హీరోయిన్లు సర్జరీలు చేయించుకోవడానికి కారణం ఇదే.! రాధికా ఆప్టే షాకింగ్ కామెంట్స్..
తమిళ బ్యూటీ రాధికా ఆప్టే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ లో పుల్ బిజీగా ఉన్న ఈ హీరోయిన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పలు ఆశ్చర్యకర విషయాలను వెల్లడించింది. హీరోయిన్ల సర్జరీల వెనుక ఉన్న అసలు కారణం ఇదేనంటూ.. షాకింగ్ కామెంట్స్ చేసింది.

స్టార్ హీరోయిన్ రాధికా ఆప్టే (Radhika Apte) దాదాపు అన్నీ భాషల చిత్రాల్లో నటించింది. అటు హాలీవుడ్ మూవీలోనూ నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ బ్యూటీ ప్రస్తతం వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
అయితే, రంగుల ప్రపంచంలో హీరోయిన్ల చలామణీ కాలం చాలా తక్కువగా ఉంటుంది. అందులో స్టార్ హీరోయిన్ గా ఏండ్లపాటు కొనసాగాలంటే కష్టమైన పనే అని చెప్పాలి. ఎప్పుడూ ఫిట్ గా, గ్లామర్ గా కనిపించేందుకు హీరోయిన్లు ఎంతగానో శ్రమిస్తారు. ఎన్నో ప్రయోగాలనూ చేస్తుంటారు.
ముఖ్యంగా తమ అందం, శరీరాక్రుతిని ఆకర్షణీయంగా ఉంచుకునేందుకు నిత్యం ఎక్సర్ సైజులు, పార్లర్లలోనే ఎక్కువ సమయం గడుపుతుంటారు. అందుకు అనుగుణంగానే కఠినమైన డైట్ కూడా ఫాలోఅవుతుంటారు. మరికొందరు శరీర సౌందర్యం కోసం సర్జరీలు కూడా చేయించుకునేందుకు వెనకాడరు.
ఇప్పటికే పలువురు హీరోయిన్లు సర్జరీలు (Heroines Surgeries) చేయించుకున్న విషయం ప్రచారంలో ఉంది. దీనిపై తాజాగా బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్డే స్పందించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్న ఈ సుందరి సర్జరీలపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఏం చెప్పిందంటే..
నా తోటి హీరోయిన్స్ లు తమ ముఖాలను, శరీర భాగాలలో మార్పుచేసుకునేందుకు సర్జరీలు చేయించుకోవడం భరించలేకపోతున్నాను. హీరోయిన్స్ సర్జరీల ముఖాలను చూడలేక అలిసిపోయాను. ఇది ఇండస్ట్రీలో కథనాయికలు ఎదుర్కొంటున్న సమస్యలో ఒకటిగా చెప్పొచ్చు.
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు వయస్సుతో పోరాడలేక.. శరీరంతో పోరాడుతున్నారు. హీరోయిన్లు మనుగడ సాగించేందుకే ఇంతలా సర్జరీలు చేయించుకోవడం జీర్ణించుకోలేకపోతున్నాను. నా తెలిసిన వారే ముఖం, శరీర ఆకృతిని మార్చుకునేందుకు సర్జరీలు చేయించుకున్నారు.. అంటూ చెప్పుకొచ్చింది.
రాధికా ఆప్డే తెలుగు ఆడియెన్స్ కూడా పలు చిత్రాల్లో నటించి అలరించింది. తొలుత సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (RGV) దర్శకత్వం వహించిన ‘రక్త చరిత్ర’ ద్వారా తెలుగు టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం క్రియేట్ సెన్సేషన్ అంతాఇంతా కాదు. మూవీలో రాధికా ఆప్టే నటనకు కూడా ఆడియెన్స్ నుంచి మంచి మార్కులే పడ్డాయి.
అలాగే రాధికా నందమూరి నటసింహం, సీనియర్ నటుడు బాలకృష్ణ (Balakrishna) సరసన ‘లెజెండ్, లయన్’ చిత్రాల్లోనూ హీరోయిన్ గా నటించి మెప్పించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉంది రాధికా. ఫోరెన్సిక్, విక్రమ్ వేద సినిమాల్లో నటిస్తోంది. అదేవిధంగా నెట్ ఫ్లిక్ వేదికన రిలీజ్ కానున్న మరో చిత్రంలోనూ కనిపించనుంది.