ఎన్టీఆర్ ని బెడ్ రూమ్ సీన్ లో కాలితో తాకిన హీరోయిన్, అందరూ షాక్, ఆయన రియాక్షన్ ఏమిటో తెలుసా?
లెజెండ్ ఎన్టీఆర్ ని ఒక హీరోయిన్ కాలితో తాకిందట. ప్రొడ్యూసర్ తో పాటు చిత్ర యూనిట్ అందరూ షాక్ అయ్యారట. మరి ఎన్టీఆర్ ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసా?
నందమూరి తారకరామారావు వెండితెరను మకుటం లేని మహారాజుగా ఏలారు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. నెంబర్ వన్ హీరోగా దశాబ్దాల పాటు ఆయన ప్రస్థానం కొనసాగింది. ఎన్టీఆర్ అంటే అందరికీ చాలా గౌరవం ఉండేది. ఆయన ముందు ఎవరూ కుర్చీలో కూర్చునేవారు కాదట. ఎన్టీఆర్ స్టార్డం, క్రమశిక్షణ పరిశ్రమలో మహోన్నత వ్యక్తిగా మార్చాయి. ఇక వివిధ తరాల హీరోయిన్స్ ఎన్టీఆర్ కి జంటగా నటించారు.
కాగా ఒక హీరోయిన్ ఎన్టీఆర్ ని కాలితో తాకిందట. అంత డేర్ చేసిన హీరోయిన్ ఎవరు? ఎందుకు అలా చేసింది? అని పరిశీలిస్తే.. హిందీలో అమితాబ్ నటించిన దీవార్ మూవీ బ్లాక్ బస్టర్. ఆ సినిమా చేయాలని ముచ్చటపడిన ఎన్టీఆర్ తెలుగులో రీమేక్ చేశాడు. మగాడు టైటిల్ తో దీవార్ సినిమాను ఎన్టీఆర్ తెలుగులో చేశారు.
ఎన్టీఆర్ రోల్ కొంత నెగిటివ్ షేడ్స్ తో కూడి ఉంటుంది. ఎస్ డి లాల్ దర్శకుడు. మంజుల హీరోయిన్ గా చేసింది. రామకృష్ణ, లత ఇతర ప్రధాన పాత్రలు చేశారు. ఈ మూవీలో మంజుల-ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఒక బెడ్ రూమ్ సన్నివేశం ఉందట. ఈ సీన్ లో ఎన్టీఆర్ ని మంజుల కాలితో తాకుతూ దగ్గరకు రమ్మన్నట్లు సైగ చేస్తుంది.
ఎన్టీఆర్ వంటి అంత పెద్ద స్టార్ ని కాలితో మంజుల తాకడంతో అందరూ షాక్ అయ్యారట. మగాడు మూవీ నిర్మాత లక్ష్మి రాజ్యం... సీన్ పూర్తి అయ్యాక, అదేంటి అమ్మాయి, ఎన్టీఆర్ ని కాలితో తాకావు? రేపు ఆయన ఫ్యాన్స్ అసలు ఊరుకుంటారా? అని మంజుల తో అన్నారట.
అక్కడే ఉన్న ఎన్టీఆర్ మంజులను సమర్ధించారట. పర్వాలేదు. సన్నివేశం చేసేటప్పుడు నటులు కాదు. పాత్రలు మాత్రమే కనిపించాలి. మంజుల నన్ను కాలితో తాకడం సమంజసమే అన్నారట. మగాడు మూవీలో మంజుల క్లబ్ డాన్సర్ రోల్ చేసింది. ప్రముఖ నటుడు విజయ్ కుమార్ ని మంజుల వివాహం చేసుకుంది. వీరికి వనిత, ప్రీత, శ్రీదేవి కూతుర్లు. 2013లో మంజుల కన్నుమూశారు.
వనిత విజయ్ కుమార్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్. పేరెంట్స్ తో కూడా ఆమె అనేకమార్లు గొడవకు దిగింది. ప్రీత, శ్రీదేవి కూడా హీరోయిన్స్ గా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యారు. పెద్దగా సక్సెస్ కాలేదు.