రాంగ్ రూట్ లో ప్రభాస్, వరుస ఫ్లాపులు.. కృష్ణం రాజు గమనించి ఏం చేశారో తెలుసా, దటీజ్ రెబల్ స్టార్..
నేడు ప్రభాస్ తన 45 వ జన్మదిన వేడుకల్ని సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు. దీనితో ప్రభాస్ కి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక దశలో ప్రభాస్ వరుస పరాజయాలు ఎదుర్కొని సతమతమయ్యారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తిరుగులేని పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నారు. బాహుబలి చిత్రంతో అద్భుతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్..కల్కి చిత్రంతో పాన్ ఇండియా మార్కెట్ ని పదిలం చేసుకున్నాడు. నేడు ప్రభాస్ తన 45 వ జన్మదిన వేడుకల్ని సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు. దీనితో ప్రభాస్ కి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కృష్ణం రాజు వారసుడిగా ప్రభాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ సాఫీగానే జరిగింది.. కానీ తొలి సక్సెస్ మాత్రం వర్షం చిత్రంతో దక్కింది. ఒక దశలో ప్రభాస్ వరుస పరాజయాలు ఎదుర్కొని సతమతమయ్యారు. పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, ఏ నిరంజన్ ఇలా వరుస డిజాస్టర్లు గురయ్యాయి. మధ్యలో బిల్లా చిత్రం మాత్రమే పర్వాలేదనిపించింది.
ప్రభాస్ అభిమానుల్లో కూడా ఆందోళన నెలకొంది. ప్రభాస్ కెరీర్ రాంగ్ రూట్ లో వెళుతోంది అని కృష్ణం రాజు అప్పుడే గమనించారు. ఎలాగైనా కెరీర్ గాడిలో పెట్టాలని అనుకున్నారు. ప్రభాస్ వరుసగా సీరియస్ చిత్రాలు చేస్తున్నాడు. అవి తేడా కొడుతున్నాయి అని కృష్ణం రాజు అనుకున్నారట. ఇక సీరియస్ కథలకు ఫుల్ స్టాప్ పెట్టాలని రంగంలోకి దిగారు. ఈ విషయాన్ని మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ దర్శకుడు దశరథ్ ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టారు.
ప్రభాస్ సీరియస్ కథలకు ఫుల్ స్టాప్ పెట్టి ఫ్యామిలీ కథలు చేయాలనేది కృష్ణంరాజు గారి నిర్ణయం. డార్లింగ్ కథని సెలెక్ట్ చేసింది ఆయనే. ఆ తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ కథ రెడీ కావడానికి కూడా కారణం ఆయనే అని దశరథ్ తెలిపారు. డార్లింగ్ చిత్రంతో ప్రభాస్ ఫ్లాపులకు అడ్డుకట్ట పడింది. ఆ తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం కూడా సూపర్ హిట్ అయింది.
డార్లింగ్ తర్వాత ప్రభాస్ కి పెద్దగా ఫ్లాపులు ఎదురుకాలేదు. మిర్చి చిత్రం సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత బాహుబలి వచ్చింది. బాహుబలి తర్వాత చేసిన చిత్రంలో పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు అందుకోలేకపోయాయి. కానీ కల్కి చిత్రం ప్రభాస్ అభిమానుల ఆకలి తీర్చింది అని చెప్పొచ్చు.