కీర్తి సురేష్ ఆ టాలీవుడ్ స్టార్ హీరో కొడుకు గర్ల్ ఫ్రెండ్ అని మీకు తెలుసా? ఆమె స్వయంగా చెప్పింది
పెళ్లి పీటలు ఎక్కిన కీర్తి సురేష్ గతంలో కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఓ స్టార్ హీరో కొడుకుతో తనకున్న అనుబంధం పంచుకుంది. ఆ వివరాలు ఏమిటో చూద్దాం..
హీరోయిన్ కీర్తి సురేష్ వివాహం నేడు. దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త ఆంటోనితో ఆమె ఏడడుగులు వేస్తున్నారు. గోవాలో ఆమె వివాహం ఘనంగా జరుగుతుంది. అభిమానులు, సన్నిహితులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కీర్తి సురేష్ పెళ్లి నేపథ్యంలో పలు ఆసక్తికర విషయాలు తెరపైకి వస్తున్నాయి.
Keerthy Suresh
హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుaaతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. ఈ ఏడాది ఆమె బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వనుంది. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ' తేరీ ' రీమేక్ గా తెరకెక్కుతున్న ' బేబీ జాన్ ' మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. అలాగే తెలుగులో సుహాస్ ప్రధాన పాత్రలో వస్తున్న కామెడీ మూవీ 'ఉప్పు కప్పు రంబు' సినిమా చేస్తుంది. ఇది డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది.
Keerthy Suresh
అలాగే మూడు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో కీర్తి సురేష్ నటిస్తుంది. ఇది పక్కన పెడితే .. కీర్తి సురేష్, హీరో నాని చాలా మంచి ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరు కలిసి ' నేను లోకల్ ', ' దసరా ' సినిమాల్లో జంటగా నటించారు. నేను శైలజ సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. ' నేను లోకల్ ' కీర్తి కి తెలుగులో రెండో సినిమా. అప్పటి నుంచి నాని, కీర్తి స్నేహితులుగా ఉన్నారు. పలు సందర్భాల్లో కీర్తి సురేష్ వారి బాండింగ్ గురించి, నాని ఫ్యామిలీ తో ఉన్న రిలేషన్ గురించి చెప్పుకొచ్చింది.
ఆమె హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి నాని ఇంటికి తప్పకుండా వెళ్తూ ఉంటుంది. నాని ఫ్యామిలీతో కూడా ఆమెకు మంచి అనుబంధం ఉంది. కీర్తి సురేష్ గతంలో ఓ ఇంటర్వ్యూలో నాని తో తన ఫ్రెండ్షిప్, నాని కొడుకు తనను ఏమని పిలుస్తాడు వంటి సీక్రెట్స్ రివీల్ చేసింది. కీర్తి మాట్లాడుతూ... ' నాని, తన వైఫ్, వాళ్ళ కొడుకు అందరూ నాకు చాలా క్లోజ్. ఇప్పుడైతే వాడు కొంచెం పెద్దయ్యాడు. చిన్నప్పుడు నన్ను తన గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేవాడు.
Actress Keerthy Suresh
వాడు చాలా క్యూట్. ఒకసారి నా బర్త్ డే కి వాడు ఒక వాయిస్ నోట్ పంపించాడు. అది ఒకసారి వినిపిస్తా వినండి. నన్ను వాడు అత్త అని పిలుస్తాడు. వాడు మిస్ యూ, సి యూ అనే పదాలు భలే క్యూట్ గా పలుకుతాడు. మూసీ, సూయు అంటాడు. నేను ఎప్పుడైనా కాస్త డౌన్ గా ఉన్నప్పుడు వాడి వాయిస్ నోట్ వింటాను. ఇది సేవ్ చేసి పెట్టుకున్నాను. నేను ఇంటికి వెళ్లిన ప్రతిసారి నా బుగ్గ కొరికేంతలా ముద్దు పెడుతుంటాడు జున్ను. ఆ ఫోటోలు కూడా ఉంటాయి.
Keerthy Suresh
ఒక్క మాటలో చెప్పాలంటే నాని ఫ్యామిలీ నా కుటుంబం అయిపోయింది. నేను హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి వాళ్ళ ఇంటికి వెళ్తూనే ఉంటాను. అంటూ కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కీర్తి సురేష్ మాత్రమే కాదు ఇప్పటివరకు నాని తో నటించిన ప్రతి హీరోయిన్ నానికి మంచి ఫ్రెండ్. సాయి పల్లవి, సమంత, నజ్రియా, నిత్యా మీనన్ మృణాల్ ఠాకూర్ ఇప్పటికీ నానికి బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నారు. నాని కుటుంబంతో కూడా వాళ్ళకి మంచి రిలేషన్ ఉంది.