- Home
- Entertainment
- ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన డైరెక్టర్ అది మాత్రం చెడగొట్టారు, చెత్త సినిమా అని తేల్చేసిన మహేష్ బాబు వైఫ్
ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన డైరెక్టర్ అది మాత్రం చెడగొట్టారు, చెత్త సినిమా అని తేల్చేసిన మహేష్ బాబు వైఫ్
Mahesh Babu : మహేష్ బాబు డెబ్యూ మూవీ రాజకుమారుడు సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత మహేష్ బాబు కెరీర్ ని ప్రమాదంలోకి నెట్టే చిత్రాలు ఎదురయ్యాయి. యువరాజు మూవీ పర్వాలేదనిపించింది. ఆ తర్వాత మహేష్ నటించిన వంశీ దారుణమైన డిజాస్టర్.

Mahesh Babu
Mahesh Babu :సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్కడు చిత్రంతో మాస్ హీరోగా మారారు. అప్పటి వరకు మహేష్ ని ఆడియన్స్ లవర్ బాయ్ గానే పరిగణిస్తూ వచ్చారు. మహేష్ బాబు డెబ్యూ మూవీ రాజకుమారుడు సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత మహేష్ బాబు కెరీర్ ని ప్రమాదంలోకి నెట్టే చిత్రాలు ఎదురయ్యాయి.
యువరాజు మూవీ పర్వాలేదనిపించింది. ఆ తర్వాత మహేష్ నటించిన వంశీ దారుణమైన డిజాస్టర్. ఈ చిత్రానికి దర్శకుడు బి గోపాల్. ఆయన గురించి చెప్పనవసరం లేదు. సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, ఇంద్ర లాంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు ఆయన. మహేష్ ని కూడా స్టార్ గా నిలబెడతాడు అని ఆ టైంలో అంతా భావించారు.
అత్యంత భారీ ఖర్చుతో ఈ చిత్రంలోని కీలక సన్నివేశాలని న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో 40 రోజుల పాటు చిత్రీకరించారు. నమ్రత టాలీవుడ్ కి లాంచ్ అయింది ఈ చిత్రంతోనే. మహేష్, నమ్రత మధ్య పరిచయం ఏర్పడి ప్రేమకి దారితీసిన చిత్రం కూడా ఇదే. ఈ చిత్రానికి సంబంధించి ఇన్ని మంచి విషయాలు ఉన్నాయి. కానీ రిజల్ట్ మాత్రం డిజాస్టర్.
మహేష్ బాబుకి హెవీ మాస్ ఎలిమెంట్స్ పెట్టడం, చివర్లో కృష్ణ ఎంట్రీ లాంటి అంశాలు ఈ కథని చెడగొట్టాయి అని కామెంట్స్ వినిపించాయి. మణిశర్మ మంచి సంగీతం అందించారు. కథలోనే తప్పు జరిగింది అని ఆ తర్వాత బి గోపాల్ అంగీకరించారు.
మహేష్ బాబు సతీమణి నమ్రత కూడా ఓ ఇంటర్వ్యూలో వంశీ చెత్త సినిమా అని తేల్చేశారు. మహేష్ చిత్రాల్లో నచ్చని మూవీ అదే అని.. మురారి, అతడు, పోకిరి అంటే చాలా ఇష్టం అని నమ్రత పేర్కొన్నారు.