MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వివాదాస్పద సింగర్ కనికా చరణ్ వైఫ్ ఉపాసనకు బెస్ట్ ఫ్రెండ్ ఎలా?... వాళ్ళిద్దరికీ ఉన్న లింక్ ఇదే!

వివాదాస్పద సింగర్ కనికా చరణ్ వైఫ్ ఉపాసనకు బెస్ట్ ఫ్రెండ్ ఎలా?... వాళ్ళిద్దరికీ ఉన్న లింక్ ఇదే!

రామ్ చరణ్ వైఫ్ ఉపాసనకు సింగర్ కనికా కపూర్ బెస్ట్ ఫ్రెండ్ అని తెలుస్తుంది. కనికా వివాహ వేడుక కోసం ఉపాసన ఏకంగా లండన్ వెళ్లారంటే అర్థం చేసుకోవచ్చు. యూపీకి చెందిన కనికా ఉపాసనకు అంత క్లోజ్ ఫ్రెండ్ ఎలా అయ్యారనేది పరిశీలిస్తే కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి.

2 Min read
Author : Sambi Reddy
Published : May 25 2022, 08:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
upasana kanika kapoor

upasana-kanika kapoor

యూపీకి చెందిన కనికా కపూర్ 18 ఏళ్లకే పెళ్లి చేసుకున్నారు. భర్త రాజ్ ఛన్దోక్ లండన్ లో బిజినెస్ మాన్ కాగా అక్కడే సెటిల్ అయ్యారు. వీరికి ముగ్గురు సంతానం. మనస్పర్థలతో రాజ్ కి 2012లో విడాకులు ఇచ్చింది. అప్పటి నుండి ఒంటరిగా ఉంటున్న కనికా కపూర్ ఇటీవల 43ఏళ్ల వయసులో గౌతమ్ అనే బిజినెస్ మాన్ ని వివాహం చేసుకుంది.

26
Singer Kanika Kapoor Wedding Photos

Singer Kanika Kapoor Wedding Photos

కనికా కపూర్ రెండో వివాహానికి ఉపాసన హాజరయ్యారు. నవదంపతులతో, మిత్రులతో ఫోటోలు దిగారు. కనికా పెళ్లి వేడుకలో ఉపాసన ఫోటోలు వైరల్ అయ్యాయి. లేటెస్ట్ గా కనికాను ఉద్దేశిస్తూ తమది ఎప్పటికీ వీడని గొప్ప రిలేషన్ అంటూ ఇంస్టాగ్రామ్ పోస్ట్ చేశారు ఉపాసన. అసలు ఈ కాంట్రవర్సియల్ సింగర్ ఉపాసనకు ఫ్రెండ్ ఎప్పుడయ్యారనే సందేహాలు మొదలయ్యాయి.

36


గతంలో కనికా కపూర్-ఉపాసన కలిసిన సందర్భాలు లేవు. వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు కూడా ప్రాచుర్యంలోకి రాలేదు. అయితే బిజినెస్ ఉమన్ గా ఉపాసనకు ప్రపంచవ్యాప్తంగా స్నేహితులు, సన్నిహితులు ఉన్నారు. అలాగే కనికా నార్త్ ఇండియాకు చెందిన పెద్ద బిజినెస్ గ్రూప్ కుటుంబానికి చెందిన వారసురాలు. ఆ విధంగా ఆమెకు కనికాతో స్నేహం కుదిరి ఉండవచ్చు. 

46

కాగా 2020 లాక్ డౌన్ సమయంలో కనికా కపూర్ వివాదాల్లో చిక్కుకున్నారు. కరోనా భయంతో ప్రపంచం వణుకుతున్న దశలో కనికా లండన్ నుండి ఇండియా వచ్చారు. వచ్చిన వెంటనే పలు పార్టీల్లో పాల్గొన్నారు. చివరికి ఆమెకు కరోనా సోకినట్లు నిర్ధారణ కావడం పెద్ద సంచలనంగా మారింది. నెటిజెన్స్ ఆమెపై తీవ్ర ఆరోపణలు చేశారు.

56

ఇంతటి భయానక పరిస్థితులలో కనీస బాధ్యత లేకుండా కనికా పార్టీల్లో పాల్గొనడం ఏమిటంటూ విమర్శల దాడికి దిగారు. ఆమె కుటుంబం బెదిరింపులను ఎదుర్కొంది. కనికా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో పాటు చావు అంచులకెళ్లి తిరిగొచ్చారు . కనికా జీవితంలో అది పెద్ద వివాదమని చెప్పొచ్చు.

66


కనికా తాను పాలొన్న పార్టీలకు సంబంధించిన సమాచారం కూడా తప్పుగా చెప్పారు. లండన్ నుండి వచ్చాక ఆమె ఉన్న హోటల్ లోనే సౌత్ ఆఫ్రికా టీమ్ సభ్యులు స్టే చేశారు. అలా ఆమె వ్యవహారం వివాదాస్పదమైంది. కాగా పుష్ప హిందీ వెర్షన్ లో ఊ అంటావా ఊ ఊ అంటావా సాంగ్ ని కనికా పాడటం విశేషం. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Illu Illalu Pillalu Today Episode Feb 24: నీకు బుద్ధుందా? తండ్రికి క్లాసు పీకిన నర్మద, ఏజెంట్‌ను పడేసిన వల్లి
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: రోహిణీ పని ఔట్, బాలుని ట్రాప్ చేసిన వింధ్య, అత్తను వణికించేసిన మీనా
Recommended image3
ViRosh Wedding: విరోష్ పెళ్లి సందడి షురూ.. మెహెందీ, సంగీత్ తో పాటు ఈవెంట్స్ ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved