- Home
- Entertainment
- Anausya-Rashmi: ఆమె జోరు ఈమె బేజారు... దర్శకులకు అనసూయలో నచ్చినది రష్మీలో నచ్చనిది అదే!
Anausya-Rashmi: ఆమె జోరు ఈమె బేజారు... దర్శకులకు అనసూయలో నచ్చినది రష్మీలో నచ్చనిది అదే!
వెండితెరపై అనసూయ (Anasuya)కెరీర్ రేసు గుర్రంగా పరుగెడుతుంటే... రష్మీ కెరీర్ మాత్రం నత్తనడక నడుస్తుంది. భిన్నమైన పాత్రలు దక్కించుకుంటూ అనసూయ జోరు చూపుతున్నారు . రష్మీ సినిమా ఆఫర్స్ రాక బేజారు అవుతున్నారు. సినిమా అవకాశాల విషయంలో అనసూయతో రష్మీ పోటీపడలేకపోతుంది .

జబర్దస్త్ యాంకర్స్ గా అనసూయ, రష్మీ(Rashmi Gautam)లకు సమానమైన ఇమేజ్ ఉంది. ఒక విధంగా చేయాలంటే రష్మీని అభిమానించేవారే ఎక్కువ . కారణం ఆమె వివాదాలకు చాలా దూరం . తనపై వచ్చే ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్ చాలా లైట్ తీసుకుంటుంది. దీనికి అనసూయ పూర్తిగా వ్యతిరేకం.
తనకు సంబంధం లేని విషయాలపై కూడా సోషల్ మీడియాలో స్పందిస్తారు. ఇక తనపై, తన డ్రెస్ సెన్స్ గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా ఊరుకోదు, వెనకా ముందు చూడకుండా లెఫ్ట్ రైట్ ఇచ్చేస్తుంది. ఈ విషయంలో అనసూయ పలుమార్లు విమర్శలపాలయ్యారు.
పాజిటివ్ ఇమేజ్ ఉంది కూడా రష్మీ సినిమా అవకాశాల పరంగా వెనుకబడడానికి కారణం... సబ్జక్ట్స్ ఎంపిక. అనసూయక గత రెండేళ్లుగా బిజీ అయ్యారు. ఆమె కంటే ముందు రష్మీకి హీరోయిన్ ఆఫర్స్ వచ్చాయి. జబర్దస్త్ షో ద్వారా వచ్చిన ఫేమ్ తో రష్మీకి స్మాల్ బడ్జెట్ చిత్రాలలో నటించే ఛాన్స్ దక్కింది. అది కూడా హీరోయిన్ గా..
ఈ క్రమంలో గుంటురు టాకీస్, చారుశీల, అంతం, నెక్స్ట్ నువ్వే, అంతకు మించి... ఇలా వరుస చిత్రాలు చేశారు. వీటిలో ఒక్క మూవీ కూడా విజయం సాధించలేదు. దీంతో ఆమెకు ఆఫర్స్ రావడం తగ్గాయి. ప్రస్తుతం రష్మీ చేతిలో రెండు చిత్రాలు మాత్రమే ఉన్నాయి. బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీతో పాటు చిరంజీవి(Chiranjeevi) భోళా శంకర్ లో ఓ రోల్ చేస్తున్నారు.
ఇక అనసూయ కెరీర్ మెల్లగా మొదలై ఇప్పుడు ఊపందుకుంది. కథనం చిత్రంలో అనసూయ ప్రధాన పాత్ర చేశారు. రంగస్థలం లో రంగమ్మత్త పాత్ర ఆమెకు బ్రేక్ ఇచ్చింది. వరుసగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో పాటు క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం అనసూయ చేతిలో అరడజనుకు పైగా చిత్రాలున్నాయి. రంగమార్తాండ, ఖిలాడి, ఆచార్య(Acharya), పక్కా కమర్షియల్, పుష్ప 2 చేస్తున్నారు. అలాగే ఓ తమిళ, మలయాళ చిత్రంలో నటిస్తున్నారు. హీరోయిన్ గా దర్జా పేరుతో ఓ మూవీ చేస్తున్నారు. అనసూయకు డిమాండ్ బాగా పెరగడంతో భారీగా రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది.
రష్మీ మాత్రం అడపాదడపా అవకాశాలతో నెట్టుకొస్తోంది.కేవలం గ్లామర్ పాత్రలకు మాత్రమే ఆమె పనికొస్తుందని దర్శకనిర్మాతల ఆలోచన... దీంతో డీ గ్లామర్, నెగిటివ్ రోల్స్ కి ఆమెను సంప్రదించడం లేదు. వర్సటైల్ రోల్స్ చేస్తున్న అనసూయకు మాత్రం ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయి.