నీళ్లు పెట్టుకుని ఎమోషనల్ అయింది. నా అమాయ కత్వంతో హౌస్ లో ఇంకా ఉండలేను. అలాగని వ్యక్తిత్వం చంపుకోలేదు అందుకే ఎలిమినేట్ అయ్యా అంటూ ఝాన్సీ కన్నీళ్లు పెట్టుకుంది.





