MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఉదయభాను బిగ్ బాస్ లోకి రాకపోవడానికి కారణం అదేనా..? వైల్డ్ కార్డ్ ఎంట్రీపై కూడా హోప్స్ లేనట్టేనా..?

ఉదయభాను బిగ్ బాస్ లోకి రాకపోవడానికి కారణం అదేనా..? వైల్డ్ కార్డ్ ఎంట్రీపై కూడా హోప్స్ లేనట్టేనా..?

ఎట్టకేలకు ఊరిస్తూ... ఊరిస్తూ.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 స్టార్ట్ అయ్యింది. సోషల్ మీడియాలో ప్రచారం జరిగినట్టుగానే చాలా మంది కంటెస్టెంట్స్ కనిపించారు. కాని అందులో కొంత మంది ముఖ్యమైనవాళ్ళు మాత్రం మిస్ అయ్యారు.. అందులో   సీనియర్ యాంకర్ ఉదయభాను కూడా ఉంది. మరిఆమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు రాలేదు. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 08 2022, 08:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఈ వారం గ్రాండ్ గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 స్టార్ట్ అయ్యింది. ఇక బిగ్ బాస్ స్టార్ట్ అవుతుందంటే.. నెల ముందు నుంచే సోషల్ మీడియాకు మేత దొరికినట్టే.. ఫలానా వాళ్ళు రాబోతున్నారంటూ ప్రచారంపీక్స్ లోకి ఎక్కిస్తారు. అందులో చాలా మంది  లిస్ట్ లో ఉన్నవారే వస్తారనుకుకో... ఈసారి కూడా భారీ లిస్ట్  నెట్టింట తెగ తిరిగేసింది. చాలా మంది నుకున్నట్టగానే హస్ లోకి వచ్చేశారు. కాని మెయిన్ పర్సన్స్ లో ఒకరు మాత్రం మిస్ అయ్యారు. 

28

ఈ సీజన్ లో ఎంట్రీ ఇవ్వబోతున్న కంటెస్టెంట్స్ లిస్ట్ లో పక్కా అంటూ కొంత మంది పేర్లు ప్రచారం జరిగాయి. అందులో ముఖ్యంగా సీనియర్ యాంకర్ ఉదయభాను పేరు ప్రముఖంగా వినిపించింది. ఉదయభాను బిగ్ బాస్ హౌస్ లోకి పక్కా అంటూ..దాదాపు మూడు నెలలు  గట్టిగా ప్రచారం జరిగింది.  కాని ఆమె మాత్రం హౌస్ లో కనిపించలేదు. కారణం ఏంటీ..?

38

ఇప్పుడు కాదు.. గత రెండు మూడు సీజన్ల నుంచి  ఉదయ భాను పేరు బిగ్ బాస్ కోసం ప్రచారం ఉంటూనే ఉంది కాని ఆమె మాత్రం రావడంలేదు. ఈ సీజనల్ ఆమె పక్కాగా ఉంటుంది. రెమ్యూనరేషన్ కూడా అందరికంటే భారీగానే ఉండబోతోందని కుప్పలు తెప్పలుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. చివరికి ఆమె బిగ్బాస్ హౌస్ లో అడుగు పెట్టనే లేదు. వైల్డ్ కార్డు ఎంట్రీ తో అయినా అడుగు పెడుతుందో లేదో తెలియదు. 

48

అసలు ఉదయభాను ఎందుకు సైడ్ అయిపోయింది అనేది ప్రస్తుతం పెద్ద ప్రశ్నగా మారింది. అయితే బిగ్ బాస్ లోకి ఆమె రావడానికి పెద్ద మొత్తంలోనే పేమెంట్ డిమాండ్ చేసిందట. ఆమె డిమాండ్ తో బిగ్ బాస్ మేకర్స్ కూడా ఖంగుతిన్నారట. అంత పెద్ద మొత్తంగా డిమాండ్ చేసిందంటే..? ఎంత అడిగి ఉంటుందా అని అందరూ అనుకుంటున్నారు. 

58

ఉదయ భాను భారీ మొత్తంలో డిమాండ్ చేయడంతో.. బిగ్ బాస్ మేకర్స్ మాత్రం తాము ఎంత ఇవ్వగలమో ఫైనల్ గా చెప్పేశారట. వాళ్లు చెప్పిన నెంబర్ ఆమెకి నచ్చకపోవడంతో.. యాంకరమ్మ హౌస్ లోకి రానన్నదని సమాచారం. పైగా ఉదయభాను ఇప్పుడు ఫామ్ లో ఉన్న యాంకర్ కాదు. ఆమె దాదాపు కెరీర్ లో రిటైర్ అయిపోయిందనే చెప్పాలి. 

68

ఇదే విషయాన్ని ఆమె మఖం బిగ్ బాస్ నిర్వహకులు చెప్పేశారని ప్రచారం జరుగుతోంది. ఆమె డియాండ్ చేసిన అమౌంట్ తో మరో ముగ్గరు లేడీ కంటెస్టెంట్స్ ను తీసుకోవచ్చు.. ఈ ముగ్గరితో హౌస్ ఇంకా కలర్ ఫుల్ గా తయారవుతుంది అన్న అభిప్రాయాన్ని బిగ్ బాస్ మేకర్స్ వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఉదయభాను బిగ్ బాస్ ఎంట్రీకి ఇలా బ్రేక్ పడినట్టు సమాచారం. 
 

78

అయితే నెటిజ్లు కూడా ఇదే మాట అంటున్నారు. అసలే ఛాన్స్ లు లేవు. ఏజ్ బార్ అవుతోంది. సినిమా అవకాశాలు కూడా లేవు. షోష్, ఆడియో ఫంక్షన్లు ఇచ్చేవాళ్లు లేరు. మంచి అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోవచ్చు కదా అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంత..? అబద్దం ఎంతా అనేది  తెలియదు కాని.. ప్రచారం మాత్రం జరుగుతోంది. 

88

ఇక తన కెరీర్లో ఎన్నో సక్సెస్ ఫుల్ ప్రోగ్రామ్స్ ను చేసిన ఉదయ భాను.. ఆతరువాత కొన్ని కాంట్రవర్సీస్ ను ఫేస్ చేసింది. పెళ్ళి తరువాత ఫీల్డ్ కు కాస్త దూరంగా జరిగిన భాను.. రీసెంట్ గా మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి..మళ్లీ ఫామ్ లోకి వద్దామనిచూసింది. కాని ఈమెకు అవకాశాలు రాలేదు.. వచ్చినా.. ఆమె చేసిన ప్రోగ్రామ్స్ కు రేటింగ్ లేదు. దాంతో ఉదయ భాను సెకండ్ ఇన్నింగ్స్ నిరాశనే మిగిల్చింది. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhanush vs Vignesh: ధనుష్‌ తిన్న తర్వాతే తినేవాడిని, కానీ.. స్టార్‌ హీరోతో గొడవపై నయనతార భర్త ఎమోషనల్‌ కామెంట్‌
Recommended image2
Leader Box Office: బాక్సాఫీస్ వద్ద లెజెండ్‌ శరవణన్‌ 'లీడర్' సంచలనం.. మూడు రోజుల్లో ఊహించని వసూళ్లు
Recommended image3
Top Cinema Song: 93 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్‌ని ఊపేస్తున్న పాట ఇదే.. తెలుగులోనే నెం 1, వింటే ఊగిపోవాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved